హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి

Android Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి

గూగుల్ ప్లేస్టోర్ ఈ ఏడాది 36 మొబైల్ యాప్స్‌ను తొలగించింది. ప్లేస్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, మాల్‌వేర్ (ముఖ్యంగా జోకర్ మాల్‌వేర్) ఎటాక్ అవుతున్నందుకు వాటిని తొలగించింది.

గూగుల్ ప్లేస్టోర్ ఈ ఏడాది 36 మొబైల్ యాప్స్‌ను తొలగించింది. ప్లేస్టోర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, మాల్‌వేర్ (ముఖ్యంగా జోకర్ మాల్‌వేర్) ఎటాక్ అవుతున్నందుకు వాటిని తొలగించింది.

Android Apps | గూగుల్ ప్లేస్టోర్‌లో జోకర్ మాల్‌వేర్ ఉన్న మరో 17 యాప్స్ జాబితాను బయటపెట్టింది సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థ. మీరు ఆ యాప్స్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే డిలిట్ చేయండి.

స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవారికి హెచ్చరిక. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మీకు నచ్చిన యాప్స్ డౌన్‌లోడ్ చేసి ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త. గూగుల్ ప్లే స్టోర్‌లో హానికరమైన యాప్స్ చాలా ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ప్లేస్టోర్ నుంచి గూగుల్ తొలగిస్తోంది. గూగుల్ మాత్రమే కాదు ఇతర సెక్యూరిటీ రీసెర్చ్ సంస్థలు, పరిశోధకులు కూడా ఎప్పటికప్పుడు ప్లేస్టోర్‌లోని హానికరమైన యాప్స్ గుర్తించి గూగుల్‍ను అప్రమత్తం చేస్తుండటం మామూలే. ఇప్పుడు Zscaler సెక్యూరిటీ సంస్థ జోకర్ మాల్‌వేర్ ఉన్న 17 ఆండ్రాయిడ్ అప్లికేషన్స్‌ని గుర్తించింది. గూగుల్‌ను అప్రమత్తం చేసింది. ఈ మాల్‌వేర్ ఎస్ఎంఎస్ మెసేజెస్, కాంటాక్ట్ లిస్ట్, డివైజ్ సమాచారాన్ని కాజేస్తున్నట్టు తేలింది. ఆ వివరాలతో ప్రీమియం వైర్‌లెస్ అప్లికేషన్ ప్రోటోకాల్ సేవలకు లాగిన్ చేస్తున్నట్టు Zscaler సెక్యూరిటీ రీసెర్చర్ వైరల్ గాంధీ తెలిపారు. ఈ 17 హానికరమైన యాప్స్‌ని ఈ నెలలోనే ప్లేస్టోర్‌లో అప్‌లోడ్ చేసినట్టు బయటపడింది. ఇప్పటికే 1,20,000 సార్లు డౌన్‌లోడ్ చేయడం విశేషం. ఆ 17 యాప్స్ జాబితా ఇదే.

Flipkart Big Billion Days Sale: బీ రెడీ... భారీ ఆఫర్స్‌తో ఈ ఏడాదిలోనే అతిపెద్ద సేల్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్

Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 సేల్... ఆఫర్స్ ఇవే

All Good PDF Scanner

Mint Leaf Message-Your Private Message

Unique Keyboard - Fancy Fonts & Free Emoticons

Tangram App Lock

Direct Messenger

Private SMS

One Sentence Translator - Multifunctional Translator

Style Photo Collage

Meticulous Scanner

Desire Translate

Talent Photo Editor - Blur focus

Care Message

Part Message

Paper Doc Scanner

Blue Scanner

Hummingbird PDF Converter - Photo to PDF

All Good PDF Scanner

ఈ 17 యాప్స్‌ని గూగుల్ ఇప్పటికే ప్లేస్టోర్ నుంచి తొలగించింది. అయితే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ 17 యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసినట్టైతే వాటిని ఉపయోగించే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఈ యాప్స్ ఉపయోగించకూడదని, వాటిని వెంటనే వాటిని డిలిట్ చేయాలని సెక్యూరిటీ రీసెర్చర్స్ కోరుతున్నారు. ఇవి ఉపయోగించడం ప్రమాదకరన్న విషయం గుర్తుంచుకోవాలి.

JioPostpaid Plus: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీగా కావాలా? ఈ ప్లాన్స్ మీకోసమే

Non-Chinese Smartphones: రూ.10,000 లోపు రిలీజైన 5 నాన్ చైనీస్ స్మార్ట్‌ఫోన్లు ఇవే

జోకర్ మాల్‌వేర్ గూగుల్ ప్లేస్టోర్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మాల్‌వేర్‌తో ఉన్న యాప్స్ డేంజరస్ కావడంతో యూజర్లకు నష్టం తప్పట్లేదు. రెండు నెలల క్రితం జోకర్ మాల్‌వేర్ ఉన్న 11 యాప్స్‌ని తొలగించింది గూగుల్. ఇటీవల మరో 6 యాప్స్‌ని రీసెర్చర్స్ గుర్తించడంతో వాటిని కూడా ప్లేస్టోర్ నుంచి డిలిట్ చేసింది. ఇప్పుడే కాదు... గతంలో కూడా జోకర్ మాల్‌వేర్‌తో ఉన్న 24 యాప్స్ తొలగించింది. ఇప్పుడు జోకర్ మాల్‌వేర్ ఉన్న మరో 17 యాప్స్ లిస్ట్ బయటపడింది. వీటిని కూడా తొలగించింది గూగుల్.

First published:

Tags: Android, Android 10, Google, Mobile App, Playstore

ఉత్తమ కథలు