Great Republic Day Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఇండియా (Amazon) అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంచింది. స్మార్ట్‌ఫోన్ (Smartphone) కొంటే ఉచితంగానే ఇయర్ ఫోన్స్ అందిస్తోంది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరు కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే ఈ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని గుర్తించుకోవాలి.
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ఇంకా జనవరి 20 వరకే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీరు ఈ ఉచిత ఇయర్ ఫోన్స్ డీల్స్ పొందటానికి మరో రెండు రోజులు మాత్రమే ఉంది. రియల్‌మి, షావోమి ఎంఐ, ఐకూ స్మార్ట్‌ఫోన్లు కొంటేనే ఈ ఉచిత ఇయర్ ఫోన్స్ లభిస్తాయి. దాదాపు రూ. 899 విలువైన ఇయర్ ఫోన్స్‌ను ఉచితంగా పొందొచ్చని అమెజాన్ పేర్కొంటోంది.
50 శాతం డిస్కౌంట్.. రూ.6 వేల కన్నా తక్కువకే అదిరే టీవీ, నెలకు రూ.300 కడితే చాలు!
ఉచిత ఇయర్ ఫోన్ ఆఫర్ ఎలా ఫొందాలి? ఏమైనా కూపన్ కోడ్ వంటివి ఉంటాయా? అంటే ఏమీ ఉండవు. డైరెక్ట్‌గానే ఆఫర్ వర్తిస్తుంది. మీకు నచ్చిన ఫోన్ ఎంచుకోవాలి. తర్వాత పేమెంట్ చేయాలి. అడ్రస్, పేమెంట్ వివరాలు అందించాలి. తర్వాత ఉచిత ఇయర్ ఫోన్స్ ఆటోమేటిక్‌గానే మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా వచ్చేస్తాయి.
రూ.5,999 ఇయర్ ఫోన్స్ రూ.999కే.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 32 గంటల పాటు పాటలు వినొచ్చు
ప్రస్తుతం రెడ్‌మి ఏ1 స్మార్ట్‌ఫోన్‌కే ఉచిత ఇయర్ ఫోన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఎంఆర్‌పీ రూ. 8,999. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ. 5699కు కొనొచ్చు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే ఐకూ జెడ్6 లైట్ 5జీ ఫోన్‌పై కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగిన ఫోన్‌ను రూ. 10,999కే కొనొచ్చు. దీని ఎంఆర్‌పీ రూ. 15,999. అయితే ఇప్పుడు రూ. 12,999కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్, కూపన్ కలుపుకుంటే రూ. 10,999కే వస్తుంది.
ఇంకా రియల్‌మి నార్జ్ 50 ఫోన్‌పై కూడా ఫ్రీ ఇయర్ ఫోన్స్ ఆఫర్ ఉంది. దీన్ని రూ. 10,999కు కొనొచ్చు. దీని ఎంఆర్‌పీ రూ. 15,999. ప్రస్తుతం రేటు రూ. 11,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే తక్కువకే రూ. 10,999కే ఈ ఫోన్ వస్తుంది. ఇంకా టెక్నో పాప్ 6 ప్రో ఫోన్‌పై కూడా ఉచిత ఇయర్ ఫోన్ డీల్ పొందొచ్చు. దీన్ని రూ. 5399కు కొనొచ్చు. దీని ఎంఆర్‌పీ రూ. 7,999 అయితే ఇప్పుడు రూ. 5,999కు లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 5399కే పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, Amazon Great Republic Day Sale, Latest offers, Mobile offers, Smartphones