హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: గ్రేట్ ఇండియన్ సేల్‌లో ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ ప్రొడక్టులపై బెస్ట్‌ డీల్స్‌.. అమెజాన్ డిస్కౌంట్స్ ఇవే..

Amazon: గ్రేట్ ఇండియన్ సేల్‌లో ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ ప్రొడక్టులపై బెస్ట్‌ డీల్స్‌.. అమెజాన్ డిస్కౌంట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మార్కెట్‌లోని బెస్ట్‌ హెయిర్‌ ప్రొడక్టులపై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో అమెజాన్ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే..

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

దృఢమైన, ఒత్తైన హెయిర్‌(Hair) కావాలని అందరూ కోరుకుంటారు. పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానాలు, ఒత్తిడి ప్రభావంతో జుట్టు సంరక్షణ ప్రస్తుతం సవాలుగా మారింది. అయితే ఆరోగ్యకరమైన జుట్టు కోరుకుంటున్నవారికి గుడ్‌న్యూస్‌. మార్కెట్‌లోని బెస్ట్‌ హెయిర్‌ ప్రొడక్టులపై గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో(Great Indian Festival Sale) అమెజాన్ భారీ డిస్కౌంట్లను(Discounts) అందిస్తోంది. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే..

* Matrix Opti.care

దీని ధర రూ.650 కాగా ఇప్పుడు అమెజాన్‌ సేల్‌లో రూ.585కి లభిస్తుంది. హెల్తీ హెయిర్‌ కోసం బెస్ట్ సొల్యూషన్‌గా నిలుస్తోంది మ్యాట్రిక్స్‌ ఆప్టి.కేర్‌ ప్రొఫెషనల్ అల్ట్రా స్మూతింగ్ షాంపూ, కండీషనర్ కాంబో. దీన్ని వాడితే మృదువైన, సిల్కీ జుట్టు సొంతం అవుతుంది. హెయిర్‌కు సరైన పోషణ, తేమను అందిస్తుంది. స్ట్రెయిట్ హెయిర్‌ను ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్‌ ఆప్షన్‌.

* BIOLAGE ప్రొడక్ట్స్

తల దురద, చుండ్రు సమస్యలకు బెస్ట్‌ సొల్యూషన్‌ బయోలేజ్ అడ్వాన్స్‌డ్ స్కాల్‌పూర్ ప్రొఫెషనల్ షాంపూ + కండీషనర్. దీని అసలు ధర రూ.685 కాగా ఇప్పుడు అమెజాన్‌ సేల్‌లో రూ.616కే అందుబాటులో ఉంది. ఇది చుండ్రు సమస్యను దూరం చేసి, స్కాల్ప్‌ను డీటాక్సిఫై చేస్తుంది. దీంట్లో పారాబెన్ ఉండదు. దీని శుద్ధి చేసే లక్షణాలు బెస్ట్‌ రిజల్ట్‌ను అందిస్తాయి.

* Wella Professional

హెయిర్‌కు వెల్లా ప్రొఫెషనల్ EIMI ఎక్స్‌ట్రా-వాల్యూమ్ హెయిర్ మౌస్ పట్టును అందిస్తుంది. సులువుగా చెదిరిపోకుండా జుట్టను హోల్డ్‌ చేస్తుంది. జుట్టుకు తగినంత వాల్యూమ్‌ను కూడా జోడిస్తుంది. దీని అసలు ధర రూ.750 కాగా అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో రూ.675కే దొరుకుతోంది. ఈ ప్రొఫెషనల్ హెయిర్‌కేర్ ప్రొడక్ట్ హెయిర్ టూల్స్ ద్వారా పుట్టే హీట్ లాస్‌కు కూడా చెక్ పెడుతుంది.

Jobs In NAL: బీటెక్(B Tech), బీఎస్సీ(B.Sc) విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ 75 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండిలా.. 

* Schwarzkopf ప్రొడక్ట్స్

కొత్త హెయిర్ స్టైల్స్‌తో ప్రయోగాలు చేసేవారికి స్క్వార్జ్‌కోఫ్ ప్రొఫెషనల్ ఒసిస్ డస్ట్ ఇట్ మ్యాటిఫైయింగ్ పౌడర్‌ మంచి ఆప్షన్. దీని ధర రూ.785 కాగా అమెజాన్‌ సేల్‌లో ఇప్పుడు రూ.628కి సొంతం చేసుకోవచ్చు. ఇది జిడ్డును నివారించడం ద్వారా జుట్టుకు దీర్ఘకాలం పట్టును, బలమైన ఆకృతిని ఇస్తుంది.

* De Fabulous

డీ ఫ్యాబులస్‌ షాంపూ అండ్‌ కండీషనర్ ధర రూ.2,610 కాగా అమెజాన్‌ సేల్‌లో రూ.2,349కి సొంతం చేసుకోవచ్చు. షాంపూ, కండీషనర్ కాంబో జుట్టుకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుంది. జుట్టు కోల్పోయిన పోషకాలను తిరిగి జుట్టుకు అందిస్తుంది. పెళుసైన, దెబ్బతిన్న జుట్టును పునర్నిర్మించడంతో పాటు బలోపేతం చేస్తుంది.

Constable Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 400 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..

* Biolage Hair Serum

జుట్టు పగుళ్ల సమస్య వేధిస్తున్న వారికి బెస్ట్‌ ఆప్షన్‌ బయోలేజ్ స్మూత్‌ప్రూఫ్ 6-ఇన్-1 ప్రొఫెషనల్ హెయిర్ సీరం. మృదువైన, సిల్కీ, మెరిసే జుట్టును అందిస్తుంది. దీని ధర రూ.600 కాగా అమెజాన్‌ సేల్‌లో ఇప్పుడు రూ.540కే లభిస్తోంది. ఇది చిట్లిన జుట్టు, గరుకుగా ఉండే చివర్లను మృదువుగా చేస్తుంది. అవకాడో, గ్రేప్సీడ్ ఆయిల్‌తో తయారైన ఈ సీరమ్ మీ జుట్టును చిక్కులు లేకుండా చేస్తుంది.

* L'Oréal

లోరియల్‌ ప్రొఫెషనల్‌ అబ్సల్యూట్‌ రిపేర్ షాంపూ అండ్‌ మాస్క్ హెయిర్‌కు సూపర్ ఫుడ్‌లా పనిచేస్తుంది. దీని ధర రూ.1,555 కాగా అమెజాన్‌ సేల్‌లో రూ.1,399కు లభిస్తోంది. ఇందులోని క్వినోవా, ప్రోటీన్లు అన్ని రకాల జుట్టు సమస్యలను దూరం చేస్తాయి. షాంపూలోని ఫైబర్ జుట్టు మొత్తం హైడ్రేట్ చేస్తుంది. మరోవైపు అబ్సల్యూట్‌ రిపేర్ మాస్క్ తేమను దాచి ఉంచి, బలమైన, మృదువైన జుట్టును అందిస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Amazon, Amazon festival, Amazon Great Indian Festival Sale, Amazon sales, Best deals

ఉత్తమ కథలు