హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Apple’s Far Out Event: గెట్ రెడీ.. రేపే యాపిల్ లాంచ్ ఈవెంట్‌.. ఐఫోన్ 14 సిరీస్‌‌తో పాటు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ ఇవే..

Apple’s Far Out Event: గెట్ రెడీ.. రేపే యాపిల్ లాంచ్ ఈవెంట్‌.. ఐఫోన్ 14 సిరీస్‌‌తో పాటు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ ఇవే..

Apple’s Far Out Event

Apple’s Far Out Event

Apple’s Far Out Event: యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 7న ‘ఫార్ అవుట్’ పేరుతో లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, ఎయిర్ పోడ్స్ ప్రో 2 వంటి ప్రొడక్ట్స్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆ ప్రొడక్ట్స్, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచుస్తున్న యాపిల్ ‘ఫార్ అవుట్’ ఈవెంట్‌ (Apple’s Far Out Event) మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ కంపెనీ (Apple Company) వినూత్న ప్రొడక్ట్స్ రిలీజ్ చేయడానికి ఒక లాంచింగ్ ఈవెంట్‌ నిర్వహిస్తుంది. అయితే ఈసారి సెప్టెంబర్ 7వ తేదీన ‘ఫార్ అవుట్’ పేరుతో ఈ ఈవెంట్‌ను సంస్థ నిర్వహించనుంది. ఈ మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 14 (iPhone 14) సిరీస్‌తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, ఎయిర్ పోడ్స్ ప్రో 2 వంటి ప్రొడక్ట్స్‌ను యాపిల్ లాంచ్ చేయనుంది. ఆ ప్రొడక్ట్స్, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

* యాపిల్ వాచ్ సిరీస్ 8

టెక్ దిగ్గజం యాపిల్ ప్రతి ఏటా ఐఫోన్‌లతో పాటు వాచ్‌ను కూడా లాంచ్ చేస్తుంది. వాచ్‌ 7 సిరీస్‌ డిజైన్‌తో పోలిస్తే వాచ్ సిరీస్ 8 కొత్త డిజైన్‌తో వస్తున్నట్లు సమాచారం. ఇందులో 2 అంగుళాల డయాగ్నల్‌ స్క్రీన్‌ ఉంటుంది. ఎస్‌8 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. టెంపరేచర్‌ సెన్సార్, ఫ్రెర్టిలిటీ ట్రాకింగ్, కారు క్రాష్‌ డిటెక్షన్‌ వంటి ఫీచర్స్‌ ఇందులో ఉన్నట్లు సమాచారం.

* యాపిల్ ఐఫోన్ 14 సిరీస్

సెప్టెంబర్ 7న లాంచ్ కానున్న ఐఫోన్ 14 సిరీస్ నాలుగు వెరియంట్లలో లభ్యం కానుంది. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ హై ఎండ్ రేంజ్‌కు సంబంధించినవి. ఈ రెండు వేరియంట్లు పంచ్ హోల్ వంటి కొత్త డిజైన్‌తో వస్తున్నాయి. ఐఫోన్ 14 సిరీస్‌లో కొత్తగా పర్పుల్‌ షేడ్‌తో న్యూ కలర్ ఆప్షన్‌ను పరిచయం చేస్తున్నారు.

ఈ మోడల్స్‌‌ను స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ ఫ్రేమ్‌లకు బదులు టైటానియమ్‌ ఫ్రేమ్‌లతో డిజైన్‌ చేశారు. ప్రో మోడల్స్‌లో వెనుకవైపు 8K రికార్డింగ్‌ ఫీచర్‌తో 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ కెమెరాలను ఇస్తున్నారు. ముందుభాగంలో 12 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇతర వేరియంట్లలో 8K రికార్డింగ్‌ క్వాలిటీ‌తో కెమెరా సెటప్ ఉండనున్నట్లు సమాచారం.

ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్14 ప్రో మ్యాక్స్ వేరియంట్లలో కొత్త A16 బయోనిక్ చిప్‌ని వినియోగించారు. శాటిలైట్ కనెక్టివిటీ కోసం స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌65 5జీ మోడెమ్‌ను వినియోగించినట్లు సమాచారం. ఐఫోన్‌ 14, 14 ప్రో మోడల్స్‌ 6.1 అంగుళాలు, ఐఫోన్‌ 14 మాక్స్‌, 14 ప్రో మాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేతో లాంచ్ కానున్నాయి. ఇక ఫేస్‌ఐడీ ఫీచర్‌ను ఐఫోన్‌ 14 సిరీస్‌లోని అన్ని వేరియంట్లలో వినియోగించినట్లు సమచారం.

ఐఫోన్ 14 ప్రోలో 3,200 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫోన్ 14లో 3,279 ఎంఏహెచ్‌, ఐఫోన్‌ 14 ప్రో మాక్స్‌లో 4,323 ఎంఏహెచ్‌, ఐఫోన్ 14 మాక్స్‌లో 4,325 ఎంఏహెచ్ బ్యాటరీ వినియోగించినట్లు సమాచారం. ఐఫోన్‌ 14 సిరీస్‌ ప్రారంభ ధర 799 డాలర్లు, భారత కరెన్సీలో సుమారు ₹ 63,500. ఇక ప్రో మోడల్స్‌ ప్రారంభ ధర 1,099 డాలర్లు కాగా, భారత కరెన్సీలో సుమారు ₹87,400 ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : కొత్త ప్రాసెసర్, 6GB ర్యామ్, 50MP కెమెరాతో పోకో ఎం5 వచ్చేసింది... ఆఫర్ ధర, ఫీచర్స్ వివరాలివే

* 10వ తరం యాపిల్ ఐప్యాడ్

తాజా లాంచ్ ఈవెంట్‌లో కొత్త ఐప్యాడ్ గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. 10వ తరం (10th generation) ఐప్యాడ్ ప్రస్తుత 10.2 అంగుళాల స్క్రీన్ సైజు కంటే పెద్ద డిస్‌ప్లేతో రావచ్చు. కొత్త ఐప్యాడ్ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో మోడళ్లలో వచ్చిన సన్నని బెజెల్స్‌ డిజైన్‌తో రావచ్చు. టచ్ ఐడీ పవర్ బటన్‌లో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఇది A14 బయోనిక్ చిప్‌తో రావచ్చు.

* ఎయిర్‌పాడ్స్ ప్రో 2

యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో‌ను కూడా ఈ ఈవెంట్‌లో లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. డిజైన్ విషయంలో ఫస్ట్ జనరేషన్ తరహాలోనే ఉండొచ్చు. అయితే అప్‌గ్రేడ్ చేసిన చిప్‌తో లాంచ్ కావచ్చు. ఇది మెరుగైన ఆడియో క్వాలిటీని అందిస్తుంది.

* ఈవెంట్ లైవ్ ఎప్పుడు?

యాపిల్ ఫార్ ఔట్ ఈవెంట్ సెప్టెంబర్ 7న భారత కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా, కరోనా కారణంగా గత మూడేళ్లుగా వర్చువల్‌గా లాంచ్ ఈవెంట్లను నిర్వహించిన యాపిల్.. ఈసారి ఫార్ అవుట్ ఈవెంట్‌ను జనాల మధ్యే నిర్వహించనుంది. యాపిల్‌కు చెందిన యూట్యూబ్‌‌ ఛానెల్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఈ ప్రోగ్రామ్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Iphone 14, Tech news

ఉత్తమ కథలు