అమెజాన్ ప్రైమ్ డే సేల్ ముగిసి దాదాపు వారం రోజులు అవుతోంది. కంపెనీ ఇప్పుడు ఆగస్టు నెలలో మరో బిగ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో వివిధ క్యాటగిరీల నుంచి ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. కొత్తగా లాంచ్ అయిన ఫోన్లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్‌లు తక్కువ ధరలకు లభిస్తాయి.
* అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తేదీ, బ్యాంక్ ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ భారతదేశంలో ఆగస్టు 6 నుంచి ఆగస్టు 10 మధ్య జరుగుతుంది. ఈసారి కొనుగోలుదారులు ఎంపిక చేసిన వస్తువులపై ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందుతారు. ప్లాట్‌ఫారమ్‌లో కొత్త కొనుగోలుదారులు వారి మొదటిసారి కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు.
* ఆఫర్స్ ఇవే..
ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, యాక్ససరీస్‌పై అమెజాన్ 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది. కొన్ని ఎంట్రీ లెవల్ ఫోన్లు రూ.6,599 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో కొత్త మోడళ్లు లాంచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇందులో వన్‌ప్లస్ 10T(OnePlus 10T), ఐక్యూ 9T(iQOO 9T) వంటివి ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు ఆగస్టు 3న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లు ప్రత్యేకంగా ఈ సేల్‌లో అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇటీవల లాంచ్ అయిన రెడ్మీ K50i 5G(Redmi K50i 5G) కార్డ్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో రెండో సేల్ ద్వారా అందుబాటులోకి రానుంది. దీన్ని రూ.20,999 కంటే తక్కువ మొత్తానికి సొంతం చేసుకునే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ M13(Samsung Galaxy M13), ఐక్యూ నియో 6 5G(iQOO Neo 6 5G), టెక్నో కామన్ 19 Neo(Tecno Camon 19 Neo), టెక్నో స్పార్క్(Tecno Spark 9) కూడా ఈ సేల్‌లో ప్రత్యేక ధరలతో అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులు ఈ డివైజ్‌లపై బ్యాంక్ కార్డ్‌ల డిస్కౌంట్లను పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్ కొనుగోళ్లపై నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఈ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌లు, గేమింగ్ యాక్సెసరీలు, TWS ఇయర్‌బడ్స్, కెమెరాలపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. Boat Airdopes 121 Pro TWS ఇయర్‌బడ్స్, GoPro Hero 10 బండిల్ వంటి కొత్తగా లాంచ్ అయిన ప్రొడక్ట్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
అమెజాన్ అలెక్సా, కిండ్ల్, ఫైర్ టీవీ స్టిక్ వంటి స్మార్ట్ హోమ్ డివైజ్‌లపై కొనుగోలుదారులు 45 శాతం వరకు తగ్గింపును కూడా పొందుతారు. కొనుగోలుదారులు కొన్ని నోట్‌బుక్‌లపై రూ.40,000 వరకు డిస్కౌంట్ పొందుతారు. HP Victus 2022 మోడల్, LG గ్రామ్ సిరీస్ వంటి కొన్ని కొత్త ల్యాప్‌టాప్‌లు కూడా సేల్‌లో అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా సూపర్ సేవింగ్ డేస్ సేల్‌తో ఆగస్టు 6 నుంచి ఇండియాలో ఆఫర్లను ప్రారంభించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon sales, Electronics, Smart phones