Amazon Fire TV Stick 4K మాక్స్ లాంచ్..మీ సాధారణ టీవీని స్మార్ట్​టీవీగా మార్చే అద్భుతమైన డివైజ్​

ప్రతీకాత్మకచిత్రం

Amazon Fire TV Stick 4K | అమెజాన్​ తాజాగా తన ఫైర్ టీవీ స్టిక్ కొత్త మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. అమెజాన్ నుంచి గతంలో విడుదలైన ఫైర్​ టీవీ స్టిక్​ 4K కు కొనసాగింపుగా దీన్ని లాంచ్​ చేసింది.

  • Share this:
Amazon Fire TV Stick 4K | ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ కేవలం ప్రొడక్ట్‌ డెలివరీ సేవల్లోనే కాదు కొత్త ప్రొడక్ట్స్‌​ను పరిచయం చేయడంలోనూ ముందుంటుంది. ఇందులో భాగంగా అమెజాన్​ తాజాగా తన ఫైర్ టీవీ స్టిక్ కొత్త మోడల్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. అమెజాన్ నుంచి గతంలో విడుదలైన ఫైర్​ టీవీ స్టిక్​ 4K కు కొనసాగింపుగా దీన్ని లాంచ్​ చేసింది. అమెజాన్​ నుంచి ఇప్పటివరకు విడుదలైన ఫైర్​స్టిక్స్​లో ఇదే ఉత్తమమైన స్ట్రీమింగ్ స్టిక్​గా పేర్కొంది. ఇది మెరుగైన ప్రాసెసింగ్ పవర్, అడిషనల్​ మెమరీ, వేగవంతమైన వైఫై 6 వైర్‌లెస్ నెట్‌వర్కింగ్‌, డాల్బీ విజన్​ ఫార్మాట్​కు సపోర్ట్​ ఇస్తుంది.

అమెజాన్​ ఫైర్​ టీవీ స్టిక్ 4K మాక్స్ ధర
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ భారత మార్కెట్​లో రూ. 6,499, అమెరికాలో $ 59.99 (సుమారు రూ .4,400) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫైర్ టీవీ స్టిక్ ప్రీఆర్డర్లు అమెజాన్ ఇండియా వెబ్​సైట్​లో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్​ చేసుకున్న వారికి డెలివరీలు అక్టోబర్ 7న ప్రారంభం కానున్నాయి.

టీవీతో పాటు సీసీ ఫుటేజ్​ యాక్సెస్​..
కొత్త ఫైర్ టీవీ స్టిక్ 4K.. గతంలో విడుదలైన మాక్స్ 4K ఫైర్ టీవీ స్టిక్ కంటే 40 శాతం ఎక్కువ శక్తిమంతమైనది. ఇది క్వాడ్-కోర్ మీడియాటెక్ ఎంటీ 8696 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇందులో 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్​లను సంస్థ అందించింది. ఈ కొత్త తరం టీవీ స్టిక్ మునుపటి తరంలో వైఫై 5 కి విరుద్ధంగా వైఫై 6 కనెక్టివిటీతో వస్తుంది.

ఈ కొత్త ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ 4K UHD రిజల్యూషన్, HDR, HDR10+, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్‌లకు సపోర్ట్ చేస్తుంది. మూడో తరం అలెక్సా రిమోట్​ను ఈ స్టిక్​తో పాటు అందించింది. ఈ ఫైర్​ స్టిక్​ను ఏదైనా టీవీ, సౌండ్‌బార్‌లో ఉపయోగించవచ్చు. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్​లో లైవ్ వ్యూ ఫీచర్‌ సపోర్ట్​ను కూడా అందించారు. దీని ద్వారా యూజర్లు టీవీ చూస్తూనే.. తమ ఇంట్లోని సెక్యూరిటీ కెమెరా ఫుటేజ్​ను పీఐపీ ఫీడ్​ ద్వారా చూడవచ్చు.

ఈ కొత్త ఫైర్​ స్టిక్​పై అమెజాన్ డివైజెస్ ఇండియా హెడ్ పరాగ్ గుప్తా మాట్లాడుతూ.. "ఫైర్ టీవీకి భారతదేశంలో మిలియన్ల మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారు. వారు ప్రతిరోజూ గంటల కొద్దీ కంటెంట్‌ని ఆస్వాదిస్తున్నారు. అందుకే, ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్‌ను విడుదల చేస్తుంది. ఈ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్‌కు అద్భుతమమైన రెన్సాన్స్​ ఉంటుందని ఆశిస్తున్నాం” అని చెప్పారు.
Published by:Krishna Adithya
First published: