'వాట్సప్ గోల్డ్' మెసేజ్ వచ్చిందా? ఓపెన్ చేస్తే అంతే...

స్మార్ట్‌ఫోన్ యూజర్లలో వాట్సప్‌ యాప్ అంటే విపరీతమైన క్రేజ్. అయితే ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు అతి తెలివి చూపిస్తున్నారు. వాట్సప్ పేరుతో ఫేక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చిందని, ఈ లింక్ క్లిక్ చేసి ఇన్‌‌స్టాల్ చేసుకుంటే మీ యాప్ గోల్డ్ కలర్‌లోకి మారిపోతుందని చెప్పి ట్రాప్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 9, 2019, 5:19 PM IST
'వాట్సప్ గోల్డ్' మెసేజ్ వచ్చిందా? ఓపెన్ చేస్తే అంతే...
'వాట్సప్ గోల్డ్' ఇన్‌స్టాల్ చేశారా? అది భయంకరమైన వైరస్
  • Share this:
'వాట్సప్ గోల్డ్'... ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ పేరుతో ఓ మెసేజ్ విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. ఈ లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్‌స్టాల్ చేస్తే మీ వాట్సప్... గోల్డ్ కలర్‌లోకి మారిపోతుందన్నది ఆ మెసేజ్ సారాంశం. అదే నిజమనుకొని చాలామంది ఇన్‌స్టాల్ చేశారు. తమ వాట్సప్ గోల్డ్ కలర్‌లోకి మారిందని మురిసిపోతున్నారు. కానీ అది నిజమైన యాప్ కాదు. భయంకరమైన వైరస్. అది ఇన్‌‌స్టాల్ చేశారంటే అడ్డంగా బుక్కైపోయినట్టే.

అసలు ఏంటి 'వాట్సప్ గోల్డ్'?

స్మార్ట్‌ఫోన్ యూజర్లలో వాట్సప్‌ యాప్ అంటే విపరీతమైన క్రేజ్. అయితే ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు అతి తెలివి చూపిస్తున్నారు. వాట్సప్ పేరుతో ఫేక్ యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొచ్చిందని, ఈ లింక్ క్లిక్ చేసి ఇన్‌‌స్టాల్ చేసుకుంటే మీ యాప్ గోల్డ్ కలర్‌లోకి మారిపోతుందని చెప్పి ట్రాప్ చేస్తున్నారు. అది నిజంగా వాట్సప్ రూపొందించిన కొత్త యాప్ అని నమ్మేస్తున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు... ఆ లింక్ క్లిక్ చేసి కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. మోసగాళ్ల ట్రాప్‌లో పడుతున్నారు. ఇలా 'వాట్సప్ గోల్డ్' పేరుతో మెసేజ్ సర్క్యులేట్ అవడం ఇప్పుడే కొత్త కాదు. 2016లోనూ ఇలాంటి మెసేజ్‌లు వైరల్ అయ్యాయి. అప్పుడూ ఇలాగే చాలామంది 'వాట్సప్ గోల్డ్' ఇన్‌స్టాల్ చేసుకొని చిక్కుల్లో పడ్డారు.

'వాట్సప్ గోల్డ్' మెసేజ్ వస్తే మీరేం చేయాలి?
'వాట్సప్ గోల్డ్' అనేది ఒరిజినల్ యాప్ కాదు. అది మాల్‌వేర్. ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకుంటే ఆ వైరస్ మీ ఫోన్‌లోకి వెళ్తుంది. మీ డేటా మొత్తాన్ని కాజేస్తుంది. మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు సమాచారమంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. అందుకే మీకు 'వాట్సప్ గోల్డ్' లింక్ వస్తే క్లిక్ చేయకపోవడమే మంచిది. అంతే కాదు... మీకు ఫార్వర్డ్ చేసినవాళ్లను కూడా అప్రమత్తం చేయండి. అప్‌డేట్స్ ఏవైనా వాట్సప్ నేరుగా యాప్ స్టోర్ నుంచి చేస్తుంది తప్ప ఇలాంటి లింక్స్ పంపించదన్న విషయం గుర్తుంచుకోండి. 'వాట్సప్ గోల్డ్' అనే కాదు... ఇలాంటి అనుమానాస్పద లింక్స్ ఏవి వచ్చినా క్లిక్ చేయకూడదు. మీ ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్ ఉపయోగించడం మంచిది.

ఇవి కూడా చదవండి:

క్రెడిట్ కార్డ్ లిమిట్ మరీ ఎక్కువగా వాడేస్తున్నారా? అయితే రిస్కేALERT: ఎస్‌బీఐ విత్‌డ్రా, డిపాజిట్ రూల్స్ మారాయి తెలుసా?

వాట్సప్‌లో స్టేటస్ వాడుతున్నవారికి బ్యాడ్ న్యూస్

స్మార్ట్‌ఫోన్ వ్యసనాన్ని తగ్గించుకోవడానికి 5 టిప్స్

షాక్... మీరు యాప్ వాడకున్నా ట్రాక్ చేస్తున్న ఫేస్‌బుక్

సిమ్ కార్డుతో మీ అకౌంట్ ఖాళీ... జాగ్రత్తలు తెలుసుకోండి

 
First published: January 9, 2019, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading