హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్ మరో డిస్కౌంట్ల జాతర.. ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ లో ఆఫర్లే ఆఫర్లు.. ఓ లుక్కేయండి

Amazon: అమెజాన్ మరో డిస్కౌంట్ల జాతర.. ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ లో ఆఫర్లే ఆఫర్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండుగ ఆఫర్ల సందడిని మరోసారి పొడిగించింది. నెల రోజుల పాటు సంస్థ కస్టమర్లకు ఆఫర్లను అందించనుంది. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు పొడిగింపుగా ‘ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్’ (Extra Happiness Days) సేల్‌ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పండుగ ఆఫర్ల సందడిని మరోసారి పొడిగించింది. నెల రోజుల పాటు సంస్థ కస్టమర్లకు ఆఫర్లను అందించనుంది. తాజాగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు పొడిగింపుగా ‘ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్’ (Extra Happiness Days) సేల్‌ను ప్రకటించింది. ఈ స్పెషల్ ఆఫర్లు అక్టోబర్ 8న అర్ధరాత్రి నుంచి లైవ్‌లోకి వచ్చాయి. తాజా ఆఫర్లలో కస్టమర్లు వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్ పొందవచ్చు. ఈ ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, వేరబుల్ డివైజ్‌లు, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, ఇతర ప్రొడక్ట్స్‌పై స్పెషల్ డీల్స్ ఉంటాయని అమెజాన్ (Amazon) ప్రకటించింది.

గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ (Amazon Great Indian Festival Sale) డెడికేటెడ్ పేజీలోనే అమెజాన్ ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ సేల్‌లో భాగంగా కస్టమర్లు లిమిటెడ్ పీరియడ్‌కు ‘డైమండ్స్ ధమాకా’ ఆఫర్లను పొందవచ్చు. ఈ కేటగిరీలో రూ.1500, అంతకంటే ఎక్కువ మొత్తం బిల్లుపై రూ.150 క్యాష్‌బ్యాక్‌ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. ఎంపిక చేసిన వస్తువులపై కస్టమర్లు '750 డైమండ్స్'ను కూడా రిడీమ్ చేసుకోవచ్చు. అమెజాన్ లేటెస్ట్ సేల్‌లో 10వ తరం కిండెల్ రూ.6,499కి అందుబాటులో ఉంది. విప్రో 9W LED స్మార్ట్ కలర్ బల్బ్ కాంబోతో కూడిన 3వ తరం ఎకో డాట్ బ్లాక్ వేరియంట్ ధర రూ.1,799కు తగ్గింది. అయితే ఈ ధరలు సేల్ టైమ్‌లో అందుబాటులో ఉన్న స్టాక్‌, లభ్యతను బట్టి మారుతూ ఉంటాయి.

Amazon Smart TV Offers: అమెజాన్ లో అదిరే ఆఫర్లు.. ఈ స్మార్ట్ టీవీపై రూ.12 వేల తగ్గింపు.. ఓ లుక్కేయండి

తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు

తాజా ఆఫర్లలో అమెజాన్ ఎకో ప్రొడక్ట్స్‌పై స్పెషల్ ఆఫర్లను లిస్ట్ చేసింది. ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై అందించే ఆఫర్లను కూడా ప్రకటించింది. ఇప్పుడు అమెజాన్‌లో వన్‌ప్లస్ 10R 5G ఫోన్ రూ.32,999కి అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ ఫెస్టివ్ సేల్ సందర్భంగా ఐక్యూ Z6 లైట్ 5G ఫోన్ రూ.13,999కి లభిస్తుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 4 Gen 1 SoC, 120Hz రిఫ్రెష్ రేట్‌తో FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది.

ఐఫోన్లపై బెస్ట్ డీల్స్

తాజా సేల్‌లో ఐఫోన్ 12, 64GB వేరియంట్ ఏకంగా రూ.47,999 డిస్కౌంట్ ప్రైస్‌తో లిస్ట్ అయింది. ఐఫోన్ 12, 128GB వేరియంట్ రూ. 54,490కి అందుబాటులో ఉంది. ఇది 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో, సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఐఫోన్ 12 డివైజ్‌లు A14 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. డ్యుయల్ బ్యాక్ కెమెరా సెటప్‌, 4K డాల్బీ విజన్, HDR రికార్డింగ్‌ సపోర్ట్.. వంటి ఫీచర్లతో ఇవి మంచి పర్ఫార్మెన్స్ అందిస్తాయి.

బ్యాంక్ ఆఫర్లు

ఎక్స్‌ట్రా హ్యాపీనెస్ డేస్ సేల్‌లో అమెజాన్.. యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్, ICICI బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులతో చేసే కొనుగోళ్లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో పాటు EMI ట్రాన్సాక్షన్ అవకాశాన్ని అందిస్తోంది. వీటితో పాటు క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లు, బజాజ్ ఫిన్‌సర్వ్, అమెజాన్ పే లేటర్‌ వంటి పర్చేజ్ ఆప్షన్లపై నో-కాస్ట్ EMI ఆఫర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు. అలాగే అమెజాన్ పే UPIతో కస్టమర్లు వెల్‌కమ్ రివార్డుగా రూ.600 వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

First published:

Tags: Amazon Great Indian Festival Sale, E-commerce, Latest offers

ఉత్తమ కథలు