Home /News /technology /

Smartphones Radiation: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అలర్ట్.. అత్యధికం, అత్యల్పంగా రేడియేషన్ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌ లు ఇవే..

Smartphones Radiation: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అలర్ట్.. అత్యధికం, అత్యల్పంగా రేడియేషన్ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌ లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సెల్‌ఫోన్(cell phone) ద్వారా వెలువడే రేడియేషన్(Radiation) మానవ ఆరోగ్యం(Health)పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అనేక పరిశోధనలు నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో అత్యధిక, అత్యల్ప రేడియేషన్ విడుదల చేసే ఫోన్ల జాబితా.

    ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఒక ముఖ్యమైన వనరుగా మారింది. చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లతో, మనం ప్రపంచంలోని దాదాపు ఏ మూలకు అయినా కనెక్ట్ అయ్యే అవకాశం ఏర్పడింది. బ్యాంకింగ్(Banking), ఎడ్యుకేషన్(Education) మరియు ఆరోగ్యాన్ని(Health) ట్రాక్ చేయగల అనేక యాప్‌లతో ట్రాకర్ ఇప్పుడు ఫింగర్ టిప్స్ పైకి అందుబాటులోకి వచ్చాయి. అయితే.. నేటి ప్రపంచం స్మార్ట్‌ఫోన్‌ల ఉచ్చులో పడిపోతోంది. క్యాన్సర్ (Cancer) వంటి ప్రాణాంతక వ్యాధులకు మీరు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ కూడా కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సెల్‌ఫోన్ నుండి వచ్చే రేడియేషన్లు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అనేక పరిశోధనలు నిర్ధారించాయి. జర్మన్ ఫెడరల్ ఆఫీస్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్(The German Federal Office for Radiation Protection) కొత్త స్మార్ట్‌ఫోన్‌లపై సమగ్ర డేటాను అధ్యాయనం చేసింది.

    అధిక మరియు తక్కువ రేడియేషన్ ఉద్గారాలు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను వెల్లడించింది. ఈ వివరాలను Specific absorption rate (SAR) విలువను అందించడం ద్వారా గుర్తించవచ్చు. SAR అంటే శరీరానికి RF (రేడియో ఫ్రీక్వెన్సీ) శక్తి యొక్క శోషణ రేటు యొక్క కొలత. ఎక్కువ మరియు తక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
    Lava Agni 5G: మేడ్ ఇన్ ఇండియా 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన లావా మొబైల్స్

    ఎక్కువ రేడియేషన్‌ను విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌లు (టాప్ 5 నుంచి 1 వరకు)..

    - HTC U12 Life స్మార్ట్ ఫోన్ అత్యధికంగా SAR విలువ 1.48 ను కలిగి ఉంది

    -దీని తర్వాత OnePlus 6T స్మార్ట్ ఫోన్ SAR విలువ 1.55ను కలిగి ఉంది.

    -మూడవ స్థానంలో Xiomi Mi A1 (Xiaomi Mi A1) నిలిచింది. ఈ ఫోన్ SAR విలువ 1.58.

    -OnePlus 5T రెండవ స్థానంలో ఉంది. దీని SAR విలువ 1.68.

    -షియోమి Mi Max 3 (Xiaomi Mi Max 3) SAR విలువ 1.75తో అగ్రస్థానంలో ఉంది.
    Amazon బంపరాఫర్.. కేవలం రూ. 6,999కే LED TV.. వివరాలివే..

    తక్కువ రేడియేషన్ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్‌ల జాబితా(టాప్ 5 నుంచి నంబర్ వన్ వరకు)..

    -Samsung Galaxy S8 + పరికరం SAR విలువ 0.26తో ఐదవ స్థానంలో ఉంది.

    -నాల్గవ స్థానంలో Samsung Galaxy A8 ఉంది. దీని SAR విలువ 0.24తో ఉంది.

    -జాబితాలో మూడవ స్థానంలో LG G7 దీని SAR విలువ 0.24.

    -ZTE Axon Elite SAR విలువ 0.17తో తక్కువ-ఉద్గార పరికరాల జాబితాలో రెండవ స్థానంలో ఉంది.

    -జాబితాలో అగ్రస్థానంలో Samsung Galaxy Note 8 నిలిచింది. దీని SAR విలువ 0.17.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Germany, Smartphone

    తదుపరి వార్తలు