హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: రోజువారీ అవసరాల కోసం ఆల్ఫాబెట్‌ కంపెనీలో 100 రోబోలు.. ఒక్క రోజులో వివిధ పనులు చేసే సామర్థ్యం

Google: రోజువారీ అవసరాల కోసం ఆల్ఫాబెట్‌ కంపెనీలో 100 రోబోలు.. ఒక్క రోజులో వివిధ పనులు చేసే సామర్థ్యం

ఎవ్రీడే రోబోలను ప్రవేశపెట్టిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (File Image)

ఎవ్రీడే రోబోలను ప్రవేశపెట్టిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ (File Image)

Google: దైనందిన కార్యకలాపాల కోసం రోబోల వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో వీటి వాడకం మరింత పెరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2017లో కాలిఫోర్నియాకు చెందిన ఆల్ఫాబెట్ కంపెనీ మనుషులు చేసే రోజువారీ పనుల కోసం 'ఎవ్రిడే రోబోట్స్' అనే మిషన్ కు శ్రీకారం చుట్టింది.

ఇంకా చదవండి ...

దైనందిన కార్యకలాపాల కోసం రోబోల (Robot)  వినియోగం ఇప్పటికే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో వీటి వాడకం మరింత పెరిగే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే 2017లో కాలిఫోర్నియాకు చెందిన ఆల్ఫాబెట్ కంపెనీ (Alphabet) మనుషులు చేసే రోజువారీ పనుల కోసం 'ఎవ్రిడే రోబోట్స్' అనే మిషన్ కు శ్రీకారం చుట్టింది. నిర్దిష్టమైన పనులు చేసేందుకు ప్రోగ్రామ్ కోడ్ రూపొందించి దాని ఆధారంగా రోబోలను తయారు చేస్తున్నారు. గూగుల్ (Google) మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి చెందిన 'X ది మూన్ ఫ్యాక్టరీ' వీటిని అభివృద్ధి చేస్తోంది. ఇటీవలే ఆల్ఫాబెట్ సంస్థ 100 ఎవ్రిడే రోబోలను లాంచ్ చేసింది. ఇవి కాఫీ షాపుల్లో(Cafeteria) టేబుళ్లను శుభ్రం చేయడం, డోర్లు ఓపెన్ చేయడం లాంటి సులభమైన అనేక రకాల పనులను చేస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

* స్వయంగా నేర్చుకునే సామర్థ్యం..

రోబోలు నిర్దిష్ట వాతావరణంలో ఒకే ఒక్క పనిని మాత్రమే చేయగలుగుతాయనే సెంటిమెంటును బ్రేక్ చేస్తూ తమ సమీపంలోని కారకాలకు అనుగుణంగా వివిధ రకాల కార్యాలు చేస్తాయని సదరు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా స్వయంగా అవే నేర్చుకోగల సామర్థ్యాన్ని, వాతావరణానికి అనుగుణంగా మార్చుకునే వెసులుబాటును ఈ రోబోల్లో ప్రవేశపెట్టామని పేర్కొంది. ప్రతిరోజూ మానవ వాతావరణంలో సురక్షితంగా పనిచేయగలవని, అవరోధాలను ఎదుర్కొంటూ పనిచేస్తాయని తెలిపింది.

Redmi Note 11T 5G: నవంబర్​ 30న రెడ్​మీ నోట్​ 11 టీ 5జీ స్మార్ట్​ఫోన్​​ లాంచ్​.. అత్యంత వేగవంతమైన 5జీ స్మార్ట్​ఫోన్​


 ఈ రోబోలకు మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, సహకార అభ్యాస పద్ధతులు, రీఎన్ఫోర్స్‌మెంట్ లెర్నింగ్ లాంటి విధానాలను పొందుపరిచారని ఆల్ఫాబెట్ పేర్కొంది. వివిధ రకాల టాస్క్ లు నిర్వహించడానికి, వర్చువల్ ప్రపంచంలో సంపాదించిన మేధస్సును వాస్తవ ప్రపంచానికి బదిలీచేసేందుకు విస్తృతమైన సెన్సార్లను ఉపయోగించినట్లు స్పష్టం చేసింది.


* ఒక్క రోజులో వివిధ రకాల పనులు..

ఈ ఎవ్రిడే రోబోలకు కింద భాగంలో పెద్ద వీల్ బేస్, పైభాగంలో అనేక కెమెరాలను అనుసంధానించారు. లైట్ డిటెక్షన్, రేంజింగ్ సెన్సార్ ఉపయోగించి ఇవి తమ పరిసరాలను గ్రహిస్తాయి. దీన్నే స్పిన్నింగ్ లిడార్ సెన్సార్ అని అంటారు. ఇది వస్తువులను ఎంచుకునే లేజర్లను విడుదల చేసి తిరిగి రోబోకు చేరవేస్తుంది. అంతేకాకుండా చుట్టూ ఉన్న పరిసరాల లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. మూన్ షాట్ ఫ్యాక్టరీ ప్రకారం ఈ రోబోలు ఒక్క రోజులో డోర్ తెరవడం లాంటి క్లిష్టమైన పనులను కూడా నేర్చుకోగలవని స్పష్టం చేసింది. ఇందుకోసం ముందుగా ప్రొగ్రామ్ చేయడానికి నాలుగు నెలలు పట్టిందని పేర్కొంది.

Vivo Y74s: వివో నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు


 * రోబోలు, మానవులు కలిసి పనిచేసేలా..

రోబో వీల్ బేస్ పైభాగంలో 'గ్రిప్పర్' అని పిలేచే హస్తాన్ని(Arm)ని కలిగి ఉంటుంది. ఇది మల్టీపర్పస్ అటాచ్మెంట్. అంటే పలు రకాల పనుల కోసం వినియోగించవచ్చు. నివేదిక ప్రకారం ఈ రోబోలు ప్రస్తుతం చెత్తను క్రమబద్దీకరించడం, కాన్ఫరెన్స్ గది లోపల, వెలుపల కుర్చీలను తరలించడం, తలుపులను తెరవడం, కాఫీ టేబుళ్లను శుభ్రం చేయడం లాంటి అనేక రకాల పనులు చేయగలవని పేర్కొంది. రోబోలు, మానవులు కలిసి క్లోజ్డ్ వాతావరణంలో సామరస్యంగా పనిచేసే భవిష్యత్తును నిర్మించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. వృద్ధులకు సహాయం అందించడం ఈ సంస్థ దీర్ఘకాలిక ప్రణాళిక

Published by:John Kora
First published:

Tags: Google, Robot

ఉత్తమ కథలు