ALPHABETS WING BEGINS MAKING FIRST COMMERCIAL DRONE DELIVERIES IN THE AMERICA NK
డోర్ డెలివరీ ఇక డ్రోన్ డెలివరీ... గూగుల్ కొత్త ప్రాజెక్ట్ గ్రేట్ సక్సెస్...
(credit - twitter - Information Tech)
Google Alphabet's Drone Delivery : కొత్తగా ఏదైనా చెయ్యాలంటే... గూగుల్‌కి సాధ్యమే. డ్రోన్ ద్వారా డోర్ డెలివరీ చెయ్యాలని ప్రయత్నిస్తున్న ఆ కంపెనీ... ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు సాధిస్తోంది.
Google Alphabet's Drone Delivery :మనం ఏ ఫుడ్ ఐటమో, ఎలక్ట్రానిక్ ఐటమో ఆన్లైన్లో ఆర్డరిచ్చామనుకోండి. ఆ ఐటెంని ఓ డ్రోన్ తెచ్చి ఇస్తే ఎలా ఉంటుంది. కొత్తగా, మజాగా ఉంటుంది కదా. ఇలాంటి అదృష్టాన్ని ప్రస్తుతం అమెరికన్లు పొందుతున్నారు. అఫ్కోర్స్ సమీప భవిష్యత్తులో మనమూ పొందగలం. గూగుల్‌కి చెందిన ఆల్ఫాబెట్ విభాగం... ఈ డ్రోన్ డెలివరీ ప్రారంభించింది. తద్వారా... ఆమెరికా ప్రభుత్వ అనుమతి పొంది... అధికారికంగా డ్రోన్ డెలివరీ చేసే ఛాన్స్ ఈ కంపెనీ దక్కించుకుంది. ఈ డ్రోన్ డెలివరీకి "వింగ్" అనే పేరు పెట్టారు. ఈ వింగ్... అక్కడి ఫెడ్ఎక్స్ ఎక్స్‌ప్రెస్, వాల్‌గ్రీన్స్ కంపెనీల వస్తువుల్ని డ్రోన్ ద్వారా డెలివరీ చేస్తోంది. ఈ డ్రోన్... గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఫ్లైట్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తోపాటూ ఆన్ బోర్డ్ సెన్సార్లను కూడా ఉపయోగించి ప్రయాణిస్తుంది. తద్వారా... ఎట్టిపరిస్థితుల్లో తన ప్రయాణానికి ఎలాంటి అడ్డూ లేకుండా చేసుకుంటుంది.
My video interview with Google sister company Alphabet’s Project X’s co-lead on autonomous drone food and supply delivery and me driving eight hours for that burrito...
డెలివరీ అడ్రెస్‌కు చేరుకున్నాక... ఈ డ్రోన్ కిందకు దిగదు. డెలివరీ చెయ్యాల్సిన ఐటెం ఉన్న కవర్‌ను కిందకు తాడుతో వదులుతుంది. అప్పుడు అక్కడి వ్యక్తులు ఆ కవర్లో వస్తువును తీసుకుంటారు. ఆ తర్వాత కవర్ తిరిగి పైకి వెళ్లిపోతుంది. అప్పుడు డ్రోన్ రిటర్న్ జర్నీ మొదలుపెడుతుంది. ఇలా... వేగంగా డోర్ డెలివరీ అయిపోతుందన్నమాట.
ప్రస్తుతానికి వర్జీనియాలోని సుగర్ మంగోలియా ప్రాంత ప్రజలకు చాకొలెట్లు, పేపర్ గుడ్స్ వంటి చిన్న చిన్న ఐటెమ్‌లను డ్రోన్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. ఇందుకోసం వింగ్ సంస్థకు ఎయిర్ క్యారియర్ సర్టిఫికెట్ లభించింది. అంటే... పైలెట్ల అవసరం లేకుండా... ఒకేసారి ఎక్కువ డ్రోన్లను ఉపయోగించి, డోర్ డెలివరీ చెయ్యవచ్చన్నమాట. ప్రస్తుతం ఈ సర్వీస్ చాలా బాగుందని అంటున్నారు కస్టమర్లు. అంటే త్వరలో అన్నీ డ్రోన్ల ద్వారానే డెలివరీ చేసేస్తారన్నమాట.
#ICYMI Very excited that Queensland will become one of the first places in the world to have autonomous #drone deliveries when global tech giant Alphabet introduces its @Wing service to Logan later this year. Read more https://t.co/GKCZVKBLQbpic.twitter.com/HoMFQ9oOWp
ఇలాంటి సర్వీసులు మన దగ్గర రావాలంటే... టెక్నాలజీ పరంగా మనం మరింత అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇంటర్నెట్ సర్వీసులు బాగా పెరగాలి. సిగ్నలింగ్ వ్యవస్థలు ఎక్కడా కట్ అవ్వకుండా రావాలి. మనమూ డెవలప్ అవుతున్నాంగా... ఫ్యూచర్లో మనమూ డోర్ (డ్రోన్) డెలివరీ చేయించుకుందాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.