Home /News /technology /

ALMOST 80 PERCENT INDIANS CONSIDER MOVING FROM WHATSAPP TO TELEGRAM SIGNAL OVER NEW PRIVACY POLICY NS

WhatsAppను భారీగా దెబ్బకొడుతున్న ప్రైవసీ పాలసీ.. ఈ యాప్ కు ఎంత మంది షాక్ ఇవ్వనున్నారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్.. నేడు ఈ మేసేజింగ్ యాప్ అంటే తెలియని వారు చాలా చాలా తక్కువ. అంతలా పాపులర్ అయ్యింది వాట్సాప్. అయితే ఇటీవల వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ దాన్ని బాగా దెబ్బకొట్టింది.

    వాట్సాప్.. నేడు ఈ మేసేజింగ్ యాప్ అంటే తెలియని వారు చాలా చాలా తక్కువ. అంతలా పాపులర్ అయ్యింది వాట్సాప్. అయితే ఇటీవల వాట్సాప్ తీసుకువచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ దాన్ని బాగా దెబ్బకొట్టింది. దీంతో యూజర్లు ఈ యాప్ ను వదిలి టెలిగ్రామ్, సిగ్నల్స్ వంటి యాప్ ల వైపు వెళ్తున్నారు. సైబర్ మీడియా రీసెర్చ్ స్టడీ ప్రకారం.. భారత దేశంలోని మొదటి ఎనిమిది టాప్ సిటీలైన ఢిల్లీ, ముంబాయి, కోల్ కత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్ మరియూ పూణే ప్రాంతాల్లోని 79 శాతం మంది వాట్సాప్ వినియోగదారులు ఈ యాప్ ను వాడాలా వద్దా అని ఆలోచిస్తున్నట్లు తేలింది. మరో 28 శాతం మంది మాత్రం వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అమలులోకి వచ్చిన వెంటనే యాప్ ను తొలగించాలని భావిస్తున్నట్లు తెలింది. వాట్సాప్ వద్దనుకున్న వారిలో 41 శాతం మంది టెలిగ్రామ్ వైపు వెళ్లాలనుకుంటున్నట్లు తేలింది.

    దీంతో టెలిగ్రామ్ కు వాట్సాప్ న్యూ పాలసీ బాగా కలిసివస్తోంది. వాట్సాప్ వద్దనుకుంటున్న మరో 35 శాతం మంది యూజర్లు సిగ్నల్ కు మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ చాట్ బ్యాక్ అప్ గూగుల్ డ్రైవ్ లేదా ఐ క్లౌడ్ లో సేవ్ అవుతుంది. అయితే ఇలా థార్డ్ పార్టీ ఫ్లాట్ ఫామ్ లతో తమ డేటా సేవ్ చేయడంపై కొంత మంది యూజర్లు అసంతృప్తితో ఉన్నటారు. టెలిగ్రామ్ కు సొంత బ్యాక్ అప్ వ్యవస్థ ఉంది. దీంతో అనేక మంది యూజర్లు టెలిగ్రామ్ వైపునకు మొగ్గు చూపుతున్నారు.

    ఈ నేపథ్యంలో ఈ జనవరిలో ప్లేస్టోర్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్‌ అయిన యాప్‌గా టెలిగ్రామ్‌ రికార్డు సృష్టించింది. ఐస్టోర్‌లో టెలిగ్రామ్‌ యాప్‌ ప్రస్తుతం నాలుగో స్థానానికి చేరింది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టెలిగ్రామ్‌ డౌన్‌లోడ్స్‌ 63 మిలియన్లు దాటాయని సెన్సార్‌ టవర్‌ తన నివేదికలో వెల్లడించడం విషేషం. గతేడాది జనవరితో పోలిస్తే టెలిగ్రామ్‌ యాప్ డౌన్‌లోడ్‌లు ఈ జనవరిలో 3.8 రెట్లు పెరిగాయి. టెలిగ్రామ్‌ మొత్తం డౌన్‌లోడ్స్‌లో 24 శాతం భారత్‌ ఉంటుండడాన్ని పరిశీలిస్తే మన దేశంలో ఆ యాప్ కు ఎంతగా పాపులారిటీ వస్తుందో అర్థం చేసుకోవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Telegram, Whatsapp

    తదుపరి వార్తలు