Redmi 9 Prime: రూ.8,910కే 4జీబీ+128జీబీ స్మార్ట్ ఫోన్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..

ఆండ్రాయిడ్ 10, MIUI 11 ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌లో.. వెనక వైపు నాలుగు కెమెరాలు, ముందువైపు సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5020 బ్యాటరీ సామర్థ్యంతో రెడ్‌మీ 9 ప్రైమ్ ఆగస్టులో మార్కెట్లోకి వచ్చింది.

news18-telugu
Updated: October 23, 2020, 9:12 PM IST
Redmi 9 Prime: రూ.8,910కే 4జీబీ+128జీబీ స్మార్ట్ ఫోన్.. అస్సలు మిస్ చేసుకోవద్దు..
Redmi 9 Prime:
  • Share this:
దసరా, దీపావళి పండగల వేళ ఈ కామర్స్ సైట్లు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రోజుకో డిస్కౌంట్‌తో కస్టమర్లు ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరిట అక్టోబరు 16 నుంచి 21 వరకు సేల్ నిర్వహించి.. లక్షలాది ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్, గృహోపకరణాలను విక్రయించింది. ఇక మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొనసాగుతోంది. మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషీన్లతో పాటు ఇతర గృహోపకరణాలు ఇక్కడ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఇక 10వేల లోపు మొబైల్ కొనాలనుకునే వారికి రెడ్‌మీ 9 ప్రైమ్ రూపంలో అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది అమెజాన్. ఎమ్మార్పీ 13,999 రూపాయలున్న Redmi 9 PRIME (4 GB RAM + 128 GB) ఫోన్‌ను దసరా-దీపావళి సేల్‌లో భాగంగా రూ.9,899కే విక్రయిస్తున్నారు. HDFC డెబిడ్, క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే 10శాతం అదనంగా డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ ఫోన్‌ను రూ.8.910కే సొంతం చేసుకోవచ్చన్న మాట.

ఆండ్రాయిడ్ 10, MIUI 11 ఓఎస్‌తో నడిచే ఈ ఫోన్‌లో.. వెనక వైపు నాలుగు కెమెరాలు, ముందువైపు సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5020 బ్యాటరీ సామర్థ్యంతో రెడ్‌మీ 9 ప్రైమ్ ఆగస్టులో మార్కెట్లోకి వచ్చింది. భారీ స్క్రీన్, పెద్ద బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ అందుబాటు ధరలోనే లభ్యమవడం విశేషం. ప్రత్యేకంగా అమెజాన్‌లో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు.



రెడ్‌మీ 9 ప్రైమ్ ఫీచర్స్:

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10, ఎంఐయూఐ 11

డిస్‌ప్లే: 16.58cm(6.53) హెచ్‌డీ+ఐపీఎస్ డిస్‌ప్లే

రిజల్యూషన్: 2340x1080 పిక్సెల్స్

ర్యామ్: 4 జీబీ

ఇంటర్నల్ మెమరీ: 128 జీబీ

ప్రాసెసర్ టైప్: మీడియా టెక్ హీలియో జీ80

ప్రాసెసర్ కోర్: ఆక్టాకోర్

రియర్ కెమెరా: 13 MP + 5 MP + 5 MP + 2 MP ఏఐ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 8 మెగా పిక్సెస్

బ్యాటరీ: 5200 ఏంఏహెచ్ (18w ఫాస్ట్ చార్జర్)

సిమ్ టైప్: డ్యూయల్ సిమ్

కలర్స్: స్పేస్ బ్లూ, మింట్ గ్రీన్, మ్యాటి బ్లాక్, సన్‌రైజ్ ఫ్లేర్

ధర: రూ.9899 (HDFC కార్డ్స్‌తో 10శాతం అదనపు తగ్గింపు)
Published by: Shiva Kumar Addula
First published: October 23, 2020, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading