Amazon Great Indian Festival Sale | గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 ప్రకటించిన నాటి నుంచి ఈ సేల్‌లో ఈ ఏడాదిలోనే తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తామని చెబుతోంది అమెజాన్. వేర్వేరు స్మార్ట్ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగబోతున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం నుంచే సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్‌పై డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. వాటితో పాటు స్మార్ట్ఫోన్లపై ఏకంగా 40% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే హానర్ స్మార్ట్ఫోన్ల డిస్కౌంట్స్‌ని వెల్లడించింది. హానర్ 10 లైట్, హానర్ 20ఐ, హానర్ 8ఎక్స్, హానర్ 9ఎన్, హానర్ వ్యూ20 స్మార్ట్ఫోన్ల డిస్కౌంట్లను ప్రకటించింది. ఆ వివరాలు ఇవే...
Honor 10 Lite: హానర్ 10 లైట్ 6 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా, ఆఫర్ ధర రూ.9,999.
Honor 20i: హానర్ 20ఐ 4 జీబీ+128 జీబీ వేరియంట్ అసలు ధర రూ.13,999 కాగా, ఆఫర్ ధర రూ.11,999.
Honor 8X: హానర్ 8ఎక్స్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.11,999 కాగా, ఆఫర్ ధర రూ.9,999.
Honor 9N: హానర్ 9ఎన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.9,999 కాగా, ఆఫర్ ధర రూ.8,499.
Honor View20: హానర్ వ్యూ20 స్మార్ట్‌ఫోన్ 4 జీబీ+64 జీబీ వేరియంట్ అసలు ధర రూ.24,999 కాగా, ఆఫర్ ధర రూ.23,499.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2019 ప్రకటించిన నాటి నుంచి ఈ సేల్‌లో ఈ ఏడాదిలోనే తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తామని చెబుతోంది అమెజాన్. వేర్వేరు స్మార్ట్ఫోన్లపై 40% వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఇక ఈ సేల్‌లో 15 కొత్త స్మార్ట్ఫోన్లు కూడా రిలీజ్ కాబోతున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్స్ అయిన వన్‌ప్లస్ 7టీ, సాంసంగ్ ఎం10ఎస్, వివో యూ10, ఎంఐ ఏ3 మోడల్స్‌పై డిస్కౌంట్స్ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులపై 10% అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డులపై, బజాజ్ ఫిన్సర్వ్ కస్టమర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయి.
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.