హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphones Under Rs.10K: అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. లో బడ్జెట్‌లో దుమ్మురేపే మోడళ్లు ఇవే.. చూస్తే వెంటనే కొనేస్తారు!

Smartphones Under Rs.10K: అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. లో బడ్జెట్‌లో దుమ్మురేపే మోడళ్లు ఇవే.. చూస్తే వెంటనే కొనేస్తారు!

రూ 10  వేల లోపు  దుమ్మురేపే మోడళ్ళు ఇవే !

రూ 10 వేల లోపు దుమ్మురేపే మోడళ్ళు ఇవే !

మీడియం ప్రైజ్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్(Phone) కొనాలనుకునే వారికి రూ.10వేల సెగ్మెంట్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ విభాగంలో అనేక ఫోన్లు ఉన్నప్పటికీ, మార్కెట్లో రూ.10వేలలో బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్న టాప్-5 మోడల్స్(Models) ఏవో చూద్దాం.

ఇంకా చదవండి ...

ఇండియన్ స్మార్ట్‌ఫోన్(Smartphones) మార్కెట్‌లో బడ్జెట్ ఫోన్ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి మొబైల్(Mobile) తయారీ కంపెనీలు. అయితే మరీ తక్కువ ధరలో కాకుండా మీడియం ప్రైజ్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ఫోన్ కొనాలనుకునే వారికి రూ.10వేల సెగ్మెంట్ బెస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఈ విభాగంలో అనేక ఫోన్లు ఉన్నప్పటికీ, మార్కెట్లో రూ.10వేలలో బెస్ట్ ఫీచర్లతో లభిస్తున్న టాప్-5 మోడల్స్ ఏవో చూద్దాం.

Xiaomi Redmi 10A

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9,499. ఇది 6.52-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G35 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. రెడ్‌మీ 10A ఫోన్ 3GB RAM, 32GB స్టోరేజ్‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్ 13MP, 2MP సెన్సార్లతో డ్యుయల్ రియర్ కెమెరాలను అందిస్తుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,100 mAh బ్యాటరీతో వస్తుంది. రెడ్‌మీ 10A ఫోన్ చార్‌కోల్ బ్లాక్, సీ బ్లూ, స్లేట్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఇదీ చదవండి:  Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

Poco C3

ఈ ఫోన్ ధర రూ. 9,999. ఇది 6.53-అంగుళాల డిస్‌ప్లే(Display)తో వస్తుంది. వెనుక కెమెరా సెటప్‌లో 13 MP ప్రైమరీ కెమెరా, 2 MP పోర్ట్రెయిట్, 2 MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 5 MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది 5,000mAh బ్యాటరీతో రిలీజ్ అయింది. పోకో C3 ఫోన్ మాట్ బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ, లైమ్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

 realme C30

రియల్‌మీ C30 ఫోన్ ధర రూ. 7,499. ఇది యూనిసాక్ T612 ప్రాసెసర్ సాయంతో పనిచేస్తుంది. ఈ ఫోన్ 2 వేరియంట్‌లలో లభిస్తుంది. 2GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499 కాగా, 3GB RAM + 32GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,299. బ్యాక్ ప్యానెల్‌లో 8MP AI కెమెరాతో పాటు 5MP ఫ్రంట్ కెమెరా షూటర్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. డెనిమ్ బ్లాక్, బాంబూ గ్రీన్, లేక్ బ్లూ రంగులలో లభిస్తుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

Infinix Smart 6

ఈ ఫోన్ ధర రూ. 7,499. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 6 డివైజ్ 6.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 2GB RAM, 32GB స్టోరేజ్‌లో అందుబాటులో ఉంది. హ్యాండ్‌సెట్ డ్యుయల్ ఫ్లాష్‌తో 8MP రియర్ కెమెరా, సింగిల్ ఫ్లాష్‌తో 5 MP ఫ్రంట్ కెమెరా మాడ్యూల్స్‌తో వస్తుంది. దీంట్లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 OS (GoEdition)తో రన్ అవుతుంది. హార్ట్ ఆఫ్ ఓషన్, లైట్ సీ గ్రీన్, పోలార్ బ్లాక్, స్టార్రీ పర్పుల్ కలర్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

 Redmi 9 Activ

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 9,499. రెడ్‌మీ 9 యాక్టివ్ వేరియంట్ మీడియాటెక్ హీలియో G35 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇది 4GB RAM + 64GB, 6GB RAM + 128GB వంటి రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. హ్యాండ్‌సెట్ 6.53-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. బడ్జెట్‌లో గేమర్‌లకు ఇది బెస్ట్ ఆప్షన్. రెడ్‌మీ 9 యాక్టివ్ ఫక్షన్ డ్యుయల్ రియర్ షూటర్‌తో వస్తుంది. ఇందులో 13 MP ప్రైమరీ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ 5 MP AI సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. డివైజ్ 5,000 mAh బ్యాటరీతో రన్ అవుతుంది. రెడ్‌మీ 9 యాక్టివ్ ఫోన్ కార్బన్ బ్లాక్, కోరల్ గ్రీన్, మెటాలిక్ పర్పుల్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.

First published:

Tags: POCO, Realme Narzo, Tech news, Xiaomi

ఉత్తమ కథలు