మీరు జొమాటో (Zomato) కస్టమరా? రోజూ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? స్విగ్గీలో (Swiggy) మీకు నచ్చిన ఫుడ్ తెప్పించుకుంటున్నారా? అయితే అలర్ట్. ఫుడ్ టెక్ దిగ్గజాలైన జొమాటో, స్విగ్గీ కొత్త సమస్యను ఎదుర్కొంటున్నాయి. పలు కారణాలతో డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌ల (Delivery Executive) కొరత ఏర్పడుతోంది. దీంతో ఫుడ్ డెలివరీ సేవల్లో ఇబ్బంది తప్పట్లేదు. బెంగళూరుకు చెందిన స్విగ్గీ ఇప్పటికే ప్రధాన మెట్రో నగరాల్లో తన రోజువారీ నిత్యావసర వస్తువులు, కిరాణా సేవలను అందించే సూపర్ డెయిలీని నిలిపివేసే ఆలోచనలో ఉంది. మరోవైపు తాత్కాలికంగా దాని జీనీ సేవల్ని నిలిపివేసింది. డెలివరీ ఎగ్జిక్యూటివ్ కొరత కారణంగా అనేక ప్రాంతాలలో సేవ ఆలస్యం అవుతోంది.
ఈ పరిస్థితి కస్టమర్ల ఆర్డర్ల సంఖ్యను దెబ్బతీసే అవకాశం ఉంది. అదే జరిగితే వ్యాపారం కూడా దెబ్బతింటుంది. CNBC TV18 రిపోర్ట్ ప్రకారం స్విగ్గీ, జొమాటోలో క్విక్ కామర్స్, మొబిలిటీ విభాగాల్లో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు తగ్గిపోయారు. వడగాలులు, అధిగ ఉష్ణోగ్రతలు, పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు విధులకు రావట్లేదు.
UPI Payment: యూపీఐ పేమెంట్ ఫెయిలైందా? వాట్సప్‌లో హెల్ప్‌లైన్ వాడుకోండి ఇలా
సిబ్బంది కొరత కారణంగా చాలా మంది కస్టమర్లు తమ ఆర్డర్‌ల డెలివరీలో జాప్యాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఐపీఎల్ సీజన్‌లో డిమాండ్ పెరగడం వల్ల ముంబై, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో జీనీ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేసింది స్విగ్గీ. ప్రస్తుతం 68 నగరాల్లో 65 నగరాల్లో జెనీ సేవలు అమల్లో ఉన్నాయి.
క్రికెట్, పండుగ సీజన్ ఫలితంగా ఫుడ్ ఆర్డర్స్, ఇన్‌స్టామార్ట్ సేవల వినియోగం పెరిగింది. దీంతో ఈ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, త్వరలో స్విగ్గీ జీనీని మళ్లీ ప్రారంభిస్తాం అని స్విగ్గీ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు కిరాణా, నిత్యావసరాల డెలివరీ సేవను నిలిపివేస్తున్నట్టు స్విగ్గీ ప్రకటించింది.
Android Smartphones: ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉందా? ఇక ఈ ఫీచర్ వాడుకోలేరు
ఇక జొమాటో విషయానికి వస్తే స్లాట్ బేస్డ్ డెలివరీ మోడల్ కావడంతో డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లో నాలుగు గంటల స్లాట్లు కూడా ఎంచుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు రెండో స్లాట్ ఎంచుకుంటే వారికి ప్రాధాన్యత ఇస్తోంది జొమాటో. అయితే పనిభారాన్ని తగ్గించడానికి రూపొందించిన ఈ మోడల్‌పై డెలివరీ పార్ట్‌నర్స్ సంతోషంగా లేరు. డెలివరీల సంఖ్యకు లిమిట్ పెట్టడంతో తమ ఆదాయాలపై ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
ఎండలు ఎక్కువవడం, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడం లాంటి కారణాలతో జొమాటో, స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌లు విధులకు రావట్లేదు. మెరుగైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారానే డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌ల హాజరును నిలకడగా చేయొచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Food, Food delivery, Swiggy, Zomato