సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ సపోర్ట్ (WhatsApp Support) పేరిట ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి యూజర్లను తమ వలలో పడేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సాల్వ్ చేస్తామని చెబుతూ వీరు వాట్సాప్ సపోర్ట్ ముసుగులో యూజర్లను నిండా ముంచేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) గత కొంత కాలంగా వాట్సాప్ (WhatsApp) యూజర్లను బాగా టార్గెట్ చేస్తున్నారు. ప్రజలు ఈ రోజుల్లో పేమెంట్స్‌తో(Payments) సహా పర్సనల్ ఇన్ఫర్మేషన్(Information) షేర్ చేసుకునే వరకు వాట్సాప్‌ను(WhatsApp) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే సైబర్(Cyber) మోసగాళ్లు ఈ యూజర్లను మోసగించేందుకు దొంగతెలివిని ప్రదర్శిస్తున్నారు. వీరు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాలను ఎంచుకొని యూజర్లకు టోకరా వేస్తూ పర్సనల్ డేటాతో(Personal Data) పాటు మనీ కొట్టేస్తున్నారు. ఇప్పుడు వీరు మళ్లీ వేరొక మోసానికి తెరలేపారు. సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ సపోర్ట్ (WhatsApp Support) పేరిట ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి యూజర్లను తమ వలలో పడేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని సాల్వ్ చేస్తామని చెబుతూ వీరు వాట్సాప్ సపోర్ట్ ముసుగులో యూజర్లను నిండా ముంచేస్తున్నారు. ఈ వాట్సాప్ స్కామ్ ఎలా జరుగుతుంది? దీని నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం.
చాలా మంది యూజర్లు నివేదించిన ప్రకారం, ఈ స్కామ్‌లో ఫేక్ వాట్సాప్ సపోర్ట్ అకౌంట్ నుంచి అపరిచిత వ్యక్తులు మెసేజ్ పంపుతారు. ఈ అకౌంట్ ప్రొఫైల్ ఫొటోలో ఫేక్ వెరిఫైడ్ (టిక్)తో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ విధంగా అది అసలైన వాట్సాప్ సపోర్టు అని యూజర్లను ఈ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు.
ఫేక్ వాట్సాప్ సపోర్ట్ స్కామ్: ఇది ఎలా పనిచేస్తుంది?
ఈ స్కామ్ చేసేవారు వాట్సాప్ సపోర్ట్ టీమ్‌కు చెందిన వారిలా నటిస్తారు. మీ అకౌంట్ బ్యాన్ లేదా డిలీట్ అవ్వకుండా ఉండాలంటే వ్యక్తిగత సమాచారాన్ని తమతో పంచుకోవాలని వీరు యూజర్లకు మెసేజ్‌లు పంపుతారు. నిజంగానే అకౌంట్ బ్లాక్ అవుతుందని, వారు అడిగిన వివరాలన్నీ షేర్ చేసుకుంటే మీరు మోసపోయినట్లే. వాస్తవానికి వాట్సాప్ దాని సపోర్ట్ అకౌంట్ నుంచి అదంతట అదే ఎవరికీ మెసేజ్ పంపదు. వ్యక్తిగత విషయాలను అస్సలు అడగదు.
మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎప్పుడూ అడగదు. ఈ వివరాలన్నీ వాట్సాప్ ప్లాట్‌ఫామ్‌కు ఉపయోగపడవు. ఇది మీరు ఇతర కాంటాక్ట్‌లతో చాట్ చేయడానికి మాత్రమే హెల్ప్ అవుతుంది. ఇండియా వంటి కొన్ని దేశాలలో ఇది పేమెంట్ ఫెసిలిటీ కూడా అందిస్తోంది. ఇందుకు ఇది యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లేదా యూపీఐ ఎకోసిస్టమ్ ద్వారా ట్రాన్సాక్షన్లు పూర్తి చేస్తుంది. మీ పేమెంట్ డీటెయిల్స్ వాట్సాప్ లేదా కంపెనీలు ఏ సర్వర్‌లో స్టోర్ కావు.
ఫేక్ వాట్సాప్ సపోర్ట్ అకౌంట్‌ను ఎలా గుర్తించాలి?
వాట్సాప్ సపోర్ట్ అకౌంట్ కాంటాక్ట్ పేరు పక్కనే కాకుండా ప్రొఫైల్ ఫొటోలో వెరిఫైడ్ టిక్ ఉంటే అది ఫేక్ అని అర్థం చేసుకోవాలి. ఇలాంటి ప్రొఫైల్ పిక్ తో ఉన్న అకౌంట్స్ మీకు మెసేజ్ వస్తే వాటిని బ్లాక్ చేయండి. అలాగే ఆ అకౌంట్లకు రిపోర్ట్ కొట్టండి. ఒక్క వాట్సాప్‌లో మాత్రమే కాదు యూజర్లు యాప్స్, వెబ్‌సైట్స్ యాక్సెస్ చేస్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వాట్సాప్ లేదా మరేదైనా ప్లాట్‌ఫామ్ ల్లో తెలియని లేదా అవిశ్వసనీయమైన సోర్సుల నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ కార్డ్ నంబర్ లేదా ఓటీపీ వంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అటువంటి ఖాతాలతో ఎప్పుడూ షేర్ చేయవద్దు. ఇలాంటి స్కామ్‌లు ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. అలాంటి స్కామర్ల వలలో చిక్కుకోకుండా తమను తాము రక్షించుకునేందుకు యూజర్లు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.