Home /News /technology /

AMAZING IN THE FIELD OF TECHNOLOGY ANOTHER INNOVATION TO COMPETE WITH GOOGLE YOU WILL BE SURPRISED IF YOU READ ITUMG GH

Blockchain Technology: టెక్నాలజీ రంగంలో అద్భుతం ! గూగుల్ కు పోటీగా మరో ఆవిష్కరణ.. చదివితే ఆశ్చర్యపోతారు..

టెక్నాలజీ రంగంలో అద్భుతం ! గూగుల్ కు పోటీగా మరో ఆవిష్కరణ.. చదివితే ఆశ్చర్యపోతారు..

టెక్నాలజీ రంగంలో అద్భుతం ! గూగుల్ కు పోటీగా మరో ఆవిష్కరణ.. చదివితే ఆశ్చర్యపోతారు..

బ్లాక్‌చెయిన్ (Block Chain)అనేది నెక్స్ట్ జనరేషన్, ప్రామిసింగ్, రివల్యూషనరీ టెక్నాలజీ (Technology). ఇది ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందింది. ఈ సరికొత్త టెక్నాలజీతో వ్యాపారాలు రూపాంతరం చెందాయి. వ్యాపారాలు ఎలా పని చేస్తాయనే ప్రక్రియను ఇది పూర్తిగా మార్చివేసింది.

ఇంకా చదవండి ...
ఇప్పుడు ప్రపంచమంతా టెక్నాలజీ (Technology)జపం చేస్తోంది. దాదాపు అన్ని దేశాలు వివిధ రంగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ బ్లాక్‌చెయిన్(Block Chain). ఇటీవల టెక్ నిపుణుల దృష్టి ఈ సరికొత్త సాంకేతికతపై పడింది. బ్లాక్‌చెయిన్ అనేది నెక్స్ట్ జనరేషన్, ప్రామిసింగ్, రివల్యూషనరీ టెక్నాలజీ. ఇది ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందింది. ఈ సరికొత్త టెక్నాలజీతో వ్యాపారాలు రూపాంతరం చెందాయి. వ్యాపారాలు ఎలా పని చేస్తాయనే ప్రక్రియను ఇది పూర్తిగా మార్చివేసింది. ఈ టెక్నాలజీ కొంతవరకు గూగుల్ డాక్స్‌ను పోలి ఉంటుంది కానీ చాలా క్లిష్టంగా, అధునాతనమైనదిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఎలా పని చేస్తుంది, దీనికి ఎందుకు ఆదరణ లభిస్తోంది, ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి.. వంటి అన్ని వివరాలు తెలుసుకుందాం.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అంటే ఏంటి?
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అనేది ఒక రకమైన డిజిటల్ లెడ్జర్ టెక్నాలజీ. ఇది సిస్టమ్‌ను మార్చడం, హ్యాక్ చేయడం, సైబర్ ఫ్రాడ్స్ వంటివి నిరోధిస్తూ.. ఇన్ఫర్మేషన్‌ను, ట్రాన్సాక్షన్స్‌ను రికార్డ్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ బ్లాక్‌చెయిన్‌లోని కంప్యూటర్ సిస్టమ్‌ల మొత్తం నెట్‌వర్క్‌కు డిస్ట్రిబ్యూట్ అవుతాయి, అలాగే డూప్లికేట్ అవుతాయి. మరో మాటలో చెప్పాలంటే, ఇది డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్. ఇది చైన్స్‌పై బ్లాక్‌ల (blocks) రూపంలో అనేక ట్రాన్సాక్షన్స్‌ రికార్డ్ చేస్తుంది. బ్లాక్‌చెయిన్‌లో కొత్త ట్రాన్సాక్షన్ జరిగినప్పుడల్లా దాని రికార్డులు ప్రతి పార్టిసిపెంట్ లెడ్జర్‌కి యాడ్ అవుతాయి.

ఈ ఎంట్రీస్‌ను ఏ ఒక్క వ్యక్తి మార్చలేరు. ఎందుకంటే దీంట్లో అన్ని మాడిఫికేషన్స్ రియల్ టైమ్‌లో రికార్డ్ అయ్యేలా, పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఎవరైనా వాటిని మాడిఫై చేయడానికి లేదా కరప్ట్ చేయడానికి ప్రయత్నిస్తే.. వారు డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ చైన్‌లోని అన్ని బ్లాక్స్‌లో అలా చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాక్టికల్‌గా అసాధ్యం. లెడ్జర్‌లోని ఈ ట్రాన్సాక్షన్స్ యజమాని డిజిటల్ సంతకం ద్వారా ప్రొటెక్ట్ అవుతాయి. దీంతో సిస్టమ్ ఏదైనా మార్పు లేదా కరప్షన్ అటెమ్ట్‌ను త్వరగా గుర్తించగలదు. అందుకే బిక్‌కాయిన్ (Bitcoin), ఇథేరియం (Ethereum) వంటి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్స్ గత కొన్ని సంవత్సరాలలో చాలా ఫేమస్ అయ్యాయి.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఎందుకు ప్రాచుర్యం పొందింది?
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రజాదరణ పొందడానికి అత్యంత కీలకమైన కారణం దాని పారదర్శకత, మార్పుచేయలేని ఫీచర్. ఇది డీసెంట్రలైజ్డ్ పీర్-టు-పీర్ నెట్‌వర్క్ సిస్టమ్. ఇతర సెంట్రలైజ్డ్, సాంప్రదాయ ట్రాన్సాక్షన్స్ మాదిరిగా ట్రాన్సాక్షన్స్‌ను నియంత్రించడానికి నిర్దిష్ట వ్యక్తి ఎవరూ ఉండరు. ఈ టెక్నాలజీ.. దీన్ని ఉపయోగించే, అభివృద్ధి చేసే వారి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో పనిచేస్తుంది. తద్వారా ఇది మరింత విశ్వసనీయంగా మారుతుంది.

సాంప్రదాయ పద్ధతుల్లో ఒక వ్యక్తి నుంచి మరొకరికి ట్రాన్సాక్షన్స్‌ను నియంత్రించడానికి మధ్యవర్తి అవసరం. ఉదాహరణకు ఫైనాన్స్‌లో మీ బ్యాంక్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మీ స్నేహితుడు లేదా కుటుంబ సభ్యులకు డబ్బు బదిలీ చేసినప్పుడు, మీ బ్యాంక్ ఈ ప్రక్రియలో పాల్గొంటుంది. మీ అన్ని లావాదేవీలను బ్యాంక్ రికార్డ్ చేస్తుంది, పర్యవేక్షిస్తుంది. అయితే ఈ రికార్డులు ట్యాంపరింగ్ బారిన పడే అవకాశాలు ఉండవచ్చు. అంటే ఈ ప్రక్రియలో ఎంతో కొంత రిస్క్ ఉంటుంది. కానీ బ్లాక్‌చెయిన్‌తో ఈ మధ్యవర్తిత్వ సంస్థ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ. ఇది ఒక రకమైన డిజిటల్ లెడ్జర్. దీని రికార్డులను తారుమారు చేయడం లేదా సులభంగా తొలగించడం సాధ్యం కాదు. ఇది ట్రాన్సాక్షన్ ప్రాసెస్‌ వేగంగా, సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ఈ కారణంగానే బ్లాక్‌చెయిన్ ప్రొడక్ట్స్‌ బిట్‌కాయిన్స్ వంటి వచ్చువల్ కరెన్సీతో పాటు ఫైనాన్స్, సప్లై చైన్, హెల్త్‌కేర్, తయారీ వంటి ఇతర రంగాలలో విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చాయి.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రయోజనాలు
బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రధాన ఉపయోగాలు ఇవే..

అత్యంత సురక్షితమైనది
ఈ టెక్నాలజీ మోసాల బారిన పడని ట్రాన్సాక్షన్స్‌ క్రియేట్ చేయడానికి డిజిటల్ సంతకాలను ఉపయోగిస్తుంది. ఇది అత్యంత సురక్షితం. నోటీసు లేకుండా ఏ వ్యక్తి అయినా డేటాలో ఎటువంటి మార్పు అనుమతించని సామర్థ్యం దీని సొంతం. అందుకే దీని విశ్వసనీయత ఎంతో మెరుగ్గా ఉంటుంది.

డీసెంట్రలైజ్డ్ సిస్టమ్
ఇతర సాంప్రదాయ ట్రాన్సాక్షన్స్‌లో అయితే లావాదేవీలను నియంత్రించే కొన్ని నియంత్రణ లేదా కేంద్రీకృత సంస్థ ఆమోదం అవసరం. అయితే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో వినియోగదారుల మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఆధారంగా, ధ్రువీకరణతో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. అందువల్ల థర్డ్ పార్టీ మీడియేటర్స్ ఇబ్బందుల నుంచి యూజర్లు విముక్తి పొందారు.

ఆటోమేటెడ్, ఫాస్ట్ ప్రాసెసింగ్‌ కెపాసిటీ
బ్లాక్‌చెయిన్ అనేది ప్రోగ్రామబుల్ టెక్నాలజీ. ట్రిగ్గర్ ప్రమాణాలు నెరవేరిన తర్వాత ఆటోమెటిక్‌గా వివిధ యాక్షన్స్, ఈవెంట్స్ నిర్వహించగలదు. అంతేకాక థర్డ్ పార్టీ జోక్యం అనేది ఉండదు కాబట్టి ప్రాసెసింగ్‌ను వేగవంతం చేస్తుంది.

బ్లాక్‌చెయిన్ డెవలపర్స్ అంటే ఎవరు?
బ్లాక్‌చెయిన్ డెవలపర్స్ అంటే బ్లాక్‌చెయిన్ ప్రోటోకాల్, ఆర్కిటెక్చర్ కోసం డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేసి ఆప్టిమైజ్ చేసే వారు. బ్లాక్‌చెయిన్ ప్రోటోకాల్ ఆధారంగా, బ్లాక్‌చెయిన్ నోడ్‌లలో రన్ అయ్యే అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడం, ప్రోగ్రామింగ్ చేయడం, ఆప్టిమైజ్ చేయడం వంటివి వీరి బాధ్యతలు. వారి స్కిట్ సెట్, నాలెడ్జ్.. 3D మోడలింగ్, 3D కంటెంట్ డెవలప్‌మెంట్‌ను కలిగి ఉంటుంది, ఇది గేమ్ డెవలపర్స్ మాదిరిగానే ఉంటుంది.

అయితే బ్లాక్‌చెయిన్ డెవలపర్‌లచే అభివృద్ధి చేసిన అప్లికేషన్స్ సాధారణ వాటి కంటే కొంచెం భిన్నంగా నడుస్తాయి. ఉదాహరణకు వీరు వెబ్ 3.0 అనే ఇంటర్నెట్ డీసెంట్రలైజ్డ్ వెర్షన్‌లో పని చేస్తారు. ఈ ప్రత్యేకత బ్లాక్‌చెయిన్ డెవలపర్స్ పాత్రను కొంచెం క్లిష్టంగా, సవాలుగా చేస్తుంది. ఎందుకంటే వారి పని సాధారణ వర్క్‌లా కాకుండా వెబ్ Web3 ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. అందువల్ల వారికి అదనపు నైపుణ్యాలు అవసరం. సాధారణంగా బ్లాక్‌చెయిన్ డెవలపర్స్ రోల్‌ను రెండు భాగాలుగా వర్గీకరించవచ్చు.

కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్స్
కోర్ బ్లాక్‌చెయిన్ డెవలపర్స్‌ అనేవారు బ్లాక్‌చెయిన్‌తో రూట్ లెవల్‌లో ఇంటరాక్ట్ అవుతారు. వారి పనిలో బ్లాక్‌చెయిన్ ప్రోటోకాల్స్, నెట్‌వర్క్ ఆర్కిటెక్చర్ డిజైన్, డెవలప్‌మెంట్, మానిటరింగ్, ప్రోటోకాల్‌ను పర్యవేక్షించడం, వివిధ బ్లాక్‌చెయిన్ ఫీచర్లను అమలు చేయడం వంటివి ఉంటాయి.

బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌
బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌ అనేవారు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో హై లెవల్ ఇంటరాక్షన్స్ బాధ్యతలు నిర్వహిస్తారు. వీరి బాధ్యతల్లో బ్లాక్‌చెయిన్ డెవలపర్స్‌ అప్లికేషన్‌లలో అభివృద్ధి చేసిన అల్గారిథమ్‌లను అమలు చేయడం, బ్లాక్‌చెయిన్ మెకానిజమ్‌లపై పనిచేసే డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడం, APIలను డెవలప్ చేయడం, అప్లికేషన్‌ల ఫ్రంటెండ్, బ్యాకెండ్‌ను డిజైన్, డెవలప్ చేయడం మొదలైనవి ఉంటాయి.

బ్లాక్‌చెయిన్ టెక్నాలజీలో స్కిల్ గ్యాప్స్ చాలా ఉన్నాయి. దీంతో డెవలపర్స్ కోసం డిమాండ్ ఆల్-టైమ్ హైలో ఉంది. ఈ రంగంలోని నిపుణులు బ్లాక్‌చెయిన్ డెవలపర్స్‌గా మారడానికి మంచి నాలెడ్జ్, స్కిల్స్ ఉండాలి. అనేక ముందస్తు అవసరాలు కూడా ఉన్నాయి. బ్లాక్‌చెయిన్ డెవలపర్ జాబ్ కోసం ఫుల్ రోడ్‌మ్యాప్ ఎలా ఉంటుందో చూద్దాం...

ఇదీ చదవండి: Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !


అకడమిక్స్
బ్లాక్‌చెయిన్ డెవలపర్స్ జాబ్ కోసం చూసేవారు తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్యాక్‌డ్రాప్‌ ఫీల్డ్‌కు చెందినవారై ఉండాలి. ఇతర డెవలపర్స్ మాదిరిగా C++, Python, Java వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ తెలియాలి. డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్‌లను కూడా అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లాజికల్ థింకింగ్ వంటివి తప్పనిసరి.

- ఆర్కిటెక్చర్, క్రిప్టోగ్రఫీ సహా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి సంబంధించిన ఫౌండేషనల్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి.

- బ్లాక్‌చెయిన్ బేసిక్స్ అర్థం చేసుకున్న తర్వాత డెవలపర్ టూల్స్, బ్లాక్‌చెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ పొందడం తప్పనిసరి. ఇందులో స్మార్ట్ కాంట్రాక్ట్స్ రాయడం, కన్సెంసస్ అల్గారిథమ్స్ అభివృద్ధి చేయడం, టెక్నాలజీలో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ పొందడం వంటివి కూడా అవసరం.

- బ్లాక్‌చెయిన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత తదుపరి దశలో డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడం, డెవలప్ చేయడం వంటివి నేర్చుకోవాలి. డీసెంట్రలైజ్డ్ మొబైల్, వెబ్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రాక్టికల్ సెషన్స్‌లో పాల్గొనాలి. ఈ సెషన్‌లో వివిధ ఫీచర్లను అమలు చేయడానికి ఫ్రేమ్‌వర్క్‌లను విస్తృతంగా ఉపయోగించాలి. సాధారణంగా బ్లాక్‌చెయిన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్‌కు ఇది భిన్నంగా ఉండవచ్చు.

బ్లాక్‌చెయిన్ డెవలపర్‌గా మారడానికి అవసరమైన నైపుణ్యాలు

బ్లాక్‌చెయిన్ డెవలపర్స్‌కు ఎడ్యుకేషన్‌ ఎలిజిబిలిటీతో పాటు ఇతర ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం. వీటితో పాటు ఉద్యోగార్థులకు అవసరమైన స్కిల్ సెట్స్ ఏవో చూద్దాం.

డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్‌లపై అవగాహన
బ్లాక్‌చెయిన్ అనేది క్రిప్టోగ్రఫీపై ఆధారపడిన డేటా స్ట్రక్చర్. వివిధ ఆపరేషన్స్ అమలు చేయడానికి ఇది అల్గారిథమ్‌లపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఈ రంగంలో పనిచేసే ఎవరికైనా డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్ కాన్సెప్ట్స్ గురించి తప్పనిసరిగా తెలిసి ఉండాలి.

హై లెవల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ప్రావీణ్యం
సాధారణంగా డెవలపర్ జాబ్ రోల్స్ అన్నింటికీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ల నాలెడ్జ్ అనేది తప్పనిసరి అవసరం. C++, C#, JavaScript, Python, Ruby, Java వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీకి అత్యంత అవసరం. కాబట్టి ఈ కోడింగ్ లాంగ్వేజ్‌లలో ఏదైనా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిలో ప్రావీణ్యం ఉండాలి.

క్రిప్టోగ్రఫీ నాలెడ్జ్
క్రిప్టోగ్రఫీ అనేది థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా ఇన్ఫర్మేషన్ బ్రేక్ చేయడం, కరప్ట్ చేయడాన్ని నిరోధించేందుకు, రక్షించేందుకు విభిన్న పద్ధతులను ఉపయోగించే మార్గం. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సురక్షితంగా పని చేయడానికి క్రిప్టోగ్రఫీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బ్లాక్‌చెయిన్ డెవలపర్ ఈ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.



స్మార్ట్ కాంట్రాక్ట్స్ నాలెడ్జ్
స్మార్ట్ కాంట్రాక్ట్స్ బ్లాక్‌చెయిన్‌లో పనిచేసే ప్రోగ్రామ్ లేదా స్క్రిప్ట్ వంటి సెల్ఫ్ ఎగ్జిక్యూటింగ్ కాంట్రాక్ట్స్. ఇవి థర్డ్ పార్టీగా వ్యవహరిస్తూ పార్టీల మధ్య లావాదేవీలను పర్యవేక్షిస్తాయి, వాటి మధ్య సేవల మార్పిడిని మానిటర్ చేస్తాయి. అందువల్ల దీని గురించి తెలిసి ఉండటం ఎల్లప్పుడూ ప్లస్ పాయింట్.

అవసరమైన సర్టిఫికేట్ కోర్సులు
ఆన్‌లైన్‌లో ఈ టెక్నాలజీకి సంబంధించిన వివిధ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సెక్టార్‌లో మంచి కెరీర్ కోసం వీటిని ఎంచుకోవచ్చు. ఈ ఫీల్డ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ డెవలపర్ జాబ్స్‌కు చాలా డిమాండ్ ఉంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కాబట్టి బ్లాక్‌చెయిన్ డెవలపర్‌గా మారడానికి అవసరమైన అర్హతలు పొందడంతో పాటు ఎడిషనల్ నాలెడ్జ్‌పై పట్టు సాధిస్తే విజయం మీ సొంతం అవుతుంది.

ఈ ఆర్టికల్ అందించిన పీయూష్ వ్యవస్థాపకుడిగా మారిన అనుభవజ్ఞుడైన ఎంటర్‌ప్రైజ్-సేల్స్ ప్రొఫెషనల్. డిజిటల్ ప్రొడక్ట్స్, బీఎఫ్ఎస్ఐ, రీటైల్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అతను Bridgentech.com కో-ఫౌండర్. అతని బూట్‌స్ట్రాప్డ్ స్టార్ట్ అప్‌తో 2.5 మిలియన్ డాలర్లకు పైగా అత్యుత్తమ ARRతో బలమైన టీమ్‌ను నిర్మించారు. ఎంఐటీ మణిపాల్ (మెకానికల్ ఇంజనీర్), SPJIMR, ముంబై (MBA), ఈఎస్‌బీ రాయిట్లింగన్, జర్మనీ, టీయూ మ్యూనిక్, జర్మనీ లాంటి ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూషన్స్‌లో పూర్వ విద్యార్థి. అతను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటించారు. ప్రధానంగా పశ్చిమ ఐరోపా, అమెరికా, భారత ఉపఖండ మార్కెట్‌లలో పని చేస్తున్నారు. అతను కొత్త ఆలోచనలు, బిజినెస్ ప్లాన్స్‌తో వ్యాపార వృద్ధి, సక్సెస్ వైపు టీమ్స్‌ని నిర్మించి, నిర్వహించి, నడిపించారు. UI/UX డిజైన్, బిజినెస్ ప్లానింగ్, సంగీతం, కోచింగ్, స్ట్రాటజీ అతని అభిరుచులు.
Published by:Mahesh
First published:

Tags: Bitcoin, Blockchain, Cyber Attack, Digital payments

తదుపరి వార్తలు