కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? మొబైల్ కొనేప్పుడు ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం మర్చిపోయారా? డోన్ట్ వర్రీ. మీరు మొబైల్ కొన్న తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్ ప్రొటెక్షన్ ప్లాన్ ఎంచుకునే అవకాశం కల్పిస్తోంది అమెజాన్. లేటెస్ట్‌గా పోస్ట్ పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ ప్రకటించింది. అక్కో ఇన్స్యూరెన్స్ కంపెనీతో కలిసి ఈ ప్లాన్ అందిస్తోంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్ కొన్న 30 రోజుల వరకు పోస్ట్ పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ కొనేప్పుడే ఇలాంటి ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం ఉండేది. అయితే ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడానికి ఆసక్తి చూపించేవారు తక్కువ. అయితే స్మార్ట్‌ఫోన్ కొన్న తర్వాత ఇలాంటి ప్లాన్ తీసుకోవాలంటే ఇన్స్యూరెన్స్ కంపెనీలను సంప్రదించాలి. అయితే ఫోన్ కొన్న 30 రోజుల వరకు అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లోనే ఇన్స్యూరెన్స్ పొందే అవకాశం ఇది.
పోస్ట్ పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలన్నీ అమెజాన్ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకున్నవారికి పలు రకాల కవరేజీ లభిస్తోంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పగిలిపోవడంతో పాటు లిక్విడ్, వాటర్ డ్యామేజీ కవర్ అవుతుంది. కస్టమర్ ఇంటికి వచ్చి స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లి రిపేర్ చేసి మళ్లీ తిరిగి తీసుకొచ్చే వెసులుబాటు ఉంది. రిపేరింగ్ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి హిడెన్ ఛార్జీలు లేవని, క్లెయిమ్ కూడా సులువుగా ప్రాసెస్ అవుతోంది అమెజాన్ చెబుతోంది.
WhatsApp: వాట్సప్‌లో సమస్యలున్నాయా? ఈయనకు కంప్లైంట్ చేయండి
Tata Sky Binge: ఇక ఫోన్లలోనూ టాటా స్కై బింజ్... యాప్ విడుదల చేసిన ఓటీటీ ప్లాట్‌ఫాం
పోస్ట్ పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్‌లో ఏ డ్యామేజ్‌కి ఎంత కవరేజీ లభిస్తుందో కూడా అమెజాన్ వివరించింది. స్క్రీన్ డ్యామేజ్ అయితే రూ.4,000, బటన్ రీప్లేస్‌మెంట్‌కి రూ.1,250, మైక్ లేదా స్పీకర్ డ్యామేజ్ అయితే రూ.1,000, ఇంటర్నల్ సెన్సార్ డ్యామేజ్‌కి రూ.1,000, బ్యాటరీ, ఛార్జింగ్ పోర్ట్ సమస్యలకు రూ.2,000, లిక్విడ్ డ్యామేజ్‌కి రూ.5,000, కెమెరా సమస్యలకు రూ.1,500, హెడ్‌ఫోన్ జాక్ లేదా హోమ్ బటన్ లాంటి సమస్యలకు రూ.1,000 కవర్ అవుతుంది. అంటే మొత్తం కలిపి రూ.16,750 కవరేజీ లభిస్తుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినా, కావాలని డ్యామేజ్ చేసినా, గుర్తింపులేని సెంటర్లలో రిపేర్ చేయించినా ఈ ప్లాన్ కవరేజీ లభించదు.
Redmi Note 10 Series: రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో 4 స్మార్ట్‌ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?
Mi 11 Ultra: ఈ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూడాల్సిందే... సేల్ మరింత ఆలస్యం
అమెజాన్‌లో పోస్ట్ పర్చేస్ ప్రొటెక్షన్ ప్లాన్ రూ.399 నుంచి ప్రారంభం అవుతుంది. మీరు గత 30 రోజుల్లో అమెజాన్‌లో స్మార్ట్‌ఫోన్ కొన్నట్టైతే ఈ ప్లాన్ తీసుకోవచ్చు. రూ.399 చెల్లిస్తే ఒక ఏడాదికి పైన చెప్పిన కవరేజీ మొత్తం లభిస్తుంది. పేమెంట్ కూడా అమెజాన్ యాప్‌లో చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Insurance, Mobile, Mobile News, Mobiles, Smartphone, Smartphones