Odysse e-bike: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్‌కి పెరుగుతున్న ఆదరణను సద్వినియోగం చేసుకోవడానికి కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో ఒకటైన ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (Odysse Electric Vehicles) సంస్థ అడ్వాన్స్‌డ్ స్కూటర్లు, బైకుల లాంచ్‌లతో బాగా పాపులర్ అవుతోంది. ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారు తాజాగా మరో అదిరిపోయే ఆల్-ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. రూ.1.10 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్, అహ్మదాబాద్)తో వేడర్ (Odysse VADER) ఈవీని లాంచ్ చేసింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఒడిస్సీ VADER ఏకంగా 7-అంగుళాల డిస్‌ప్లేతో వస్తోంది. ఈ మోటార్‌సైకిల్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు ఎన్నో ఉన్నాయి.
కంపెనీ VADER ఎలక్ట్రిక్ మోటార్‌బైక్ బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ రెండింటికీ 3 సంవత్సరాల వారంటీని ఆఫర్ చేస్తోంది. కస్టమర్లు రూ.999 చెల్లించి దీనిని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే కంపెనీకి చెందిన 68 అవుట్‌లెట్‌లలో దేని ద్వారానైనా బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. ఒడిస్సీ VADER బైక్ డెలివరీలు జులై నుంచి ప్రారంభమవుతాయి. FAME-II పథకం కింద VADER బైక్‌పై సబ్సిడీలు అందుకోవచ్చు. ఈ మోటార్‌సైకిల్ మిడ్‌నైట్ బ్లూ, ఫైరీ రెడ్, గ్లోసీ బ్లాక్, వెనమ్ గ్రీన్, మిస్టీ గ్రే అనే ఐదు రంగులలో లభిస్తుంది. ఇందులో 18-లీటర్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
ఒడిస్సీ VADER ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 3kW మోటార్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 4.50kW వరకు పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే ఈ బైక్ 3.7 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ చాలా సురక్షితమైనదని కంపెనీ చెబుతోంది. IP67 రేటింగ్ గల ఈ బ్యాటరీ నీరు, ధూళిని తట్టుకోగలదు. ఇది AIS-156 నుంచి ఆమోదం కూడా పొందింది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. ఇది డైలీ రైడ్స్‌కి అనుకూలంగా ఉంటుంది. VADER గరిష్ఠంగా 85kmph వేగంతో వెళ్లగలదు. దీనిలో ఫార్వర్డ్, రివర్స్, పార్కింగ్ అనే మూడు రైడ్ మోడ్స్ ఉంటాయి.
టాటా నుంచి స్టైలిష్ బడ్జెట్ కారు.. అదిరిపోయే హ్యాచ్‌బ్యాక్ డిజైన్.. ధర, ఫీచర్స్ ఇవే!
ఈ బైక్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఆఫర్ చేసిన 7 అంగుళాల డిస్‌ప్లేను యాప్, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ బైక్ ఎకో మోడ్‌లో 125 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన ఒడిస్సీ EV ఆండ్రాయిడ్ యాప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో బైక్ లొకేటర్, యాంటీ-థెఫ్ట్, జియో ఫెన్స్, ఇమ్మొబిలైజేషన్, ట్రాక్ & ట్రేస్, లో బ్యాటరీ అలర్ట్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. VADER బరువు 128 కిలోలు. ఇది కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ (CBS)తో రైడర్ సేఫ్టీకి పెద్దపీట వేస్తుంది. ముందు 240mm, వెనుక 220mm డిస్క్‌బ్రేక్స్ ఉంటాయి. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, OTA అప్‌డేట్, బ్లూటూత్ కనెక్టివిటీ, LED లైటింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ లాంటి మరిన్ని ఫీచర్లు కూడా దీనిలో అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric bike