హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Cookware Offers: రేపే అమెజాన్ సమ్మర్ సేల్ స్టార్ట్.. వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై 62% వరకు తగ్గింపు..!

Amazon Cookware Offers: రేపే అమెజాన్ సమ్మర్ సేల్ స్టార్ట్.. వివిధ రకాల ప్రొడక్ట్స్‌పై 62% వరకు తగ్గింపు..!

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon Indian) సమ్మర్ స్పెషల్‌గా వంటసామాన్లపై భారీ డిస్కౌంట్లు తీసుకొచ్చేందుకు రెడీ అయింది. అమెజాన్ సమ్మర్ సేల్ 2022 (Amazon Summer Sale 2022) మే 4 నుంచి స్టార్ట్ కాబోతోంది.

కిచెన్ (Kitchen)లో బాగా ఓల్డ్ అయిపోయిన సామాన్లు బయట పారేద్దామని అనుకుంటున్నారా.. అయితే ఇదే మంచి సమయం. ఈ-కామర్స్(E Commerce) దిగ్గజం అమెజాన్ ఇండియా (Amazon Indian) సమ్మర్ స్పెషల్‌గా(Summer Special) వంటసామాన్లపై భారీ డిస్కౌంట్లు(Discounts) తీసుకొచ్చేందుకు రెడీ అయింది. అమెజాన్ సమ్మర్ సేల్ 2022 (Amazon Summer Sale 2022) మే 4 నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ ఒక్క సేల్‌లోనే మీరు మీ కిచెన్‌ను కొత్త వంట సామాగ్రితో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అమెజాన్ ఈ సేల్‌లో తవా (Tawa), ఫ్రైపాన్ (Frypan), కడాయి (Kadhai) వంటి చాలా కుక్‌వేర్ వస్తువులపై ఆఫర్స్ తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీతో బ్రాండెడ్ కంపెనీలు అమ్ముతున్నవే! కొన్ని హై- క్వాలిటీ ప్రొడక్ట్స్ పై 62% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

1. సోలిమో 3-పీస్ అల్యూమినియం నాన్-స్టిక్ కుక్‌వేర్ సెట్ - ఫ్రై పాన్, కడాయి & తవా

ఈ వంటసామాను సెట్‌ను మీ కిచెన్‌లో పెట్టుకుంటే మీ వంట మరింత సులభమవుతుంది. ఈ 3-పీస్ సెట్‌లో ఫ్రై పాన్, కడాయి, తవా ఉన్నాయి. వర్జిన్ అల్యూమినియంతో తయారు చేసిన ఈ వంటసామాను మంచి నాణ్యతతో వస్తాయి. వీటిలో వేడి అన్నివైపులా సమాంతరంగా డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల ఫుడ్ చక్కగా కుక్ అవుతుంది. ఇవి మూడు పొరల ఫుడ్-గ్రేడ్ నాన్-స్టిక్ కోటింగ్‌తో వస్తాయి. ఇవి మన్నికైనవి. ఈ పాత్రలు ఇండక్షన్-ఫ్రెండ్లీ, గ్యాస్-ఫ్రెండ్లీ కావడం విశేషం. ఈ సెట్ అసలు ధర రూ.2,200 కాగా ఇప్పుడు అది రూ.1,349కే అందుబాటులోకి వచ్చింది.

2. సోలిమో అల్యూమినియం రోటీ తవా

సోలిమో రోటీ తవా 100% ఫుడ్-గ్రేడ్ వర్జిన్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇది బలంగా, దృఢంగా ఉంటుంది. తవాలోని గట్టి యానోడైజ్డ్ పూత స్క్రాచ్-రెసిస్టెంట్, నాన్-టాక్సిక్, గొప్ప హీట్ డిస్ట్రిబ్యూషన్ అందిస్తుంది. ఇందులోని బేకలైట్ హ్యాండిల్ (Bakelite Handle) వల్ల చేతులు కాలే సమస్యలు ఉండవు. ఈ తవా అసలు ధర రూ.975 కాగా మీరు దీనిని సమ్మర్ సేల్ లో రూ.579కే సొంతం చేసుకోవచ్చు.

Smartphone Cyber Attacks: స్మార్ట్‌ఫోన్లపై పెరుగుతున్న సైబర్ అటాక్స్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్ అంటున్న నిపుణులు..


3. సోలిమో స్మాల్ తడ్కా పాన్

సోలిమో స్మాల్ తడ్కా పాన్ ని హై క్వాలిటీ గల 100% ఫుడ్-గ్రేడ్ వర్జిన్ అల్యూమినియంతో తయారు చేశారు. సోలిమో తడ్కా పాన్ 9.4 సెంటీమీటర్ల డయామీటర్ కలిగి ఉంది. ఇది పప్పు, రసం, సాంబార్ వంటి రుచికరమైన వంటకాలకు తడ్కాలను తయారు చేయడానికి బాగా యూజ్ అవుతుంది! ఈ తడ్కా పాన్ (Tadka Pan) గట్టి యానోడైజ్డ్ (Anodized) పూతను కలిగి ఉంటుంది, ఇది స్క్రాచ్-రెసిస్టెంట్, నాన్-టాక్సిక్, నాన్-రియాక్టివ్‌గా పని చేస్తుంది. అధిక ఉష్ణోగ్రతలను సులభంగా తట్టుకుంటుంది. ఈ పాన్ అసలు ధర రూ.325 కాగా ఇప్పుడు దాని ధర రూ.239కి దిగి వచ్చింది.

4. గ్లాస్ మూతతో వచ్చే సోలిమో నాన్-స్టిక్ కడాయి

సోలిమో నాన్-స్టిక్ కడాయి ఒక గ్లాస్ మూతతో వస్తుంది. ఇది వివిధ రకాల కూరగాయలు, కూరలు వండడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని 3-లేయర్డ్ నాన్-స్టిక్ కోటింగ్ అనేది కడాయికి ఆహారాన్ని అంటుకోకుండా చేస్తుంది. తక్కువ నూనెతో ఆహారాన్ని వండడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దృఢమైన గాజు మూత వేడిని నిలుపుతుంది, ఆహారాన్ని వెచ్చగా ఉంచుతుంది. డబుల్-రివెటెడ్, కూల్-టచ్ బేకలైట్ ఇయర్ హ్యాండిల్స్, సురక్షితమైన, దృఢమైన పట్టును అందిస్తాయి. వంట మరింత ఈజీ కావడానికి ఈ లోతైన, విశాలమైన కడాయి ఉత్తమంగా నిలుస్తుంది. ఈ కడాయి ఒరిజినల్ ప్రైస్ రూ.1,440 కాగా ఇప్పుడిది రూ.819కి తగ్గింది.

5. సోలిమో ఇడ్లీ మేకర్ కమ్ మోదక్ మేకర్

ఫుడ్-సేఫ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన సోలిమో ఇడ్లీ మేకర్ కమ్ మోదక్ (కుడుములు-Dumplings) మేకర్ పాత్ర ధృడమైనది, మన్నికైనదిగా ఉంటుంది. ఈ ఇడ్లీ మేకర్ రెండు పార్ట్స్ తో వస్తుంది, ఇది ఒకేసారి రెండు రుచికరమైన వంటకాలను చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది వేగవంతమైన వంట కోసం తేమను మూసివేసే టఫ్డ్ గ్లాస్ మూతతో వస్తుంది. ఇడ్లీ మేకర్ గ్యాస్ స్టవ్, ఇండక్షన్ కుక్‌టాప్‌పై వాడుకోవచ్చు. దీని అసలు ధర రూ.1,800గా ఉండగా ఇప్పుడు మీరు దీన్ని ఆఫర్‌లో భాగంగా రూ.849కే కొనుగోలు చేయొచ్చు. ఇంకా మరిన్ని కుక్‌వేర్ ప్రొడక్స్ పై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉన్నాయి. అమెజాన్ వెబ్ సైట్ లో మీరు ఆ ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు.

Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Amazon, Sale

ఉత్తమ కథలు