కొంతమందికి లైఫ్ బోర్ కొట్టేస్తుంది. ఒక్కోసారి సోషల్ మీడియా కూడా నచ్చదు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఎన్ని ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం వెంటాడుతుంది. ప్రతి నిమిషమూ భారంగా గడుస్తుంది. ఏం చేసినా నచ్చదు. అది ప్రమాదకర పరిణామం. అలాంటి సమయంలో వాళ్లకు ఎంతో కొంత ఉపశమనం కలిగించే వెబ్సైట్లు కొన్ని ఉన్నాయి. అవి కొంత రిలీఫ్ ఇవ్వడమే కాక... కాస్త ఆనందం, ఆశ్చర్యం కలిగిస్తాయి కూడా. ఒక్కసారైనా అలాంటి వెబ్సైట్లోకి వెళ్లి రావాలని అనిపించేలా ఉంటాయవి. అలాంటి కొన్ని వెబ్సైట్లను ఇవాళ తెలుసుకుందాం.
Sneeze The Dragon : ఇదో ఫన్నీ వెబ్సైట్. ఇందులో ఎంత ఎక్కువగా మౌస్‌ని క్లిక్ చేస్తే, అంతలా డ్రాగన్ మంటలు కక్కుతుంది. ఆ ఫన్ కావాలంటే ఈ సైట్లోకి వెళ్లాల్సిందే. https://codepen.io/Yakudoo/full/yNjRRL
Chill The Lion :ఇది కూడా ఫన్నీ సైటే. ఇందులో సింహం చుట్టూ ఓ ఫ్యాన్ ఉంటుంది. మీరు మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చెయ్యగానే ఫ్యాన్ తిరుగుతుంది. సింహానికి చల్లగా గాలి తగులుతుంటే, సింహం హాయిగా ఫీలవుతుంది. మీరు మౌస్ వదిలేస్తే, ఫ్యాన్ తిరగడం ఆగిపోతుంది. https://codepen.io/Yakudoo/full/YXxmYR
Drunk Walking Game : ఇదో ఛాలెంజింగ్ గేమ్. ఇందులో ఫుల్లుగా తాగిన ఓ వ్యక్తి రాత్రి వేళ రోడ్డుపై వెళ్తుంటాడు. అతడు తులూతూ వెళ్తుంటే కింద పడిపోకుండా మౌస్తో ముందుకు నడిపించాల్సింది మనమే. కిక్ ఇచ్చే ఆ వెబ్సైట్ లోకి వెళ్లండి మరి. http://gprime.net/game.php/drunkwalk
Tartan Maker :ఇదో మంచి వెబ్సైట్. ఇందులో మీరు స్వయంగా టార్టాన్ డిజైన్ తయారుచెయ్యొచ్చు. ఇందులో లక్షల కొద్దీ కాంబినేషన్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్, నచ్చిన ప్యాట్రన్ ఎంచుకోండి. అంతే.... అది మీరు సృష్టించిన టార్టాన్ అవుతుంది. మీరు దాన్ని క్లాథింగ్ డిజైన్ కోసం వాడుకోవచ్చు. http://www.tartanmaker.com/?page=index
The Worst Things For Sale :ఇదో చిత్రమైన వెబ్సైట్. ప్రపంచంలో ఎక్కడా కనిపించనివి, ఎక్కడా చూడనివి ఇక్కడ అమ్ముతారు. వాటిలో కొన్ని బాగా ఉపయోగపడేవి ఉంటాయి. కొన్ని పరమ చెత్తవి ఉంటాయి. అదే ఈ వెబ్సైట్ ప్రత్యేకత. http://theworstthingsforsale.com
Cloud Appreciation Society :ఆకాశం, మబ్బులు ఇష్టపడేవారి కోసం ఉన్న వెబ్సైట్ ఇది. ఇందులో చాలా ఆసక్తికర విషయాలుంటాయి. మబ్బుల ఫోరంలో మీరూ చేరవచ్చు. ఆశ్చర్యకరమైన మబ్బుల ఫొటోలను అప్లోడ్ చెయ్యవచ్చు. ఆలస్యమెందుకు ఓ లుక్ వెయ్యండి మరి. https://cloudappreciationsociety.org
Cats In Space :మీకు పిల్లులంటే ఇష్టమా. ఈ క్రేజీ సైట్ మీకోసమే. ఇందులో వందల కొద్దీ ఫొటోలూ, గిఫ్పులూ ఉంటాయి. రకరకాల పిల్లులు మిమ్మల్ని అలరిస్తాయి. కొన్ని క్యూట్‌గా, కొన్ని ఫన్నీగా ఉంటాయి. కొన్ని మాత్రం భయపెడతాయి. అలా వెళ్లి చూసి మళ్లీ మన స్టోరీలోకి వచ్చేయండి. http://www.omgcatsinspace.com
Who Is In Space ? : ప్రస్తుతం అంతరిక్షంలో ఎంతమంది వ్యోమగాములు ఉన్నారో, వాళ్ల పేర్లు, ఏం చేస్తున్నారో తెలియాలా... అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్లాలి. ఇందులో ఎప్పటికప్పుడు అంతరిక్షంలోకి వెళ్లే వాళ్ల పేర్లు, వివరాల్ని అప్డేట్ చేస్తారు. http://www.howmanypeopleareinspacerightnow.com
Human For Sale : మిమ్మల్ని మీరు మార్కెట్లో అమ్ముకోవాలా? మీ రేటెంతో తెలుసుకోవాలని ఉందా? ఐతే ఈ ఫన్నీ సైట్లోకి వెళ్లాల్సిందే. ఇందులో మీ అథ్లెటిక్ స్కిల్స్, ఎడ్యుకేషన్ లెవెల్, ఇన్కమ్, ఎక్సర్సైజ్, వెయిట్, సెన్సాఫ్ హ్యూమర్ అన్నీ పరిశీలించి, మీకో రేట్ ఫిక్స్ చేస్తారు. అది సరదా కోసమే... రియల్‌గా కాదు. http://www.humanforsale.com
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.