మీరు గూగుల్ డ్రైవ్‌ వాడుతూ ఉంటే... ఈ ఫ్రీ బెనెఫిట్స్ మీ సొంతం

Google Drive Benefits : ఈ రోజుల్లో ఎక్కువ మంది తమ వ్యక్తిగత డేటా, ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్‌లోనే స్టోర్ చేసుకుంటున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: March 5, 2019, 10:15 PM IST
మీరు గూగుల్ డ్రైవ్‌ వాడుతూ ఉంటే... ఈ ఫ్రీ బెనెఫిట్స్ మీ సొంతం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాడుకోతగ్గ చక్కటి ఆన్‌లైన్ డ్రైవ్ గూగుల్ డ్రైవ్. గూగుల్ ప్రతి ఒక్కరికీ 15జీబీ స్టోరేజ్ స్పేస్ ఫ్రీగా ఇస్తోంది. ఇందులోనే మన జీమెయిల్స్, ఫొటోస్, వీడియోలు, ఫైల్స్ ఏవైనా దాచుకోవాల్సి ఉంటుంది. 15 జీబీ దాటిపోతే... ఎక్స్‌ట్రా స్పేస్ కొనుక్కోవాల్సి ఉంటుంది. లేదంటే మరో జీమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మరో 15జీబీ స్పేస్ ఫ్రీగా లభిస్తుంది. ఐతే... మన దగ్గరున్న 15జీబీని జాగ్రత్తగా వాడుకుంటే... మరో జీమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రధానంగా అవసరం లేని మెయిళ్లను ఎప్పటికప్పుడు డిలీట్ చేసేయాలి. అలా డిలీటైన మెయిల్స్... ట్రాష్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. అందువల్ల ట్రాష్ ఫోల్డర్‌ను కూడా Empty Trash Folder ఆప్షన్‌తో పూర్తిగా ఖాళీ చెయ్యాలి. స్పామ్ మెయిల్స్ డిలీట్ చేసినా ఇలాగే చెయ్యాలి. తద్వారా ఎప్పటికప్పుడు స్పేస్ మిగుల్చుకోవచ్చు.

google drive, google, how to use google drive, google drive storage, what is google drive and how to use it, what is google drive and how does it work, what is google drive, google apps, using google drive, my google drive, what is google drive app, google drive for pc, what is google drive backup, google drive kya hai, how to use google drive offline, how to take google drive backup, గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ప్రయోజనాలు, గూగుల్ డ్రైవ్ ఉపయోగాలు, గూగుల్ డ్రైవ్ లాభాలు, గూగుల్ డ్రైవ్, గూగుల్ డ్రైవ్ ఫీచర్లు, గూగుల్ డ్రైవ్ అంశాలు, గూగుల్ డ్రైవ్ మంచిదేనా
ప్రతీకాత్మక చిత్రం


గూగుల్ డ్రైవ్ అనేది... మన పర్సనల్ కంప్యూటర్లలో డ్రైవ్ లాగే పనిచేస్తుంది. కాకపోతే... ఇందులో దాచుకునే ఫైల్స్, ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ట్రాక్‌లను మనం ప్రపంచంలో ఎక్కడైనా ఆన్‌లైన్‌లో చూసుకొని, వాడుకునే వీలుంది. చక్కగా ఉపయోగించుకుంటే గూగుల్ డ్రైవ్ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకోసం ఏం చెయ్యాలంటే...

1.బ్యాకప్ చేసుకోండి : ముఖ్యమైన ఫొటోలు, బిజినెస్ ఫైల్స్ జీవితాంతం ఉండాల్సిన వాటిని గూగుల్ డ్రైవ్‌లో దాచుకోవచ్చు. ఇంట్లో కంప్యూటర్లు, ఎక్స్‌టర్నల్ హార్డ్ డిస్కుల వంటివి ఎప్పుడైనా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు వాటిలో ఫైల్స్ దెబ్బతినొచ్చు. అసలు పూర్తిగా డిలీట్ అవ్వొచ్చు. గూగుల్ డ్రైవ్‌లో ఆ పరిస్థితే ఉండదు.

2.పెద్ద ఫైల్స్ షేర్ చెయ్యొచ్చు : జీమెయిల్ ద్వారా మీరు ఒకసారి 25mb వరకు మాత్రమే ఫైల్స్ మెయిల్ చెయ్యగలరు. అదే గూగుల్ డ్రైవ్ నుంచీ మీరు 10gb వరకూ షేర్ చెయ్యవచ్చు.

3.డాక్యుమెంట్లు యాక్సెస్ చేస్తుంది : మీరు ఏ ప్రయాణంలోనో ఉన్నప్పుడు మొబైల్ ద్వారా ఫైల్స్ యాక్సెస్ చెయ్యాలంటే గూగుల్ డ్రైవ్ యాప్ ఉపయోగపడుతుంది.

4.సెర్చ్ ఇంజిన్ సదుపాయాలు : గూగుల్ డ్రైవ్‌లో ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ ఉంది. అది మీ గూగుల్ డ్రైవ్‌లో ఎలాంటి ఫైల్స్, వీడియోలు, ఫొటోలనైనా కీవర్డ్స్ ద్వారా సెర్చ్ చేసి పెడుతుంది.5.ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ ఫీచర్ : గూగుల్ డ్రైవ్‌లో ఇదో ప్రత్యేక ఆప్షన్. ఇందులోని ఆప్టికల్ కేరక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ... ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న డాక్యుమెంట్లను కూడా స్కాన్ చేసి... మీరు అడిగే వర్డ్‌తో ఉన్న డాక్యుమెంట్లను మీకు చూపిస్తుంది. మీరు ఏదైనా చారిత్రక అంశంపై సెర్చ్ చేస్తున్నట్లైతే... ఈ ఆప్షన్ మీకు బాగా ఉపయోగపడుతుంది.

6.కాంటాక్ట్‌లో ఉన్న వారికి షేరింగ్స్ : మీ జీమెయిల్ కాంటాక్ట్స్‌లో ఉన్న వారికి ఫొటోలూ, వీడియోలను... వారి గూగుల్ డ్రైవ్‌కి షేర్ చెయ్యడానికి మీ గూగుల్ డ్రైవ్ అకౌంట్ చక్కగా ఉపయోగపడుతుంది.

7.ఆన్‌లైన్ ఎడిటింగ్ : మీ గూగుల్ డ్రైవ్‌లో ఉన్న డాక్యుమెంట్లు, ఫైళ్లను ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసి... అక్కడే ఎడిటింగ్ చేసుకోవచ్చు. వాటిని గూగుల్ డ్రైవ్ ఆటోమేటిక్‌గా సేవ్ చేస్తుంది కూడా.

8.ఏ ఫైలైనా ఓపెన్ : మీ కంప్యూటర్‌లో ఏదైనా ఫైల్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్ లేకపోతే... దాన్ని మీరు ఓపెన్ చెయ్యలేరు. అదే ఫైల్‌ని మీరు గూగుల్ డ్రైవ్‌లో సేవ్ చేసి... ఓపెన్ చేసుకోవచ్చు. అడోబ్ ఫైల్స్, స్ప్రెడ్ షీట్లు, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్లు ఏవైనా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి చూపిస్తుంది.

9.అద్భుతమైన ఇమేజ్ రికగ్నిషన్ టెక్నాలజీ : గూగుల్ డ్రైవ్‌లో మీరు దాచే ఫొటోలను అది గుర్తిస్తుంది. తద్వారా మీరు ఏదైనా ఫేమస్ ల్యాండ్ మార్క్ దగ్గర ఫొటో దిగితే... ఆ ల్యాండ్ మార్క్ పేరుతో మీరు సెర్చ్ చేసినా... ఆ ఫొటోను మీకు వెతికి చూపిస్తుంది.

10.ఫుల్ సేఫ్టీ : గూగుల్ ఆల్గారిథం మిగతా సాఫ్ట్‌వేర్లకు భిన్నమైనది. అందువల్ల ఇది హ్యాకర్లకు చిక్కదు. మీ ఫైల్స్‌కి ఎలాంటి హ్యాకింగ్ సమస్యా ఉండదు. ఐతే మీ గూగుల్ పాస్ వర్డ్ మాత్రం కాస్త కఠినంగా ఉండేది పెట్టుకోవాలి. కనీసం 2 నెలల కోసారైనా పాస్ వర్డ్ మార్చేస్తూ ఉండాలి. ఎప్పుడూ, ఎక్కడా, ఎవరికీ పాస్ వర్డ్ చెప్పకూడదు.

గమనిక : జీమెయిల్‌లో డిలీట్ చేసినవి ఎలాగైతే ట్రాష్ ఫోల్డర్‌లోకి వెళ్తాతో... గూగుల్ డ్రైవ్‌లో డిలీట్ చేసినవి కూడా అక్కడి ట్రాష్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. అందువల్ల గూగుల్ డ్రైవ్‌లో ట్రాష్ ఫోల్డర్‌ను కూడా ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకుంటే, 15జీబీ స్పేస్‌ను చక్కగా వాడుకున్నట్లవుతుంది.

 

ఇవి కూడా చదవండి :

యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా... ఇలా చెయ్యండి

మీ ఆధార్ కార్డ్ వివరాల్ని ఎవరెవరికి ఇచ్చారు? తెలుసుకోవాలంటే ఇలా చెయ్యండి

యూట్యూబ్‌ వీడియోలో కొంత భాగమే డౌన్‌లోడ్ చెయ్యాలా... సింపుల్ ట్రిక్

వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఫొటోలూ డౌన్‌లోడ్ చెయ్యడం ఎలా?
First published: March 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading