సిటీ మధ్యలో సముద్రం... కొరియాలో అద్భుతం... వైరల్ వీడియో...

సముద్రం అంటే ఎవరికైనా ఇష్టమే... మనలో ఆహ్లాదాన్ని పెంచి... టెన్షన్లను తగ్గించే శక్తి సముద్రానికి ఉంది. మరి సిటీ మధ్యలో సముద్రం సంగతేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: May 23, 2020, 2:24 PM IST
సిటీ మధ్యలో సముద్రం... కొరియాలో అద్భుతం... వైరల్ వీడియో...
సిటీ మధ్యలో సముద్రం... కొరియాలో అద్భుతం... వైరల్ వీడియో... (credit - Youtube)
  • Share this:
మీరు బాగా అలసిపోయారనుకుందాం. పనులు చేసీ చేసీ చిరాకొచ్చినప్పుడు... అలా కళ్లు మూసుకొని... ఓసారి సముద్రాన్నీ, అక్కడి అలలు, గాలులు, ఇసుక తిన్నెలు... ఆల్చిప్పలు తలుచుకుంటే... ఒకింత ఉపశమనంలా అనిపిస్తుంది కదా... ఇదే కాన్సెప్టుతో... దక్షిణ కొరియాలో అనామోర్ఫిక్ పబ్లిక్ ఆర్ట్ ఇల్లస్ట్రేషన్ తయారుచేసింది డి-స్ట్రిక్ట్ కంపెనీ. నాలుగు బాస్కెట్ బాల్ కోర్టులంత పెద్దగా ఉండే... డిజిటల్ బిల్ బోర్డుబై ఈ ఇల్లస్ట్రేషన్‌ను తయారుచేసింది. కొరియా... రాజధాని సియోల్‌లోని SM టౌన్... కొయక్స్ ఆర్టియం దగ్గర ఈ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. 268 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తుతో... ఇది కొరియాలోనే అతి పెద్ద అవుట్‌డోర్ స్క్రీన్‌గా గుర్తింపుపొందింది.


ఈ స్క్రీన్ రిజల్యూషన్ చాలా ఎక్కువ. 7840 x 1,952 పిక్సెల్స్ ఉంది. అంటే... అల్ట్రా హై డెఫినిషన్ కంటే డబుల్. దీన్ని నెలపాటూ నిర్మించారు. ఇందులో 30వేల ప్రత్యేకమైన లెడ్ డిస్‌ప్లే మాడ్యూల్స్ ఉన్నాయి. ఒక్కోటీ 1 సెంటీ మీటర్ సైజు ఉంటుంది. ఏది ఏమైనా... సిటీ మధ్యలో సముద్రం ఉన్నట్లుగా, అలలు వస్తున్నట్లుగా ఫీలవుతూ... కాస్త టెన్షన్లను తగ్గించుకుంటున్నారు.

First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading