హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: చిన్న విటమిన్ డబ్బా ఆర్డర్ చేస్తే... టీవీ సైజ్ బాక్స్ వచ్చింది

Amazon: చిన్న విటమిన్ డబ్బా ఆర్డర్ చేస్తే... టీవీ సైజ్ బాక్స్ వచ్చింది

Amazon: చిన్న విటమిన్ డబ్బా ఆర్డర్ చేస్తే... టీవీ సైజ్ బాక్స్ వచ్చింది
(ప్రతీకాత్మక చిత్రం)

Amazon: చిన్న విటమిన్ డబ్బా ఆర్డర్ చేస్తే... టీవీ సైజ్ బాక్స్ వచ్చింది (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Delivery | అమెజాన్ ఓ కస్టమర్‌కు షాక్ ఇచ్చింది. విటమిన్ డబ్బా ఆర్డర్ చేస్తే టీవీ సైజ్ బాక్సులో పంపించింది.

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ చేసే పొరపాట్ల వల్ల కస్టమర్లు షాక్ అవుతుంటారు. ముఖ్యంగా డెలివరీ విషయంలో అమెజాన్ చేసే తప్పులు కస్టమర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. కొన్నిసార్లు విలువైన వస్తువులు ఆర్డర్‌ చేస్తే.. ఛీప్ ఐటమ్స్ వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అయితే తాజాగా అమెజాన్ సంస్థ మరొక పొరపాటు చేసింది. కేవలం మూడు అంగుళాల పరిమాణంలో ఉన్న వస్తువులను సుమారు 20 అంగుళాల బాక్స్‌లో పెట్టి పంపించింది. దీంతో దాన్ని ఓపెన్ చేసి, తన ఆర్డర్‌ను గుర్తించేందుకు కస్టమర్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని నార్తంబర్‌ ల్యాండ్‌లోని ఆల్న్‌విక్‌ నివాసి మార్క్ రీడ్ (55) ఇటీవల అమెజాన్‌లో ఒక ఆర్డర్ పెట్టాడు. ఆయన 7.95 (రూ.815) పౌండ్ల విలువైన 120 విటమిన్ డి3 మాత్రలను ఆర్డర్ చేశాడు. అలాగే, £7.49 (రూ. 768) విలువైన 12 మీట్ స్కేవర్స్‌ ఆర్డర్ చేశాడు. స్కేవర్స్‌ అంటే మాంసపు ముక్కలను పుల్లలతో కుచ్చి పట్టుకునేది. వీటిని మెటల్ లేదా చెక్కతో తయారు చేస్తారు. ఇవి సాధారణంగా 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అయితే కొద్దిరోజుల తర్వాత ఆయన ఇంటికి అమెజాన్ నుంచి ఒక డెలివరీ వచ్చింది. ఆ పార్సిల్ దాదాపు 46 సెంటీ మీటర్ల పొడవు ఉంది. అంటే దాదాపు ఓ పెద్ద టీవీ సైజు.

Airtel Plan: ఎయిర్‌టెల్ యూజర్లకు అలర్ట్... ఆ ప్లాన్ రద్దు

Vivo V19: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి

ఆ అతిపెద్ద డెలివరీ బాక్స్ ను చూసిన తర్వాత తనకు వేరే డెలివరీ వచ్చిందేమోనని మార్క్ భావించాడు. పక్కింటి వారిని కూడా అడిగి తెలుసుకున్నాడు. కానీ ఆ డెలివరీ తనకోసమే వచ్చిందని చివరికి తెలుసుకున్నాడు. అయితే దానిని ఓపెన్ చేయగానే.. 10 అడుగుల పేపర్ లోపల చుట్టి ఉండటం గమనించాడు. ఆర్డర్ చేసిన వస్తువులు డ్యామేజ్ కాకుండా ఈ విధంగా పెద్ద పేపర్ ని కుక్కి పంపించారని తెలుస్తోంది. అయితే ఆ పేపరు మొత్తం బయటకు తీసేసరికి మార్క్ రీడ్ కి తల ప్రాణం తోకకు వచ్చింది. మూడు అంగుళాల విటమిన్ డబ్బా కోసం సుమారు 20 అంగుళాల డెలివరీ డబ్బా పంపడం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నారు.

iQoo Z3 5G: ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... రూ.3,500 తగ్గింపు

Oppo F17: ఒప్పో ఎఫ్17 స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 తగ్గింపు... ఆఫర్ వివరాలు ఇవే

ఈ విషయంపై మార్క్ మీడియాతో మాట్లాడుతూ.. "చాలా సమయం కష్టపడిన తర్వాత నేను డబ్బా అడుగుభాగాన్ని చూడగలిగాను. విటమిన్లు, స్కేవర్లను చూసే ముందు నేను ఒక మెజీషియన్ వలే కంటిన్యూస్ గా పేపర్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. రెండు చిన్న ఐటమ్స్ కోసం వారు ఇంత పెద్ద ప్యాకేజీని వాడారంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ కంటే ప్యాకేజీనే ఎక్కువ బరువుగా ఉంది. డబ్బాను రీసైకిల్ చేశాను కానీ అందులోని పనికిరాని పేపర్ ని ఏం చేయాలో తెలియడంలేదు. అమెజాన్ ఒక పెద్ద కంపెనీ. అది మిగతా కంపెనీలకు ఆదర్శంగా నిలవాలి కానీ ఇలా చేయకూడదు" అని అతను అసహనం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై ఓ అమెజాన్ ప్రతినిధి స్పందించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికే.. ఇటువంటి ప్యాకేజింగ్ చేస్తున్నామని వెల్లడించారు.

First published:

Tags: Amazon, AMAZON INDIA, Online business, Online shopping, Viral, Viral in internet, VIRAL NEWS, Viral post

ఉత్తమ కథలు