లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌ రేస్‌లో అమెజాన్

యూజర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తున్న అమెజాన్ లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు తీస్తోంది. త్వరలో యాపిల్ సరసన నిలవడమే కాదు... ఆ కంపెనీకి గట్టి పోటీ ఇవ్వనుంది అమెజాన్.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌ రేస్‌లో అమెజాన్
IMAGE: REUTERS
  • Share this:
లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరడానికి కొద్ది దూరంలోనే ఉంది అమెజాన్. ఆ మార్క్‌ను చేరుకుందంటే... లక్ష కోట్ల డాలర్లకు చేరిన రెండో కంపెనీగా అమెజాన్‌ రికార్డుల్లోకి ఎక్కుతుంది. అంతకంటే ముందు ఈ మార్క్‌ను యాపిల్ దాటేసింది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ మోర్గాన్ స్టాన్లీ అమెజాన్ షేర్ ప్రైస్ టార్గెట్‌ని 1,850 నుంచి 2,500 డాలర్లకు ఫిక్స్ చేసింది. అంటే ప్రస్తుత షేర్ ధరకు 29 శాతం ఎక్కువ. ప్రస్తుతం అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 971.96 బిలియన్ డాలర్లు.

అమెజాన్ వేగంగా అభివృద్ధి చెందుతూ వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తోంది. స్ట్రీమ్స్ ద్వారా ఎక్కువ లాభాలను గడిస్తుంది. ముందుముందూ కంపెనీ ఇలాగే లాభాల బాటలో నడుస్తుందన్న నమ్మకం మాకుంది.

బ్రియాన్ నోవాక్, మోర్గాన్ స్టాన్‌లీ అనలిస్ట్


సబ్‌స్క్రిప్షన్స్, అడ్వర్‌టైజింగ్ ద్వారా అమెజాన్‌కు ప్రస్తుత ఏడాదిలో 25 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. 2020 నాటికి 45 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతుందని భావిస్తున్నారు. మోర్గాన్ స్టాన్‌లీ అంచనాలు నిజమైతే అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష 20 కోట్ల డాలర్లకు చేరుతుంది. లక్షకోట్ల డాలర్ల మార్క్‌ను యాపిల్ మాత్రమే దాటింది. ప్రస్తుతం యాపిల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్షా 07 కోట్ల డాలర్లు. అయితే ఒక్క అమెజాన్ మాత్రమే యాపిల్‌కు పోటీనివ్వట్లేదు. ఆ రేస్‌లో ఇప్పటికే 853 బిలియన్ డాలర్లతో మైక్రోసాఫ్ట్, 882 బిలియన్ డాలర్లతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ ఇంక్ ఉన్నాయి. ఇదిలా ఉంటే 2020 చివరి నాటికి అమెజాన్ 2 లక్షల కోట్ల డాలర్లను దాటేస్తుందని ఇండిపెండెంట్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ నిర్వాహకుడు డీఎం మార్టిన్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఫేక్ న్యూస్ అడ్డుకోవడానికి వాట్సప్ ట్రైనింగ్!

ఇండియాలో ఊబెర్ ఫ్లయింగ్ క్యాబ్స్సెప్టెంబర్ 5న షావోమీ 6 సిరీస్ ఫోన్ల లాంఛింగ్

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఎల్జీ నుంచి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 30, 2018, 4:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading