AMAZON ANNOUNCES MOBILE AND TV SAVINGS DAYS TOP DEALS ON OPPO VIVO XIAOMI SMARTPHONES AND TVS REVEALED GH VB
Amazon: అమెజాన్‌లో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్ సేల్.. డీల్స్ ఇవే..!
ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్ సేల్‌తో మన ముందుకు వచ్చింది. మొబైల్, టీవీ సేవింగ్స్ డేస్(Amazon Mobile and TV Savings Day)ను అమెజాన్ తాజాగా ప్రకటించింది.
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలపై మరో ఎక్స్‌క్లూజివ్ సేల్‌తో మన ముందుకు వచ్చింది. మొబైల్, టీవీ సేవింగ్స్ డేస్(Amazon Mobile and TV Savings Day)ను అమెజాన్ తాజాగా ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది డిసెంబర్ 22, 2021 వరకు కొనసాగుతుంది. అమెజాన్ సేవింగ్స్ డేస్ సేల్‌లో షావోమి, శాంసంగ్, ఐకూ, ఒప్పో, టెక్నో, వివో వంటి బ్రాండ్లపై అనేక డీల్‌లను కస్టమర్లు అందుకోవచ్చు. రెడ్మీ నోట్ 11T 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్, ఐకూ జెడ్ సిరీస్, ఐకూ 7, ఒప్పో A సిరీస్, టెక్నో స్పార్క్ 8T, వివో X60 సిరీస్‌లతో సహా మరిన్ని స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ ధరతో ఇప్పుడు కస్టమర్లకు అందుబాటులోకి వచ్చాయి. ఈ సేల్‌లో కస్టమర్లను బాగా ఆకట్టుకునే టాప్ డీల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ తన కస్టమర్ల కోసం బ్యాంక్ ఆఫర్లను కూడా ప్రకటించింది. ఈ ఆఫర్లు స్మార్ట్ఫోన్లు, టీవీలపై అదనపు తగ్గింపులను పొందడంలో సహాయపడుతాయి. వన్ కార్డు (OneCard) క్రెడిట్ కార్డ్‌లు ఉపయోగించి లేదా ఈఎంఐ చెల్లింపులను ఉపయోగించి కొనుగోలుదారులు రూ.1500 వరకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన స్మార్ట్ఫోన్లపై 12 నెలల వరకు సౌకర్యవంతమైన నో-కాస్ట్ ఈఎంఐని కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యులు మరిన్ని అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు రూ.20,000 వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రైమ్ సభ్యులు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ & క్రెడిట్ కార్డ్‌లపై అదనంగా 3 నెలల నో కాస్ట్ ఈఎంఐ సేవలను వాడుకోవచ్చు.
షావోమి, ఒప్పో , వివో, ఇతర స్మార్ట్ఫోన్లపై డీల్‌లు
- రెడ్మీ నోట్ 11T 5జీ, షావోమి 11 లైట్ NE 5జీ, రెడ్మీ నోట్ 10 ప్రో డార్క్ నెబ్యూలతో సహా కొత్తగా లాంచ్ అయిన షావోమి ఫోన్లు అమెజాన్ మొబైల్, టీవీ సేవింగ్స్ సేల్ సమయంలో బ్యాంక్ ఆఫర్లతో సహా ఇతర డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. షావోమి సేల్ సమయంలో స్మార్ట్ టీవీలపై కూడా చాలా ఆఫర్లు ఇస్తోంది. కచ్చితమైన డీల్‌లు, డిస్కౌంట్లు త్వరలోనే వెబ్సైట్లో కనిపిస్తాయి.
- ఐకూ సంస్థ సేవింగ్స్ డేస్ సేల్ సమయంలో ఐకూ జెడ్3, ఐకూ జెడ్5, ఐకూ 7పై రూ. 1,500 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది.
- టెక్నో (Tecno) స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 10 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కొత్తగా లాంచ్ అయిన స్పార్క్ 8టీ పై కూడా డిస్కౌంట్ పొందవచ్చు.
- ఒప్పో సంస్థ తన స్మార్ట్ఫోన్లపై 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఒప్పో ఫోన్లను 12 నెలల వ్యవధితో నో-కాస్ట్ ఈఎంఐ పద్ధతిలో సొంతం చేసుకోవచ్చు. ఒప్పో ఏ55, ఒప్పో ఏ31, ఒప్పో ఏ74తో సహా లేటెస్ట్ లాంచ్‌లపై ఒప్పో అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. వివో కూడా తన స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ అందిస్తోంది.
- శాంసంగ్ కూడా శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీపై డిస్కౌంట్లను ఇస్తోంది. కొత్తగా విడుదలైన ఫోన్లతో పాటు, కొనుగోలుదారులు మొత్తం శాంసంగ్ ఎం సిరీస్ ఫోన్లపై తగ్గింపులను పొందవచ్చు. అలాగే శాంసంగ్ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలపై 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. సేవింగ్స్ డేస్ సేల్ సమయంలో 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ పొందవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.