హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

 Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

Amazon Alexa: స్మార్ట్‌ఫోన్లలో ఇక ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.. మార్చి 31 డెడ్‌లైన్!

Google Assistant | మీరు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఇందులో బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్ ఉందా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రానున్న కాలంలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండకపోవచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Google Assistant | Alexa | అలెక్సా బిల్ట్ ఇన్ స్మార్ట్‌ఫోన్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్. అమెజాన్ (Amazon) తన బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులను నిలిపివేయనుంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా (Alexa) సర్వీసుల అందుబాటులో ఉండకపోవచ్చు. వచ్చే ఏడాది మార్చి 31 నుంచి స్మార్ట్‌ఫోన్లలో అమెజాన్ అలెక్సా బిల్ట్ ఇన్ సర్వీసులు అందుబాటులో ఉండవని చెప్పుకోవచ్చు.

గీక్‌వైర్ తన నివేదికలో ఈ విషయాన్నివెల్లడించింది. అమెజాన్ ఇప్పటికే యూజర్లకు ఈ విషయాన్ని తెలియజేసిందని పేర్కొంది. అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులు అందుబాటులో ఉండవని తెలిపింది. అమెజాన్ అలెక్సా అనేది యాపిల్ సిరి, గూగుల్ అసిస్టెంట్ మాదిరిగానే పని చేస్తుంది. ఫోన్‌ లాక్‌లో ఉన్నా కూడా పని చేస్తుంది. యాప్ ఓపెన్ చేయాల్సిన పని లేదు.

రూ.680కే కొత్త స్మార్ట్‌ఫోన్ .. ఈ 2 ఫోన్లపై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్లు!

అలెక్టా బిల్ట్ ఇన్ సర్వీసుల ద్వారా ఆండ్రాయిడ్ యూజర్లు అలెక్సాను వాయిస్ కమాండ్స్ ద్వారా సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్స్ ద్వారా ఫోన్‌లో అవసరమైన సర్వీసులు పొందొచ్చు. మీరు చెప్పినట్లు అలెక్సా చేసి పెడుతుంది. ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్నా కూడా అమెజాన్ అలెక్సా పని చేస్తుంది. అందువల్ల చాలా మంది అలెక్సా ద్వారా అవసరమైన సర్వీసులు పొందుతూ ఉంటారు.

వన్‌ప్లస్ 10 ప్రో 5జీ, వన్‌ప్లస్ 10టీ 5జీ, మోటరోలా ఎడ్జ్ 2022, మోటో జీ7 వంటి పలు స్మార్ట్‌ఫోన్లలో అమెజాన్ బిల్ట్ ఇన్ అలెక్సా ఫీచర్ ఉంది. అంటే అలెక్సా బిల్ట్ ఇన్ ఫీచర్ ఉన్న ప్రతి ఫోన్‌లోనూ ఈ హ్యాండ్స్ ఫ్రీ సర్వీసులు కొంత కాలమే అందుబాటులో ఉంటాయని చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ సేవలు పొందొచ్చు.

గ్రేట్ ఆఫర్.. రూ.1749కే రూ.28 వేల స్మార్ట్‌ఫోన్.. వివరాలు ఇలా!

కంపెనీకి చెందిన అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో బిల్ట్ ఇన్ అలెక్సా సపోర్ట్ ఉండదని పేర్కొంటున్నాయి. అయితే అమెజాన్ కంపెనీ బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులను ఎందుకు నిలిపివేస్తున్నది సరైన కారణం తెలియదు. కేవలం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే బిల్ట్ ఇన్ అలెక్సా సర్వీసులను నిలిపి వేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు 2023 మార్చి 31 తర్వాత కూడా అలెక్సా సర్వీసులు పొందొచ్చు. అయితే అలెక్సా యాప్ ఓపెన్‌లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు మీరు చెప్పినట్లు మీ ఫోన్ వింటుంది. హ్యాండ్స్ ఫ్రీ సర్వీసులు పొందొచ్చు. అయితే హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీల దగ్గరి నుంచి ఈ ఫీచర్ నిలుపుదలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

First published:

Tags: Amazon, AMAZON INDIA, Amazon products, Smartphones

ఉత్తమ కథలు