హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..

Alzheimer’s Disease: అల్జీమర్స్ వ్యాధిని ముందుగానే గుర్తించే స్మార్ట్‌ యాప్‌.. ఆవిష్కరించిన అమెరికన్ పరిశోధకులు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హెల్త్‌కేర్ రంగంలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు యూఎస్ పరిశోధకులు. అల్జీమర్స్ (Alzheimer’s) వ్యాధిని తొలి దశలోనే గుర్తించే ఒక యాప్‌ను వీరు అభివృద్ధి చేశారు.

వైద్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) చేర్చడం వల్ల రోగ నిర్ధారణ (Diseases Diagnosis), చికిత్స చేయడం ఇప్పుడు మరింత సులభమైంది. ఈ రోజుల్లో వైద్యులు టెక్నాలజీ సహాయంతో చాలా క్లిష్టమైన ట్రీట్‌మెంట్స్‌ చాలా సులువుగా చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే హెల్త్‌కేర్ రంగంలో మరో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు యూఎస్ పరిశోధకులు. అల్జీమర్స్ (Alzheimer’s) వ్యాధిని తొలి దశలోనే గుర్తించే ఒక యాప్‌ను వీరు అభివృద్ధి చేశారు. ప్రపంచంలో కనీసం 5 కోట్ల మంది ప్రజలు అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్నారు. ఇలాంటి వ్యాధిని తొలిదశలో గుర్తించడం వైద్యులతో సహా రోగులకు కూడా కష్టంగా ఉంటుంది. దీనిని ఎర్లీ స్టేజీలో గుర్తించలేకపోవడం వల్ల చికిత్స పొందినా రోగులకు అంతగా ఫలితం ఉండటం లేదు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు యూఎస్ పరిశోధనా బృందం స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డెవలప్ చేసింది.

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ మెగా ఐపీవో ప్రారంభం.. షేర్లు కొనుగోలు చేసే ముందు వీటిని తెలుసుకోండి..


యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో పరిశోధకులు ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రస్తుతం ప్రోటోటైప్ వెర్షన్ గా ఉంది. ఈ యాప్‌లోని సాఫ్ట్‌వేర్ ఒక వ్యక్తి కనుపాప పరిమాణంలో నిమిషాల వ్యత్యాసాలను పర్యవేక్షిస్తుంది. గత అధ్యయనాల ప్రకారం, కనుపాప సైజు అనేది ప్రీ-క్లినికల్ న్యూరోలాజికల్ డిసీజ్‌లతో ముడిపడి ఉంటుంది. ఈ లింక్ ఉండటం వల్ల కనుపాప సైజు వేరియేషన్స్ ని పర్యవేక్షించి న్యూరోలాజికల్ డిసీజ్‌లను డయాగ్నోసిస్ చేయొచ్చు. ఫేషియల్ ఐడెంటిఫికేషన్ కోసం, సాఫ్ట్‌వేర్ కొత్త స్మార్ట్‌ఫోన్లలోని నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరాను ఉపయోగిస్తుంది. అలాగే అది ఒక వ్యక్తి కనుపాప పరిమాణంలో ఎలా మారుతుందో విశ్లేషించడానికి స్టాండర్డ్ సెల్ఫీ కెమెరాను ఉపయోగిస్తుంది. ఏప్రిల్ 30, మే 5 మధ్య, న్యూ ఓర్లీన్స్‌లోని హ్యూమన్ ఫ్యాక్టర్స్ ఇన్ కంప్యూటింగ్ సిస్టమ్స్ (CHI 2022)పై ACM కంప్యూటర్-హ్యూమన్ ఇంటరాక్షన్ కాన్ఫరెన్స్‌లో ఈ టెక్నాలజీ పనితీరు గురించి వివరంగా ఒక పేపర్ పబ్లిష్ చేశారు. కానీ ఈ అధ్యయనం ఇంకా పీర్-రివ్యూ, ఏ జర్నల్‌లో ప్రచురించలేదు.

* వ్యాధి లక్షణాలు గుర్తించడం

అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు లేదా సంకేతాలను చూపించే మొదటి మెదడు ప్రాంతాలలో లోకస్ కోరులియస్ (Locus Coeruleus) ఒకటి అని ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన ఆధారంగా యూఎస్ రీసెర్చర్లు ఈ యాప్ డెవలప్ చేశారు. లోకస్ కోరులియస్ అనేది ఒక చిన్న మెదడు వ్యవస్థ కేంద్రకం. ఇది కంటిపాప వ్యాకోచాన్ని (Pupil Dilation) నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల కంటే మైల్డ్ కాగ్నిటివ్ బలహీనత (Mild Cognitive impairment) ఉన్న వ్యక్తుల్లో కనుపాప పరిమాణం పెరిగిందని గత అధ్యయనం కనుగొంది. ముఖ్యంగా ఏదైనా కష్టమైన కాగ్నిటివ్ టెస్ట్ రాసినప్పుడు కాగ్నిటివ్ వీక్నెస్ ఉన్నవారిలో కనుపాప సైజు పెరిగింది. అయితే ఇప్పుడు డెవలప్ చేసిన యాప్ కచ్చితంగా దీనిని గుర్తించి, వ్యాధిని నిర్ధారించగలదా అనేది తెలియాల్సి ఉంది. ఈ యాప్‌ను ఇంటి వద్దే రిజల్ట్స్ పొందేలా రూపొందించారు.

యాప్ ఎలా పనిచేస్తుంది

ఈ యాప్ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల్లో ఉన్న నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగించుకుంటుంది. ఈ యాప్ స్మార్ట్‌ఫోన్ కలర్ సెల్ఫీ కెమెరా సేకరించిన డేటాతో సబ్-మిల్లీమీటర్ కచ్చితత్వంతో కనుపాప సైజులను లేదా వ్యాసాలను సమర్ధవంతంగా క్యాప్చర్ చేయగలదు. ఈ యాప్‌ యూజర్‌-ఫ్రెండ్‌లీగా ఉండేలా సింపుల్ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించారు. ఈ యాప్ ఇప్పటికీ ప్రోటోటైప్‌ దశలోనే ఉంది కాబట్టి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చేలోపు కాస్త సమయం పట్టవచ్చు.

First published:

Tags: 5G Smartphone, Apps, Brain, Diagnosis, Early

ఉత్తమ కథలు