Home /News /technology /

AMAZON GREAT INDIAN FESTIVAL SALE 2021 ONEPLUS 9 AND ONEPLUS 9 PRO WILL AVAILABLE WITH RS 15000 DISCOUNT SS GH

OnePlus 9 Discount: వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

OnePlus 9 Discount: వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

OnePlus 9 Discount: వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలివే

OnePlus 9 Discount | వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్స్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై రూ.15,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.

పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్​ను (Amazon Great Indian Festival) ప్రకటించింది. ఈ సేల్​ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. సేల్​లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లతో సహా వివిధ ఉత్పత్తులపై ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డీల్స్​ ప్రకటించింది. వన్​ప్లస్ 9 సిరీస్​పై భారీ డిస్కౌంట్లు అందిస్తామని తెలిపింది. తద్వారా వన్​ప్లస్​ 9 (OnePlus 9), వన్​ప్లస్​ 9 ప్రో (OnePlus 9 Pro) మోడల్స్​ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వన్​ప్లస్​ 9 ప్రోపై రూ.15 వేల డిస్కౌంట్ అందిస్తామని అమెజాన్ తెలిపింది. దీని అసలు ధర రూ. 64,999 వద్ద ఉండగా.. కేవలం రూ .50 వేలలోపు కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్​ 9పై కూడా రూ. 10 వేల డిస్కౌంట్​ ప్రకటించింది. ఇది రూ .40 వేలలోపు అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy M32 5G: రిలీజ్ అయిన నెల రోజులకే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.5,000 తగ్గింది

వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో స్మార్ట్​ఫోన్లపై అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్లు ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయనే విషయంపై అమెజాన్​ స్పష్టతనివ్వలేదు. కానీ అన్ని వేరియంట్లపై డిస్కౌంట్​ అందిస్తామని తెలిపింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సేల్ అక్టోబర్ 3న ప్రారంభమవుతుంది. సేల్ ముగిసే వరకు ఈ ఆఫర్స్ పొందొచ్చు. అయితే లిమిటెడ్ స్టాక్ పైన ఆఫర్స్ ఉంటే మొదట కొన్నవారికే డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది.

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్

వన్​ప్లస్​ 9 ప్రో మోడల్​పై రూ.15 వేల తగ్గింపు


వన్‌ప్లస్ 9 ప్రో 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ మోడళ్లు రూ. 69,999 ధర వద్ద అందుబాటులో ఉండనున్నాయి. వన్​ప్లస్​ 9 ఫోన్​ 8 జీబీ ర్యామ్​, 12 జీబీ ర్యామ్​ రెండు మోడళ్లను రూ .54,999 ధర వద్ద అందుబాటులోకి తేనుంది. వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్లను పరిశీలిస్తే.. వీటిలో హాసెల్‌బ్లాడ్ ట్యూనింగ్‌ కెమెరాలను చేర్చింది. ఇవి క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్లు 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఇవి వార్ప్ ఛార్జ్ 65T ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్‌ 6.55 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. 9 ప్రో మోడల్​ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 9 ప్రోలో కెమెరాలు పెద్ద హైలైట్‌గా చెప్పవచ్చు. దీనిలో 48 ఎంపీ సోనీ IMX789 సెన్సార్‌ కెమెరా, 50 ఎంపీ సోనీ IMX766 సెన్సార్‌ కెమెరా, 8 ఎంపీ టెలిఫోటో సెన్సార్ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్‌ కెమెరాలను అందించింది. మరోవైపు, వన్‌ప్లస్ 9 మోడల్​లో సోనీ 48 ఎంపీ IMX689 సెన్సార్‌ కెమెరా, 50 ఎంపీ సోనీ IMX766 సెన్సార్ కెమెరా, 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్‌ కెమెరాలను అమర్చింది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Mobile News, Mobiles, Oneplus, Smartphone

తదుపరి వార్తలు