Home /News /technology /

AMAZON FAB PHONES FEST UP TO 40 PERCENTAGE OFFER ON SMART PHONES UMG GH

Amazon Fab Phones Fest: అమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ సేల్‌.. టాప్‌ కంపెనీల ప్రొడక్ట్స్‌పై 40 శాతం డిస్కౌంట్

అమెజాన్

అమెజాన్

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరో కొత్త ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. మంగళవారం టెక్నో (Tecno) బ్రాండ్ సహకారంతో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ (Fab Phones Fest) సేల్‌ను ప్రకటించింది. తాజా ఆఫర్లలో స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ ఆఫర్స్ అందిస్తోంది.

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మరో కొత్త ఆఫర్ సేల్‌ను ప్రకటించింది. మంగళవారం టెక్నో (Tecno) బ్రాండ్ సహకారంతో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ (Fab Phones Fest) సేల్‌ను ప్రకటించింది. తాజా ఆఫర్లలో స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్‌ ఆఫర్స్ అందిస్తోంది. కస్టమర్‌లు టెక్నో, షియోమి, శామ్‌సంగ్‌, యాపిల్, రియల్‌మీ, ఐక్యూ వంటి టాప్‌ బ్రాండ్‌ల నుంచి అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్యాబ్‌ ఫోన్స్ ఫెస్ట్ ఆఫర్లు జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయని అమెజాన్ పేర్కొంది.

తాజా ఆఫర్ సేల్‌లో కస్టమర్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లపై 12 నెలల వరకు అద్భుతమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, నో-కాస్ట్ EMIలు కూడా పొందే అవకాశం ఉంది. ప్రైమ్ మెంబర్స్ అడ్వాంటేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్‌తో రూ.20,000 వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో 6-నెలల ఫ్రీ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, అదనంగా హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై మూడు నెలల నో కాస్ట్ EMI వంటి ప్రయోజనాలు ఉన్నాయి. కంపెనీ పేర్కొన్న దాని కంటే ఇవి ఇంకా ఎక్కువ EMI గడువు ఆప్షన్‌ను అందిస్తాయి.

అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్స్ ఇవే..
అమెజాన్‌లో కొన్ని తాజా స్మార్ట్‌ఫోన్‌లు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉన్నాయి. యాపిల్ కస్టమర్‌లు ఐఫోన్‌ 13(iPhone 13)ని రూ.79,900కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లతో 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా పొందవచ్చని అమెజాన్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

శామ్‌సంగ్‌‌ M సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లపై కస్టమర్లు బెస్ట్ డీల్స్, ఆఫర్‌లను సొంతం చేసుకోవచ్చు. శామ్‌సంగ్‌‌ గెలాక్సీ M 12 (Samsung Galaxy M12) స్మార్ట్‌ఫోన్‌ రూ.9,499కి అందుబాటులో ఉంది. శామ్‌సంగ్‌‌ గెలాక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ 5జీ(Samsung Galaxy S20 FE 5G) స్మార్ట్‌ఫోన్‌ రూ.34,990కి అందుబాటులో ఉంది. శామ్‌సంగ్‌‌ ఎం32(Samsung M32), శామ్‌సంగ్‌‌ ఎం33 5జీ(Samsung M33 5G), శామ్‌సంగ్‌‌ గెలాక్సీ ఎం53 5జీ(Samsung Galaxy M53 5G) ఫోన్‌లను వరుసగా రూ.14,999, రూ.17,999, రూ.26,499కి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

కొత్తగా లాంచ్‌ అయిన ఐక్యూ నియో 6 5జీ(iQOO Neo 6 5G) స్మార్ట్‌ ఫోన్‌ని రూ.29,999కే పొందవచ్చు. ఐక్యూ జెడ్‌5 5జీ(iQOO Z5 5G), ఐక్యూ జెడ్‌6 5జీ(iQOO Z6 5G) స్మార్ట్‌ఫోన్‌లను వరుసగా రూ.23,990, రూ.13,999కు వినియోగదారులు దక్కించుకునే అవకాశం ఉంది. ఐక్యూ 9 ఎస్‌ఈ 5జీ(iQOO 9 SE 5G), ఐక్యూ 6 ప్రో(iQOO 6 Pro) ఫోన్‌లను వరుసగా రూ.33,990, రూ.24,999కు సొంతం చేసుకోవచ్చని, ఐక్యూ జెడ్‌3(iQOO Z3) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.29,990కే పొందవచ్చని అమెజాన్‌ ఇండియా స్పష్టం చేసింది.
Published by:Mahesh
First published:

Tags: Amazon, Amazon sale, Offers, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు