Home /News /technology /

AMAZON CONTEST GUESS THE SPECIFICATIONS OF ONEPLUS 7T AND GET A CHANCE TO WIN NEW SMARTPHONE SS

Amazon Contest: ఫీచర్స్ కరెక్ట్‌గా చెప్తే ఖరీదైన ఫోన్ గెలుచుకునే ఛాన్స్

Amazon Contest: ఫీచర్స్ కరెక్ట్‌గా చెప్తే ఖరీదైన ఫోన్ గెలుచుకునే ఛాన్స్
(image: Amazon India)

Amazon Contest: ఫీచర్స్ కరెక్ట్‌గా చెప్తే ఖరీదైన ఫోన్ గెలుచుకునే ఛాన్స్ (image: Amazon India)

Amazon Guess the Specs Contest | ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చెప్పి వన్‌ప్లస్ 7టీ గెలుచుకోండని అమెజాన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. రిఫ్రెష్ రేట్, కెమెరా స్పెసిఫికేషన్స్, ర్యామ్, ప్రాసెసర్ వివరాలను కరెక్ట్‌గా గెస్ చేసినవారిలో ఒకరు వన్‌ప్లస్ 7టీ గెలుచుకునే అవకాశముంది.

ఇంకా చదవండి ...
    స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. మీకు స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి పూర్తిగా అవగాహన ఉంటే ఖరీదైన ఫోన్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది. అమెజాన్ ఇండియా నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఇది. త్వరలో వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ రిలీజ్ కోసం స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 26న సాయంత్రం 7 గంటలకు వన్‌ప్లస్ 7టీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇప్పుడు ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ చెప్పి వన్‌ప్లస్ 7టీ గెలుచుకోండని అమెజాన్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. రిఫ్రెష్ రేట్, కెమెరా స్పెసిఫికేషన్స్, ర్యామ్, ప్రాసెసర్ వివరాలను కరెక్ట్‌గా గెస్ చేసినవారిలో ఒకరు వన్‌ప్లస్ 7టీ గెలుచుకునే అవకాశముంది. మీ యూజర్ ఐడీతో అమెజాన్‌లో లాగిన్ అయ్యాక స్పెసిఫికేషన్స్ గెస్ చేసి సబ్మిట్ చేయొచ్చు.

    ఇక ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రిలీజ్ కానున్న తొలి స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 7టీ అన్న ప్రచారం జరుగుతోంది. స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్ రిలీజ్ కానుందని అంచనా. ఇప్పటికే వన్‌ప్లస్ 7టీ స్మార్ట్‌ఫోన్ ఇమేజ్‌ను అధికారికంగా రిలీజ్ చేసింది వన్‌ప్లస్ కంపెనీ. అందులో ట్రిపుల్ కెమెరా కనిపిస్తోంది. అందులో ఒక కెమెరా 48 మెగాపిక్సెల్ కావచ్చని అంచనా. మిగతావి 16+13 మెగాపిక్సెల్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే వన్‌ప్లస్ 7టీ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి అనేక లీకులు వస్తున్నాయి. మరి ఫోన్ ఎలా ఉంటుందో చూడాలంటే సెప్టెంబర్ 26 సాయంత్రం 7 గంటల వరకు ఆగాల్సిందే.

    Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Nokia 7.2: ట్రిపుల్ కెమెరాలతో నోకియా 7.2 రిలీజ్... జియో నుంచి రూ.7,200 బెనిఫిట్స్

    LIC Good News: ల్యాప్స్ అయిన పాలసీని రెన్యువల్ చేయండి ఇలా

    Flipkart Offer: డబ్బుల్లేవా..? అయినా ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేయొచ్చు ఇలా...
    First published:

    Tags: Amazon, AMAZON INDIA, Oneplus, Smartphone

    తదుపరి వార్తలు