• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • AMAZON FAB PHONES FEST BEGINS KNOW ABOUT BEST OFFERS FROM SAMSUNG VIVO OPPO AND OTHER BRANDS SS GH

Amazon Fab Phones Fest: అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభం... ఈ స్మార్ట్​ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​

Amazon Fab Phones Fest: అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభం... ఈ స్మార్ట్​ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​

Amazon Fab Phones Fest: అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభం... ఈ స్మార్ట్​ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్​ (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Fab Phones Fest | అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ప్రారంభమైంది. ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
ఇ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ మరో భారీ సేల్​తో ముందుకొచ్చింది. ఫ్యాబ్​ ఫోన్​ ఫెస్ట్​ పేరిట కొత్త సేల్​ను ప్రారంభించింది. అమెజాన్​ అధికారిక వెబ్​సైట్​లో ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ​ఈనెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఫ్యాబ్​ ఫోన్​ ఫెస్ట్​లో ఎంపిక చేసిన స్మార్ట్​ఫోన్ల మోడళ్లపై వినియోగదారులకు 40 శాతం వరకు డిస్కౌంట్​ లభిస్తుంది. దీనితో పాటు ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు ఉన్న వారు అదనంగా మరో 10 శాతం డిస్కౌంట్​ పొందవచ్చు. దీనితో పాటు, నో-కాస్ట్ ఈఎంఐ, డిస్కౌంట్​ కూపన్లు, ఎక్స్​చేంజ్​ ఆఫర్లను కూడా అమెజాన్​ అందిస్తోంది. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్​లో వివో వై 11, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 12, ఒప్పో ఎ 15 వంటి బడ్జెట్ కేటగిరీ స్మార్ట్​ఫోన్లపై వివిధ ఆఫర్లను పొందవచ్చు. ఫ్యాబ్​ ఫోన్​ ఫెస్ట్​లో అమెజాన్​ అందిస్తున్న బెస్ట్​ డీల్స్​పై ఓలుక్కేయండి.

వన్‌ప్లస్ 8 ప్రో 5 జీ


అమెజాన్​ ఫ్యాబ్​ ఫోన్స్​ ఫెస్ట్​లో వన్‌ప్లస్ 8 ప్రో 5జి స్మార్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్ మోడల్‌ కేవలం రూ .54,999లకే లభిస్తుంది. దీని కొనుగోలుపై ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌తో పాటు రూ .14 వేల వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. దీనిలో 48MP మెయిన్​ రియర్​ కెమెరాను అందించింది.

JioFiber: నెలకు రూ.399 ధరకే ఇంటర్నెట్ కనెక్షన్... జియోఫైబర్ పాపులర్ ప్లాన్స్ ఇవే

Vi New Plans: ఈ వొడాఫోన్ ఐడియా-Vi ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్


సేల్​లో భాగంగా రెడ్​బి నోట్​ 9 ప్రో మాక్స్​పై 21% డిస్కౌంట్​ లభిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ను కేవలం రూ.14,999 లకే కొనుగోలు చేయవచ్చు. 6.67- అంగుళాల స్క్రీన్‌తో వచ్చే ఈ స్మార్ట్​ఫోన్​లో 5020mAh బ్యాటరీని అందించింది.

వన్‌ప్లస్ నార్డ్


అమెజాన్​ ఫ్యాబ్​​ ఫోన్స్​ ఫెస్ట్​లో వన్‌ప్లస్ నార్డ్ 12 జీబీ ర్యామ్ మోడల్ రూ .29,999లకే లభిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 5 జితో పనిచేస్తుంది. దీనిలో 4,115 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.

ఒప్పో రెనో 5 ప్రో 5 జీ


సేల్​లో భాగంగా ఒప్పో రెనో 5ప్రో 5జి మోడల్​ను​ రూ .35,990 వద్దే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్​లో సూపర్ అమోలెడ్ స్క్రీన్, పంచ్-హోల్ హౌసింగ్ 32 ఎంపి ఫ్రంట్ కెమెరాని అందించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

Smartphone under Rs 10000: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Samsung Galaxy A32: సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్స్

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 12


సేల్​లో భాగంగా శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 12 బేస్ వేరియంట్​(4 జీబీ) కేవలం రూ .10,999లకే లభిస్తుంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్​ రూ .13,499 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్‌, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీకి సపోర్ట్​ ఇస్తుంది.

వివో వి 20 ప్రో


వివో వి 20 ప్రో కొనుగోలుపై 14% డిస్కౌంట్​ లభిస్తుంది. దీన్ని అమెజాన్‌ ఫ్యాబ్​ ఫెస్ట్​ సేల్​లో రూ .29,990లకే కొనుగోలు చేయవచ్చు. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 5 జి ఆక్టా-కోర్ చిప్‌సెట్‌ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 4,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది.
Published by:Santhosh Kumar S
First published:

అగ్ర కథనాలు