అమెజాన్... లక్ష కోట్ల డాలర్ల కంపెనీ!

యూజర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తున్న అమెజాన్ లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరింది. యాపిల్ సరసన నిలవడమే కాదు... ఆ కంపెనీకి గట్టి పోటీ ఇస్తోంది అమెజాన్.

news18-telugu
Updated: September 5, 2018, 12:46 PM IST
అమెజాన్... లక్ష కోట్ల డాలర్ల కంపెనీ!
యూజర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తున్న అమెజాన్ లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరింది. యాపిల్ సరసన నిలవడమే కాదు... ఆ కంపెనీకి గట్టి పోటీ ఇస్తోంది అమెజాన్.
  • Share this:
అందరి అంచనాలు నిజమయ్యాయి. అనుకున్నదే జరిగింది. అమెజాన్... లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో అమెజాన్ షేర్ 2 శాతం లాభపడటంతో ఆ కంపెనీ ఈ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం అమెజాన్ షేర్ ధర 2,050.50 డాలర్లు. లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లో చేరిన రెండో కంపెనీ అమెజాన్‌. అంతకంటే ముందు ఈ మార్క్‌ను యాపిల్ దాటేసింది. ఆగస్టులోనే ట్రిలియన్ డాలర్ మార్క్ దాటిన యాపిల్ ప్రస్తుత విలువ 1.1 లక్షల కోట్ల డాలర్లు.

అమెజాన్ చరిత్రలో ఇది మరో మైలు రాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ఏడాదిగా అమెజాన్ షేర్‌లో మంచి జోష్ కనిపిస్తోంది. గత 12 నెలల్లో 103 శాతం పుంజుకుంది. సబ్‌స్క్రిప్షన్స్, అడ్వర్‌టైజింగ్ ద్వారా అమెజాన్‌కు ప్రస్తుత ఏడాదిలో 25 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా. 2020 నాటికి 45 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతుందని భావిస్తున్నారు. మోర్గాన్ స్టాన్‌లీ అంచనాలు నిజమైతే అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష 20 కోట్ల డాలర్లకు చేరుతుంది. 2020 చివరి నాటికి అమెజాన్ 2 లక్షల కోట్ల డాలర్లను దాటేస్తుందని ఇండిపెండెంట్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ నిర్వాహకుడు డీఎం మార్టిన్ అంచనా.

యాపిల్, అమెజాన్ మాత్రమే కాదు... ట్రిలియన్ డాలర్ రేస్‌లో 852.94 డాలర్లతో మైక్రోసాఫ్ట్, 839.67 డాలర్లతో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ ఇంక్ కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ట్రిలియన్ డాలర్ క్లబ్‌లో పోటీ మాత్రం యాపిల్, అమెజాన్ మధ్యే.

ఇవి కూడా చదవండి:

Video: 6 గంటల కన్నా తక్కువ నిద్రపోతున్నారా?

Photos: యాపిల్ లాంఛ్ చేసే గ్యాడ్జెట్స్ ఇవేనా?

ఇండియాలో లాంఛైన హానర్ 7ఎస్నాచ్ డిస్‌‌ప్లేతో మోటో పీ30 నోట్!
Published by: Santhosh Kumar S
First published: September 5, 2018, 12:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading