హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్ సేల్‌లో రూ.30వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన మోడళ్లు ఇవే..

Amazon: అమెజాన్ సేల్‌లో రూ.30వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన మోడళ్లు ఇవే..

Amazon: అమెజాన్ సేల్‌లో రూ.30వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన మోడళ్లు ఇవే..

Amazon: అమెజాన్ సేల్‌లో రూ.30వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన మోడళ్లు ఇవే..

Amazon: అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’లో ల్యాప్‌టాప్స్‌పై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. విద్యార్థులకు ఉపయోగపడేలా అద్భుతమైన ఫీచర్స్‌తో రూ.30,000లోపు లభిస్తున్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లను పరిశీలిద్దాం.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫెస్టివల్ సీజన్‌ (Festival Season)లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ (Amazon Great Indian Festival Sale) పేరుతో మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్ యాక్సెసరీస్, హోమ్ నీడ్స్ వంటి మరెన్నో ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్స్‌పై బెస్ట్ డీల్స్ పొందవచ్చు. విద్యార్థులకు ఉపయోగపడేలా అద్భుతమైన ఫీచర్స్‌తో రూ.30,000లోపు లభిస్తున్న బెస్ట్ ల్యాప్‌టాప్‌లను పరిశీలిద్దాం.

* హానర్ మ్యాజిక్‌బుక్ X 15

ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల FHD ఫుల్ వ్యూ IPS యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో అందుబాటులో ఉంది. 65W చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే టైప్-సి పవర్ అడాప్టర్‌‌తో లభిస్తుంది. కేవలం 30 నిమిషాల్లో 59% బ్యాటరీ ఛార్జ్ అందుకుంటుందని కంపెనీ పేర్కొంది. Windows 11 హోమ్ 64-బిట్ ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. 2-ఇన్-1 ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ వంటి అదనపు ఫీచర్‌ కూడా ఇందులో ఉంది. ఫెస్టివల్ సీజన్ సేల్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌పై అమెజాన్ 40శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ప్రస్తుతం దీన్ని రూ. 29,990కు సొంతం చేసుకోవచ్చు.

* హెచ్‌పీ క్రోమ్‌బుక్ 14ఎ (HP Chromebook 14a)

ఈ ల్యాప్‌టాప్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇది 14-అంగుళాల FHD టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. క్రోమ్ 64 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది. ఈ ల్యాప్‌టాప్ ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు గూగుల్ అసిస్టెంట్‌ ఇన్ బిల్ట్‌గా వస్తుంది. 4 GB LPDDR4 ర్యామ్‌తో 64GB eMMC స్టోరేజ్ కెపాసిటీని ఇది అందిస్తుంది. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా అమెజాన్‌లో ఈ ల్యాప్‌టాప్ ₹21,990కు అందుబాటులో ఉంది.

* లెనోవో ఐడియాపాడ్ స్లిమ్ 3

ఈ ల్యాప్‌టాప్‌ అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉంది. 4వ జెన్ ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌తో ఇది రన్ అవుతుంది. ఇందులో 720 MPతో ప్రైవసీ షట్టర్, ఫిక్స్‌డ్ ఫోకస్, అర్రే మైక్రోఫోన్‌ సెటప్ ఉంటుంది. ఇది15.6-అంగుళాల HD స్క్రీన్‌‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌లో డ్యూయల్ 1.5వాట్ స్టీరియో స్పీకర్లను అమర్చారు. ప్రస్తుతం అమెజాన్ లో ఈ ల్యాప్‌టాప్ రూ. 27,490 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది.

* ఆసుస్ వివోబుక్ 15

ఈ ల్యాప్‌టాప్1366 x 768 HD రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల LED-బ్యాక్‌లిట్ LCD డిస్‌ప్లేతో లభిస్తుంది. 82% స్క్రీన్-టు-బాడీ రేషియో, ఇంటెల్ సెలెరాన్ N4020 ప్రాసెసర్‌తో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఆసుస్ వివోబుక్ 15 జీవితకాల చెల్లుబాటుతో ఫ్రీ లోడెడ్ విండోస్ 11 హోమ్‌తో వస్తుంది. గరిష్టంగా 6 గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఈ ల్యాప్‌టాప్ అమెజాన్‌లో రూ. 25,990 డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఆఫర్ సేల్ కోసం అమెజాన్ ఎస్‌బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ బ్యాంకు కార్డులతో కొనుగోళ్లు చేస్తే అదనంగా 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Laptops, Tech news

ఉత్తమ కథలు