హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazfit Pop 2: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌వాచ్.. స్పెషల్ డిస్కౌంట్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!

Amazfit Pop 2: మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌వాచ్.. స్పెషల్ డిస్కౌంట్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు..!

 (Image: Amazfit)

(Image: Amazfit)

Amazfit Pop 2: అమేజ్‌ఫిట్ కంపెనీ అమేజ్‌ఫిట్ పాప్ 2 (Amazfit Pop 2) పేరుతో మరో స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. నాయిస్, ఫైర్ బోల్ట్, బోట్ వంటి ప్రత్యర్థి కంపెనీలు ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌వాచ్‌ మోడల్స్‌కు పోటీగా దీన్ని మార్కెట్లలోకి తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌ (Smartwatch)లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టు కంపెనీలు కూడా ఎప్పటి‌కప్పుడు కొత్త ఫీచర్లతో వీటిని లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తాజాగా అమేజ్‌ఫిట్ కంపెనీ అమేజ్‌ఫిట్ పాప్ 2 (Amazfit Pop 2) పేరుతో మరో స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. నాయిస్, ఫైర్ బోల్ట్, బోట్ వంటి ప్రత్యర్థి కంపెనీలు ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌వాచ్‌ మోడల్స్‌కు పోటీగా దీన్ని మార్కెట్లలోకి తీసుకొచ్చింది. దీని ధర, ఫీచర్లను పరిశీలిద్దాం..

* అమేజ్‌ఫిట్ పాప్ 2 ధర

ఈ స్మార్ట్‌వాచ్ రూ.3999 ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లలో లాంచ్ అయింది. అయితే లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.3299కు కొనుగోలు చేయవచ్చు. బ్లాక్, పింక్ వంటి రెండు కలర్ ఆప్షన్‌లలో ఇది లభిస్తుంది. ప్రస్తుతం దాదాపు రూ.700 డిస్కౌంట్‌‌తో ఈ స్మార్ట్‌వాచ్‌ను సొంతం చేసుకోవచ్చు.

* స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్‌వాచ్‌ను మెటాలిక్ మిడిల్ ఫ్రేమ్‌తో రూపొందించారు.150 కంటే ఎక్కువ వాచ్‌ఫేస్‌లతో 1.78-అంగుళాల HD AMOLED డిస్‌ప్లేతో ఇది లభించనుంది. ఇది బ్లడ్-ఆక్సిజన్ (spO2) మెజర్మెంట్, హార్ట్ రేట్ సెన్సింగ్, 100+ స్పోర్ట్ మోడ్ ట్రాకింగ్‌ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే 24 గంటల పాటు హార్ట్ రేట్ పర్యవేక్షణకు సపోర్ట్ ఇస్తుంది.

* మైక్, స్పీకర్ ఇన్-బిల్ట్‌గా..

ఈ స్మార్ట్‌వాచ్‌లో మైక్, స్పీకర్ ఇన్-బిల్ట్‌గా ఉంటాయి. దీంతో యూజర్లు స్మార్ట్‌వాచ్‌ ద్వారా నేరుగా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా స్పెసిఫిక్ యాప్స్, SMS‌కు సంబంధించిన నోటిఫికేషన్ అలర్ట్‌ ఫీచర్‌ను పొందవచ్చు. రిమోట్ మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్స్, వాయిస్ అసిస్టెంట్ వంటి అన్ని సాధారణ ఫీచర్‌లకు ఈ స్మార్ట్ వాచ్ సపోర్ట్ చేయనుంది.

ఇది కూడా చదవండి : రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్... దేశరాజధాని అంతటా 5జీ సేవలు అందిస్తున్న తొలి కంపెనీ

* IP68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌

తాజా డివైజ్‌లోని 270 mAh యూనిట్ ద్వారా యూజర్లు10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌వాచ్ IP68 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్‌ కలిగి ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ కోసం బ్లూటూత్ 5.2 కనెక్టివిటీపై ఆధారపడుతుంది.

* అమ్మకాలు నవంబర్ 22 నుంచి..

సాధారణంగా అమేజ్‌ఫిట్ స్మార్ట్‌వాచ్‌లను భారత్‌లో అమెజాన్ ద్వారా విక్రయిస్తుంటారు. కంపెనీ రిలీజ్ చేసిన అన్ని మోడల్స్ ఇదే పోర్టల్ ద్వారా సేల్‌ అయ్యాయి. అయితే తాజా అమేజ్‌ఫిట్ పాప్ 2 మాత్రం.. అమేజ్‌ఫిట్‌ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లలో అందుబాటులో ఉంటుంది. భారత్‌లో దీని సేల్స్ నవంబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.

First published:

Tags: Smart watch, Smartwatch, Tech news

ఉత్తమ కథలు