flipkart amazon sale: రిపబ్లిక్ డే రోజు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్లు...కారు చౌకగా ఐఫోన్..

రెండు రోజులు మాత్రమే కొనసాగనున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.

news18-telugu
Updated: January 26, 2020, 8:23 AM IST
flipkart amazon sale: రిపబ్లిక్ డే రోజు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్లు...కారు చౌకగా ఐఫోన్..
రెండు రోజులు మాత్రమే కొనసాగనున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.
  • Share this:
రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నాయి. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగనున్న ఈ సేల్‌లో ఆకర్షణీయమైన డీల్స్ ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఇస్తున్నాయి.
- ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐ ఫోన్ ఎక్స్ఎస్ 64 జీబీ వేరియంట్‌పై ఏకంగా రూ.39,901 వేలు డిస్కౌంట్ ఇచ్చారు. అసలు ధర రూ.89,900 కాగా, ఇప్పుడు దీనిని 49,999కే విక్రయిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్ చేంజ్ చేస్తే ఇంకో రూ.14,050 లభిస్తుంది.

- యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ ధరను అమెజాన్ రూ.49,900 నుంచి రూ.42,900కి తగ్గించింది. పాత స్మార్ట్‌ఫోన్‌ మార్పిడిపై రూ.7,050 తక్షణ రాయితీ పొందొచ్చు. ఎస్‌బీఐ కార్డు యూజర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
- రెడ్‌మీ కె20 స్మార్ట్‌ఫోన్ ధరను ఫ్లిప్‌కార్ట్ రూ.22,999 నుంచి రూ.19,999కి తగ్గించింది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎస్9 (4జీబీ, 64జీబీ) స్మార్ట్‌ఫోన్ ధరను రూ.62,500 నుంచి రూ.22,999కి తగ్గించింది.
- అమెజాన్ సేల్‌లో వన్‌ప్లస్ 7టి (8జీబీ,128జీబీ)ని 34,999కే లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 3ఎ, పిక్సెల్ 3ఎ ఎక్స్‌ఎల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ చక్కని రాయితీలు ప్రకటించింది.
- రూ.16,999 ధర పలుకుతున్న రెడ్‌మి నోట్8 ప్రొ 6జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్‌ను అమెజాన్ తన గ్రేట్ ఇండియన్ సేల్‌లో రూ.13,999కే అందుబాటులో ఉంచింది. పాత స్మార్ట్‌ఫోన్ మార్పిడిపై మరో రూ.1000 తగ్గింపు పొందే అవకాశం ఉంది. 6 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది.
- శాంసంగ్ గెలాక్సీ ఎ50ఎస్‌ను అమెజాన్ కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంచింది. దీంతో రూ.6,901 డిస్కౌంట్‌ లభిస్తోంది. పాత ఫోన్ పై ఎక్స్ చేంజ్ పై రూ.11,400 తక్షణ అదనపు రాయితీని పొందే అవకాశం ఉంది.
Published by: Krishna Adithya
First published: January 26, 2020, 8:23 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading