హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌..స్మార్ట్ గాడ్జెట్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్..బెస్ట్ డీల్స్ మీకోసం..

Amazon: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌..స్మార్ట్ గాడ్జెట్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్..బెస్ట్ డీల్స్ మీకోసం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరో ఆఫర్ సేల్‌ను లాంచ్ చేసింది. ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ (Black Friday sale) పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Amazon : ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌, ప్రొడక్ట్స్, యాక్సెసరీస్‌పై భారీ ఆఫర్లు అందిస్తోంది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్. ఈ సంస్థ మరో ఆఫర్ సేల్‌ను లాంచ్ చేసింది. ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ (Black Friday sale) పేరుతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్ అనౌన్స్ చేస్తోంది. తాజా ఆఫర్లలో ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, కెమెరా యాక్సెసరీస్, హోమ్ ఎంటర్టైన్‌మెంట్ డివైజ్‌లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. లేటెస్ట్ సేల్‌లో అమెజాన్ అందిస్తున్న కొన్ని బెస్ట్ డీల్స్‌ చెక్ చేయండి.

స్పిజెన్ ఎసెన్షియల్ PF2104 వైర్‌లెస్ ఛార్జర్

బ్లాక్ ఫ్రైడే సేల్‌లో స్పిజెన్ కంపెనీకి చెందిన ఈ వైర్‌లెస్ ఛార్జర్‌పై అమెజాన్ 29 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని అమెజాన్‌లో ప్రస్తుతం రూ.999కు కొనుగోలు చేయవచ్చు. ఈ వైర్‌లెస్ ఛార్జర్ గరిష్టంగా 15W వరకు పవర్ అవుట్‌పుట్‌‌ అందిస్తుంది. iOS, Android డివైజ్‌లకు ఛార్జ్ చేయడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు.

బోట్ స్టోన్ 200 3W బ్లూటూత్ స్పీకర్

ఈ బ్లూటూత్ స్పీకర్ అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తుంది. IPX8 రేటింగ్‌ వాటర్ రెసిస్టెంట్, పోర్ట్‌లో AUX ఫీచర్ వంటివి దీని ప్రత్యేకతలు. ఈ బ్లూటూత్ స్పీకర్‌ను స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్‌కు ఫిజికల్ గా కనెక్ట్ చేయవచ్చు. బ్లాక్ ఫ్రైడ్ సేల్‌లో ఈ బ్లూటూత్ స్పీకర్‌పై అమెజాన్ రూ. 1299 డిస్కౌంట్ ప్రకటించింది.

WhatsApp: వాట్సాప్‌లో మరో అద్భుతమైన ఫీచర్.. ఆ పని ఇక మరింత సులభం

 JBL C100SI వైర్డ్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్

ఈ హెడ్‌ఫోన్‌ ప్రస్తుతం మార్కెట్లో రూ.1000 ధరతో అందుబాటులో ఉండగా, అమెజాన్ దీన్ని రూ.599 డిస్కౌంట్ ధరకే అందిస్తోంది. ఇది 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌ను టాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్‌‌కు ఉపయోగించుకోవచ్చు. బాస్, తేలికపాటి డిజైన్, యాగిల్డ్ ఇన్-ఇయర్ డిజైన్‌‌తో ఈ హెడ్‌ఫోన్ బాగా పాపులర్ అయింది.

పోర్ట్రోనిక్స్ వైర్‌లెస్ బ్లూటూత్ సౌండ్‌బార్

పోర్ట్రోనిక్స్ ప్యూర్ సౌండ్ ప్రో IV వైర్‌లెస్ బ్లూటూత్ సౌండ్‌బార్‌పై అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది. బ్లాక్ ఫ్రైడ్ సేల్ సందర్భంగా దీనిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్‌ అందిస్తోంది. ప్రస్తుతం ఈ సౌండ్ బార్‌ను రూ.19999 డిస్కౌంట్ ధరతో సొంతం చేసుకోవచ్చు. ఎక్స్‌టర్ననల్ మీడియా యాక్సెస్‌ సపోర్ట్‌తో ఇది 16W ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

Hisense 4K స్మార్ట్ టీవీ

హైసెన్స్ 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీని అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.20,900కు సొంతం చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ పై రన్ అవుతుంది. డాల్బీ విజన్, డాల్బీ ఆట్మోస్ వంటి ఫీచర్స్‌కు ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది.

First published:

Tags: Amazon sale, Technolgy

ఉత్తమ కథలు