హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

OnePlus Smart TV: వన్‌ప్లస్ అదిరిపోయే స్మార్ట్ tv ..! తక్కువ ధరలోనే ఇంటికి తీసుకెళ్లవచ్చు.. ఫీచర్లు ఇవే !

OnePlus Smart TV: వన్‌ప్లస్ అదిరిపోయే స్మార్ట్ tv ..! తక్కువ ధరలోనే ఇంటికి తీసుకెళ్లవచ్చు.. ఫీచర్లు ఇవే !

వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ

వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ

స్మార్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీల తయారీలో కూడా దూసుకుపోతోంది. ఈ కంపెనీ ఇండియాలో కొత్త టీవీని విడుదల చేసింది. వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో (OnePlus TV 50 Y1S Pro) పేరుతో 4K రిజల్యూషన్ టీవీని తాజాగా రిలీజ్ చేసింది.

ఇంకా చదవండి ...

స్మార్ట్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఫోన్లతో పాటు స్మార్ట్ టీవీ(Smart Tv)ల తయారీలో కూడా దూసుకుపోతోంది. ఈ కంపెనీ ఇండియాలో కొత్త టీవీని విడుదల చేసింది. వన్‌ప్లస్ టీవీ 50 వై1ఎస్ ప్రో (OnePlus TV 50 Y1S Pro) పేరుతో 4K రిజల్యూషన్ టీవీని తాజాగా రిలీజ్ చేసింది. ఇది 10-బిట్ కలర్ డిస్‌ప్లేతో పాటు మరిన్ని ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోనుంది. వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ మిడ్ రేంజ్ స్మార్ట్ టీవీ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

* ధర, ఆఫర్లు

ఇండియాలో వన్‌ప్లస్ TV 50 Y1S ధర రూ. 32,999గా ఉంది. ఈ స్మార్ట్ టీవీ సేల్స్ జులై 7 నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు అమెజాన్ పోర్టల్‌తో పాటు OnePlus.inలో వీటిని కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్‌గా వన్‌ప్లస్ కొన్ని స్పెషల్ ఆఫర్లను కూడా అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్(Debit Card) వినియోగదారులు రూ. 3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్‌తో కొత్త టీవీ ధర రూ. 29,999కి తగ్గుతుంది. కస్టమర్లు 9 నెలల వరకు సులభమైన వాయిదాలలో ఈ మొత్తాన్ని చెల్లించడానికి నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: Deepika Padukone : సల్వార్ కమీజ్‌లో దీపికా అందాలు అదరహో.. వైరల్ అవుతున్న పిక్స్..


* స్పెసిఫికేషన్లు

వన్‌ప్లస్ TV 50 Y1S Pro స్మార్ట్‌టీవీ 10-బిట్ కలర్ డెప్త్‌తో 50-అంగుళాల 4k అల్ట్రా-HD డిస్‌ప్లేతో వస్తుంది. స్మార్ట్ టీవీ HDR10+ సపోర్ట్‌తో లాంచ్ అయింది. ఇది ఆండ్రాయిడ్ TV 10.0పై రన్ అవుతుంది. దీంతోపాటు గూగుల్ అసిస్టెంట్‌ సపోర్ట్ ఫీచర్ అదనపు ఆకర్షణ. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను ‘OnePlus Connect 2.0’ సపోర్ట్‌తో ఈ టీవికి కనెక్ట్ చేయవచ్చు. గేమర్స్ కోసం ఇందులో స్పెషల్ ఆటో లో లేటెన్సీ మోడ్ (ALLM) ఫీచర్‌ను కంపెనీ అందించింది. స్మార్ట్ టీవీ మొత్తం 24W అవుట్‌పుట్, డాల్బీ ఆడియోకు మద్దతుతో రెండు ఫుల్ రేంజ్ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 3 HDMI 2.1 పోర్ట్‌లు, 2 USB 2.0 పోర్ట్‌లు, ఆప్టికల్ ఈథర్నెట్ పోర్ట్, డ్యూయల్-బాన్ Wi-Fi, బ్లూటూత్ 5.0 వంటివి ఉన్నాయి.

* గత వారం కొత్త ఫోన్ రిలీజ్..

వన్‌ప్లస్ గత వారం తాజా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ నార్డ్ 2T’ని ఇండియాలో లాంచ్ చేసింది. ఆ తర్వాత వెంటనే కొత్త స్మార్ట్ టీవీని సైతం రిలీజ్ చేసింది. OnePlus Nord 2T 5G ఫోన్ ధర ఇండియాలో రూ. 28,999 వరకు ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్‌సెట్, 6.43 అంగుళాల 90Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీతో వస్తుంది.

First published:

Tags: Budget smart tv, Oneplus, Smart TV, Tech news

ఉత్తమ కథలు