అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. రెండు ఇ-కామర్స్ సైట్లల్లో అర్థరాత్రి నుంచే సేల్ జరుగుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 28న ముగుస్తుంది. ఈ ఐదురోజుల సేల్‌లో భారీ ఆఫర్లు అందిస్తోంది. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, మొబైల్‌ఫోన్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. అమెజాన్ పే యూజర్లు రూ.5,000 కన్నా ఎక్కువ టాప్-అప్ చేస్తే రూ.250 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, ఇకో స్మార్ట్ స్పీకర్లు డిస్కౌంట్లో ఉన్నాయి. అలెక్సా ఉన్న డివైజ్‌లు కూడా 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది అమెజాన్.
ఫ్లిప్‌కార్ట్‌లో 'ఫెస్టీవ్ ధమాకా డేస్' పేరుతో సేల్ అక్టోబర్ 27 వరకు నాలుగు రోజుల పాటు జరుగుతోంది. ఏసుస్ ఇటీవల లాంఛ్ చేసిన జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎం1, జెన్‌ఫోన్ లైట్ ఎల్1 ఈ సేల్‌లోనే అందుబాటులోకి వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. స్మార్ట్ఫోన్లు, టెలివిజన్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌పై భారీ ఆఫర్లున్నాయి.
అమెజాన్‌లో ఆఫర్లు ఇవే...
హానర్ 8ఎక్స్(4జీబీ+64జీబీ)- అసలు ధర రూ.17,999... ఆఫర్ ధర రూ.14,999
హానర్ ప్లే- అసలు ధర రూ.21,999... ఆఫర్ ధర రూ.17,999
షావోమీ ఎంఐ ఏ2- అసలు ధర రూ.17,499... ఆఫర్ ధర రూ.14,999
రెడ్మీ వై2- అసలు ధర రూ.13,499... ఆఫర్ ధర రూ.10,999
రెడ్మీ 6 ప్రో- అసలు ధర రూ.11,499... ఆఫర్ ధర రూ.10,999
సాంసంగ్ గెలాక్సీ ఏ8+- అసలు ధర రూ.41,900... ఆఫర్ ధర రూ.23,990
వివో వీ9 ప్రో- అసలు ధర రూ.19,990... ఆఫర్ ధర రూ.17,990
వెస్టర్న్ డిజిటల్ 3టీబీ పోర్టబుల్ హార్డ్ డ్రైవ్- అసలు ధర రూ.9,290... ఆఫర్ ధర రూ.6,299
ఫ్యూజీ ఇన్స్టాక్స్ 8 ఇన్స్టంట్ కెమెరా- అసలు ధర రూ.5,590... ఆఫర్ ధర రూ.2,700
ఎప్సాన్ ఎల్360 ఇంక్ ట్యాంక్ ప్రింటర్- అసలు ధర రూ.11,399... ఆఫర్ ధర రూ.8,999
బోట్ బాస్‌హెడ్స్ 225- అసలు ధర రూ.999... ఆఫర్ ధర రూ.499
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లు ఇవే...
వివో వీ9(4జీబీ+64జీబీ)- అసలు ధర రూ.23,990... ఆఫర్ ధర రూ.15,990
రియల్మీ సీ1- అసలు ధర రూ.8,990... ఆఫర్ ధర రూ.6,999
ఒప్పో ఎఫ్9(4జీబీ+64జీబీ)- అసలు ధర రూ.21,990... ఆఫర్ ధర రూ.18,990(ఎక్స్ఛేంజ్పై అదనంగా రూ.4,000 తగ్గింపు)
లెనోవో కే8 ప్లస్(3జీబీ+32జీబీ)- అసలు ధర రూ.10,999... ఆఫర్ ధర రూ.6,999
ఇవి కూడా చదవండి:
నో-కాస్ట్ ఈఎంఐలో అసలు మతలబేంటీ?
ఆన్లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?
బ్యాంక్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?
వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!
'మాస్క్డ్ ఆధార్' గురించి మీకు తెలుసా?
క్రెడిట్ లిమిట్ అంటే ఏంటీ? ఆర్థిక క్రమశిక్షణలో ఎంత ముఖ్యం?
పేటీఎంలో మీ డబ్బు ఎంత సేఫ్?