దసరా, దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో అమెజాన్ (Amazon Sale) మరో భారీ సేల్‌కు సిద్ధమవుతోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను (Amazon Great Indian Festival Sale) ప్రకటించింది అమెజాన్. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని తెలపింది. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు అధికారిక టీజర్లో పేర్కొంది. మరోవైపు, ఎకో, కిండ్ల్, ఫైర్ టీవీ వంటి ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అయితే, ఈ సేల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు ముగుస్తుంది? డీల్స్ వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.
అక్టోబర్‌లో ఈ సేల్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే గ్రేట్ ఇండియన్ సేల్ 2021లో పాల్గొనే బ్యాంక్ జాబితాను అమెజాన్ ధ్రువీకరించింది. ప్రైవేట్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే ప్రతి ప్రొడక్ట్‌పై 10 శాతం అదనపు డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది.
Realme GT Master Edition: రూ.25,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8,999 ధరకే... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్
Fit all your needs within your budget, with great deals and bank discounts, at #AmazonGreatIndianFestival #ComingSoon pic.twitter.com/2cdp9Zx3HP
— Amazon India (@amazonIN) September 19, 2021
అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. వీటికి అదనంగా రూ. 750 జాయినింగ్ బోనస్‌ను కూడా అందిస్తామని తెలిపింది. ఇక, బజాజ్ ఫిన్‌సర్వ్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో రూ. 1 లక్షలోపు కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, రూ. 25,000 వరకు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించింది.
Find My Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ పోయిందా? ఈ టిప్స్‌తో ఫోన్ ఎక్కడుందో తెలుసుకోండి
ప్రతి సంవత్సరం లాగే, అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒక రోజు ముందే సేల్‌కు యాక్సెస్ లభిస్తుంది. అంతేకాదు, ప్రైమ్ మెంబర్స్‌కు స్పెషల్ డీల్స్, ఫ్రీ హోమ్ డెలివరీ, ఫాస్ట్ హోమ్ డెలివరీ వంటి సౌకర్యాలను అందిస్తోంది. మూడు నెలల కాలానికి ప్రైమ్ మెంబర్షిప్ పొందాలంటే రూ .329, ఏడాది కాలానికి రూ .999 చెల్లించాలని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Amazon prime, Hdfc, HDFC bank