Amazon Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్... ఎస్‌బీఐ కార్డుపై ఆఫర్లు

Amazon announced Great Indian Festival Sale 2019 | స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో కొత్త మొబైల్స్ లాంఛింగ్, ప్రైస్ కట్, ఎక్స్‌ఛేంజ్, నోకాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్లు ఉండబోతున్నాయి. హోమ్, కిచెన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్‌ ఎప్పట్లాగే తగ్గింపు ఉంటుంది.

news18-telugu
Updated: September 9, 2019, 11:47 AM IST
Amazon Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్... ఎస్‌బీఐ కార్డుపై ఆఫర్లు
Amazon Sale: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్... ఎస్‌బీఐ కార్డుపై ఆఫర్లు (image: Amazon India)
  • Share this:
వినాయక నవరాత్రులు ముగియగానే దసరా, దీపావళి పండుగ సీజన్ మొదలవుతుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇ-కామర్స్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అందరికన్నా ముందుగానే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను ప్రకటించింది అమెజాన్. అయితే సేల్ జరిగే తేదీలను ఇంకా వెల్లడించలేదు. కానీ భారీ ఆఫర్లు ఉండబోతున్నాయని హింట్ ఇచ్చింది. వన్‌ప్లస్ 7 ప్రో, షావోమీ ఎంఐ ఏ3, సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో కొత్త మొబైల్స్ లాంఛింగ్, ప్రైస్ కట్, ఎక్స్‌ఛేంజ్, నోకాస్ట్ ఈఎంఐ లాంటి ఆఫర్లు ఉండబోతున్నాయి. హోమ్, కిచెన్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఫిట్‌నెస్ ప్రొడక్ట్స్‌ ఎప్పట్లాగే తగ్గింపు ఉంటుంది.

టీవీలు, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్స్, ఏసీలు, ఎంఐ బ్యాండ్స్, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉండబోతున్నాయి. వీటితో పాటు అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఫైర్ టీవీ స్టిక్, కిండిల్‌పై ఆఫర్లు ఉండబోతున్నాయి. ఇక పేమెంట్ ఆఫర్లు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉండబోతోంది. డెబిట్ కార్డ్‌పై ఏకంగా రూ.1 లక్ష వరకు క్రెడిట్ లిమిట్ ఆఫర్ చేస్తోంది అమెజాన్. అంటే డెబిట్ కార్డ్ ఉంటే చాలు... క్రెడిట్ తీసుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ కార్డ్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే

Loan: ఏ లోన్ అయినా జస్ట్ 59 నిమిషాల్లోనే... అప్లై చేయండి ఇలా
Loading...
Good News: లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్... అక్టోబర్ 1 నుంచి కొత్త వడ్డీ రేట్లు
First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...