హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus 10T: వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్ లాంఛ్ .. కళ్లు చెదిరే ఫీచర్లు.. ఓ లుక్కేయండి!

OnePlus 10T: వన్ ప్లస్ నుంచి అదిరిపోయే ఫోన్ లాంఛ్ .. కళ్లు చెదిరే ఫీచర్లు.. ఓ లుక్కేయండి!

 వన్ ప్లస్ నుంచి అదిరిపోయే టీ సిరీస్ ఫోన్ లాంఛ్ .. కళ్ళు చెదిరే ఫీచర్లు.. లుక్కేయండి!

వన్ ప్లస్ నుంచి అదిరిపోయే టీ సిరీస్ ఫోన్ లాంఛ్ .. కళ్ళు చెదిరే ఫీచర్లు.. లుక్కేయండి!

వన్‌ప్లస్‌ 10T (OnePlus 10T) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రాబోయే ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్‌ 10T స్మార్ట్‌ఫోన్(Smart Phone) భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 3న లాంచ్ కానుంది.

వన్‌ప్లస్‌10T (OnePlus 10T) స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. రాబోయే ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్‌ 10T స్మార్ట్‌ఫోన్(Smart Phone) భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు  3న లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్‌ను న్యూయార్క్(New York) నగరంలో నిర్వహించనున్నారు. భారతదేశంలోని వినియోగదారులు ఈవెంట్‌ను వన్‌ప్లస్‌ ఇండియా యూట్యూబ్(You tube) ఛానెల్‌లో లైవ్‌లో చూడవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈవెంట్‌ను వీక్షించే అవకాశం ఉంది.

వన్‌ప్లస్‌ గత కొంత కాలంగా ఈ T సిరీస్ ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సిరీస్‌లో వచ్చిన ఆఖరి ఫోన్ వన్‌ప్లస్‌ 8T, ఆ తర్వాత వన్‌ప్లస్‌ 9T మోడల్‌ రాలేదు. వచ్చే వారం నేరుగా వన్‌ప్లస్‌ 10T వినియోగదారుల ముందుకు వస్తోంది. వన్‌ప్లస్‌ 10T గురించి కంపెనీ ఇంకా వివరాలను వెల్లడించలేదు. కానీ కొన్ని లీక్‌ల ద్వారా దీనికి సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న లీక్‌లను పరిశీలిస్తే.. వన్‌ప్లస్‌ 10T సరికొత్త క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8+ Gen 1 చిప్‌సెట్, ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్, AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్‌లతో వస్తుంది.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !


 వన్‌ప్లస్‌ 10T స్పెసిఫికేషన్‌లు

భారతదేశంలో, గ్లోబల్ మార్కెట్‌లో వన్‌ప్లస్‌ 10T క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇదే వన్‌ప్లస్‌ 10 ప్రోకి కూడా వస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 16GB RAM, 512GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తుంది. కంపెనీ నుంచి 16GB RAMతో వస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే. ఈ ఫోన్ 6.7-అంగుళాల LTPO 2.0 AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz హై రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. వన్‌ప్లస్‌ 10T ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్‌ ఉంది. 10T సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16-మెగాపిక్సెల్ షూటర్‌ ఉంది. వన్‌ప్లస్‌ 10T 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4800mAh బ్యాటరీతో వస్తుందని సమాచారం.

స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో మూడు స్టోరేజ్‌ వేరియంట్‌లతో అందుబాటులోకి వస్తుంది. బేస్ మోడల్ 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.49,999 ధరకు.. మిగిలిన రెండు మోడల్‌లు 12GB RAM+ 256GB స్టోరేజ్, 16GB RAM+ 512GB స్టోరేజ్‌తో వరుసగా రూ.54,999, రూ. 55,999కి వస్తాయని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ జేడ్ గ్రీన్, మూన్‌స్టోన్ బ్లాక్‌ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సేల్ ఆఫర్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ దేశంలో ఆగస్టు 6 నుంచి అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్, ఇతర స్టోర్‌లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. కంపెనీ రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేస్తుంది.

Published by:Mahesh
First published:

Tags: ONE PLUS, Smartphones, Tech news, Youtube

ఉత్తమ కథలు