హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్!

Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్!

 Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్!

Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్‌పై రూ.34,500 డిస్కౌంట్.. అమెజాన్ వండర్‌ఫుల్ ఆఫర్!

Amazon Offers | మీరు ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే అదిరే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ డీల్ పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Amazon Sale | మీరు కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అది కూడా ప్రీమియం ఫోన్ (Smartphone) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అయిన అమెజాన్‌లో (Amazon) ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ జరుగుతోంది. ఈ సేల్ నవంబర్ 29 వరకు ఉంటుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఏకంగా రూ. 34 వేల తగ్గింపు అందుబాటులో ఉంది.

శాంసంగ్ కంపెనీకి చెందిన గెలాక్సీ ఎస్ 22 5జీ ఫోన్‌పై కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది. ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 85,999గా ఉంది. అయితే ఇప్పుడు సేల్‌లో భాగంగా దీన్ని రూ. 52,999కు కొనొచ్చు. అంటే ఏకంగా 38 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంతేకాకుండా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. రూ. 1500 వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మొత్తంగా ఈ ఫోన్‌పై రూ. 34,500 వరకు డిస్కౌంట్ ఉందని అర్థం చేసుకోవాలి.

మతిపోగొట్టే ఆఫర్.. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.37,000 భారీ తగ్గింపు!

అంతేకాకుండా మరో ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. గరిష్టంగా రూ. 25 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. మీ ఫోన్ మోడల్, దాని కండీషన్ ప్రాతిపదికన మీకు వచ్చే ఎక్స్చేంజ్ విలువ ఆధారపడి ఉంటుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. 9 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 5,889 చెల్లించాల్సి వస్తుంది.

రూ.75,000 ఫోన్ రూ.19 వేలకే అందుబాటులో.. ఇలా కొనేయండి!

నో కాస్ట్ ఈఎంఐ వద్దనుకుంటే రెగ్యులర్ ఈఎంఐ కూడా పెట్టుకోవచ్చు. 24 నెలల వరకు టెన్యూర్ ఎంచుకోవచ్చు. నెలకు రూ. 2569 పడుతుంది. లేదంటే 18 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 3306 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది. 12 నెలల ఈఎంఐ ఎంచుకుంటే నెలకు రూ. 4783 ఈఎంఐ పడుతుంది.

ఇకపోతే ఈ ఫోన్‌లో ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 6.1 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 5జీ, 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 10 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3700 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ప్రీమియం ఫోన్ కొనాలని భావించే వారికి ఇది అదిరే డీల్ అని చెప్పుకోవచ్చు.

First published:

Tags: Amazon, Latest offers, Mobile offers, Samsung

ఉత్తమ కథలు