Amazon Freedom Festival: అమెజాన్‌ లో మళ్లీ ఆఫర్ల పండగ.. 5 నుంచి గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌.. ఆఫర్ల వివరాలివే..

అమెజాన్ లోగో

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ పేరుతో ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహించనుంది. ఈ సేల్ లో లభించినున్న ఆఫర్లు, డిస్కౌంట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
అమెజాన్‌లో ఆఫర్ల కోసం వేచిచూస్తున్నవారికి గుడ్‌ న్యూస్‌. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ సరికొత్త సేల్‌ను అనౌన్స్‌ చేసింది. అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌ పేరుతో ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు నిర్వహిస్తోంది. మరి ఇందులో ఆఫర్లేంటి, డిస్కౌంట్‌ల సంగతేంటో చూద్దాం! గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ సేల్‌లో మొబైల్స్‌, యాక్సెసరీస్‌ మీద గరిష్ఠంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌ పొందొచ్చని అమెజాన్‌ చెబుతోంది. అదే ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీస్‌ మీద అయితే 60 శాతం... టీవీలు, అప్లయెన్సెస్‌ మీద అయితే 55 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నారట. దీంతోపాటు స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా కార్డు మీద 10శాతం డిస్కౌంట్‌ కూడా అదనంగా ఇవ్వనున్నారు. దీంతోపాటు క్యాష్‌బ్యాక్స్‌ కూడా ఎలాగూ ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

-కొత్త ల్యాప్‌టాప్ కొనేవారికి గరిష్ఠంగా ₹30 వేలు డిస్కౌంట్‌ లభిస్తుంది. ప్రింటర్లు తదితర యాక్సెసరీల మీద 30 శాతం డిస్కౌంట్‌ ఇస్తారు.

- స్మార్ట్‌వాచ్‌లు, వైఫై రూటర్లు, మెమొరీ కార్డులు, స్మార్ట్‌ సెక్యూరిటీ కెమెరాల మీద గరిష్ఠంగా 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

-అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు మూడు నెలల నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. దీని ద్వారా వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు పొందవచ్చు.

-ఇటీవల లాంచ్‌ అయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 2, వన్‌ ప్లాస్‌ నార్డ్‌ సీఈ5జీ, శాంసంగ్‌ ఎం21 2021, ఐకూ జెడ్‌3 5జీ లాంటి ఫోన్ల మీద కూడా డిస్కౌంట్‌ ఇస్తున్నారు. మోడల్‌ను బట్టి అమెజాన్ తగ్గింపులను ప్రకటించింది.

-40 అంగుళాలు, 43 అంగుళాల టీవీలు కొనుగోలు చేస్తే 50 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తారు.

-4K రిజల్యూషన్‌ టీవీలు, ప్రొజెక్టర్లు తీసుకుంటే 60 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

-అమెజాన్‌ ఎకో స్మార్ట్‌ స్పీకర్లు, స్మార్ట్‌ డిస్‌ప్లేలు కొనుగోలు చేసేవారు 45 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు.

-ఫైర్‌ టీవీ డివైజ్‌లు కొనుగోలు చేసినవారికి 44 శాతం తగ్గింపు లభిస్తుంది.

-ఇవే కాకుండా ఎయిర్‌ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, మైక్రో వేవ్‌లు, చిమ్నీలు లాంటి ఇతర వస్తువులు, సామగ్రి, ఫర్నిచర్‌పై భారీ డిస్కౌంట్‌లను ప్రకటించింది అమెజాన్.

- ఇవన్నీ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మాత్రమే. సేల్‌ మొదలైనప్పుడు ధరలు చూసి కొనుగోలు నిర్ణయం తీసుకోగలరు.
Published by:Nikhil Kumar S
First published: