హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Deals: అమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Amazon Deals: అమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Amazon Deals: అమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

Amazon Deals: అమెజాన్ బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకు లభిస్తున్న 6జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్లు ఇవే..

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. స్మార్ట్ ఫోన్లపై తాజాగా బెస్ట్ డీల్స్‌ను ప్రకటించింది. 6 జీబీ ర్యామ్‌తో లభించే పలు కంపెనీల బెస్ట్ స్మార్ట్ ఫోన్లను 42శాతం, 29శాతం, 24శాతం, 5 శాతం డిస్కౌంట్‌తో అందజేయనున్నట్లు తెలిపింది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

ప్రస్తుతం మల్టీటాస్కింగ్‌ చేసే యూజర్స్ ర్యామ్‌(RAM) సైజ్‌కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. తమ స్మార్ట్ ఫోన్ మరింత స్పీడ్‌గా వర్క్ చేసేందుకు ఎక్కువ జీబీ ర్యామ్ ఉండాలనుకుంటున్నారు. 6 జీబీ ర్యామ్(RAM) ఉంటే కనుక స్మార్ట్ ఫోన్స్‌లో యాప్స్ ఈజీగా రన్ అవుతాయి. ఈ క్రమంలోనే ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. స్మార్ట్ ఫోన్లపై తాజాగా బెస్ట్ డీల్స్‌ను(Best Deals) ప్రకటించింది. 6 జీబీ ర్యామ్‌తో లభించే పలు కంపెనీల బెస్ట్ స్మార్ట్ ఫోన్లను 42శాతం, 29శాతం, 24శాతం, 5 శాతం డిస్కౌంట్‌తో అందజేయనున్నట్లు తెలిపింది. ఆ స్మార్ట్ ఫోన్లు ఏ కంపెనీలకు చెందినవి, వాటి ఫీచర్స్ ఏంటి, ఏయే స్మార్ట్ ఫోన్లకు ఎంత తగ్గింపు లభించనుంది.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది

అమెజాన్ భారీ తగ్గింపుతో అందించే 6 జీబీ ర్యామ్ (RAM) స్మార్ట్ ఫోన్ల మోడల్స్ శామ్‌సంగ్, రెడ్‌మి, వన్ ప్లస్, ఒప్పో , ఐక్యూ కంపెనీలకు చెందినవి. కాగా, ఆ మోడల్ స్మార్ట్ ఫోన్ల పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం..

శామ్‌సంగ్ గెలాక్సీ M33 5G

ఐదో జనరేషన్‌కు చెందిన శామ్‌సంగ్ గెలాక్సీ M33 మోడల్ ఫీచర్స్ విషయానికొస్తే..6.6 అంగుళాల డిస్ ప్లే స్క్రీన్, స్టెల్లార్ కెమెరాను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ మొమొరీ కెపాసిటీ 128 జీబీ కాగా, బ్యాటరీ 6,000 mAh. 6 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన స్మూత్ అండ్ ఫాస్ట్‌గా రన్ అవుతుంది. రూ.24,999 ధర కల ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్ 42 శాతం తగ్గింపుతో అందజేయనుంది.

ఒప్పో A74 5G

ప్రముఖ ఎలక్ట్రానిక్ తాయరీ సంస్థ ఒప్పో(Oppo)కు చెందిన ఫిఫ్త్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ మోడల్ A74 5Gను అమెజాన్ 29 శాతం తగ్గింపుతో అందజేయనుంది. 6.49 అంగుళా స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉండటం విశేషం. ఈ ఫోన్ ప్రైస్ 20,999 కాగా, 5,000 mAh బ్యాటరీ కెపాసిటీ కాగా, పర్పుల్, ఫ్లుయిడ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్‌తో ఫాస్ట్‌గా రన్ అయ్యే ఈ స్మార్ట్ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ కలిగి ఉండగా, దానిని 256 జీబీ వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.

ఐక్యూ Z6 44W

ప్రముఖ ఎలక్ట్రానిక్ మ్యాను‌ఫాక్చరర్ ఐక్యూ(iQOO) మోడల్ Z6 44Wను 24 శాతం తగ్గింపుతో అమెజాన్ అందించనుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ కలిగి ఉండటంతో పాటు 6.44 అంగుళాల స్క్రీన్‌తో రన్ అవుతుంది. ఫన్ టచ్ ఓఎస్ 12 బేస్‌డ్ ఆండ్రాయిడ్ వర్షన్ 12తో బ్లాక్ కలర్‌లో అవెయిలబుల్‌లో ఉంది ఈ స్మార్ట్ ఫోన్. దీని ర్యామ్ 6 జీబీ కాగా ఇంటర్నల్ మెమొరీ 128 జీబీ ధర రూ.20,999.

రెడ్‌మి 10 ప్రైమ్

చైనీస్ బ్రాండ్ షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి స్మార్ట్ ఫోన్ మోడల్ రెడ్ మి 10 ప్రైమ్ (Redmi 10 Prime)ను అమెజాన్ బెస్ట్ డీల్‌తో తగ్గింపు ధరలో అందిస్తోంది. ఎంత శాతం తగ్గింపు ఉంటుందనేది ప్రకటించలేదు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999. 6 జీబీ ర్యామ్‌ ప్లస్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ స్టోరేజీ కలిగిన ఈ ఫోన్ 6.5 అంగుళాల డిస్ ప్లే స్క్రీన్‌తో ఆండ్రాయిడ్ ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్(OS)తో రన్ అవుతుంది.

Viral Video : రైలులో ఫోన్ చోరికి యత్నించి ప్రయాణికులు చేసిన పనికి బిత్తరపోయిన దొంగ..దణ్ణం పెడతా వదలొద్దంటూ వేడుకోలు

వన్ ప్లస్ నార్డ్ CE 2 Lite 5G

ఐదో జనరేషన్ కోసం వన్ ప్లస్ సంస్థ విడుదల చేసిన మోడల్ నార్డ్ (OnePlus Nord CE 2 Lite 5G)ను అమెజాన్ 5 శాతం తగ్గింపుతో బెస్ట్ డీల్‌గా అందజేయనుంది. దీని ధర రూ.19,999 కాగా, ఫీచర్స్ సూపర్ లైట్ వెయిట్, స్లీక్ బాడీ, అట్రాక్టివ్ డిజైన్ కలిగి ఉంటుంది. 6.59 అంగుళా స్క్రీన్ తో ఉండే ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. బ్యాటరీ కెపాసిటీ 5,000 mAh.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Smart phones, Technology

ఉత్తమ కథలు