Home /News /technology /

ALERT FOR WHATSAPP USERS WHATSAPP SERVICES WILL NOT AVAILABLE IN THESE 30 ANDROID SMARTPHONES AND IPHONES CHECK FULL LIST HERE SS

WhatsApp: అలర్ట్... ఈ 30 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... లిస్ట్ ఇదే

WhatsApp: అలర్ట్... ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... లిస్ట్ ఇదే
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: అలర్ట్... ఈ స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు... లిస్ట్ ఇదే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ పనిచేయట్లేదా? మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నట్టైతే వాట్సప్ సేవలు (WhatsApp Services) నిలిచిపోయే అవకాశం ఉంది. మరో 30 పాత మొబైల్స్‌లో సేవల్ని నిలిపివేసింది వాట్సప్. ఆ 30 స్మార్ట్‌ఫోన్ల జాబితా ఇదే.

ఇంకా చదవండి ...
    మీరు పాత స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? అయితే అలర్ట్. పాత స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోతున్నాయి. వాట్సప్ యాజమాన్య సంస్థ అయిన మెటా ఎప్పటికప్పుడు పాత స్మార్ట్‌ఫోన్లను గుర్తించి వాటిలో వాట్సప్ (WhatsApp) సేవల్ని నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో జాబితా రిలీజ్ చేసింది. సాంసంగ్, సోని, ఎల్‌జీ, యాపిల్‌కు చెందిన కొన్ని మోడళ్ల స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ సేవల్ని నిలిపివేసినట్టు వార్తలొస్తున్నాయి. వాట్సప్ యాప్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. యూజర్లు కూడా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్నారు. పాత మొబైళ్ల సంఖ్య తక్కువగా ఉంటోంది. కాబట్టి వాటికి సేవల్ని నిలిపివేస్తోంది వాట్సప్.

    తాజాగా మరో 30 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. 2022 జనవరి నుంచే ఆ ఫోన్లలో వాట్సప్ అందుబాటులో ఉండదు. బ్రెజిల్‌లో యూజర్లు వాడుతున్న పాత మొబైల్స్‌లో వాట్సప్ యాప్ సేవలు లభించవని వార్తలు వస్తున్నాయి. అయితే బ్రెజిల్ మాత్రమే కాదు... ఆ మోడల్ స్మార్ట్‌ఫోన్ ఏ దేశంలో ఉపయోగిస్తున్నా వారు వాట్సప్ ఉపయోగించలేరు. భారతీయ యూజర్లకు కూడా ఇది వర్తిస్తుంది. మరి తాజాగా వాట్సప్ సేవలు నిలిచిపోయిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఏవో తెలుసుకోండి.

    UPI offline: మొబైల్ డేటా లేకపోయినా యూపీఐ పేమెంట్స్... *99# సర్వీస్ వాడుకోండి ఇలా

    వాట్సప్ సేవలు నిలిచిపోయిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే...


    Apple iPhone SE (16GB, 32 GB, and 64GB)
    Apple iPhone 6S (32GB and 64GB)
    Apple iPhone 6S Plus (16GB, 32GB, 64GB, and 128 GB)
    Apple iPhone 6S (128 GB)
    Apple iPhone 6s (16gb)
    Archos 53 Platinum
    Caterpillar Cat B15
    Faea F1
    HTC Desire 500
    Huawei Ascend D2
    Huawei Ascend G740
    Huawei Ascend Mate
    Lenovo A820
    LG Act
    LG Lucid 2
    LG Optimus F3
    LG Optimus F3Q
    LG Optimus F5
    LG Optimus F6
    LG Optimus F7
    LG Optimus L2 II
    LG Optimus L3 II
    LG Optimus L3 II Dual
    LG Optimus L4 II
    LG Optimus L4 II Dual
    LG Optimus L5 II
    LG Optimus L5 II Dual
    LG Optimus L7 II
    LG Optimus L7 II Dual
    Mini Samsung Galaxy S3
    Samsung galaxy Ace 2
    Samsung galaxy core
    Samsung Galaxy Trend II
    Samsung galaxy trend lite
    Samsung Galaxy Xcover 2
    Sony Xperia M
    THL W8
    Vico darkknight
    Vico sync five
    ZTE Grand Memo
    ZTE Grand S Flex
    ZTE grand x quad v987
    ZTE V956 – UMI X2

    Xiaomi 11 Lite NE 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... ఆఫర్ 4 రోజులే

    మరి ఈ పాత స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నవారు ఏం చేయాలి?


    ఓసారి యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అయితే ఆండ్రాయిడ్ 4.1 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఓఎస్ అప్‌డేట్ అందుబాటులో ఉంటే స్మార్ట్‌ఫోన్ అప్‌డేట్ చేయాలి. ఇక ఐఫోన్ యూజర్లు ఐఓఎస్ 9 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్‌కు అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత యూజర్లు వాట్సప్ ఇన్‌స్టాల్ చేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Android, Apple, Iphone, Smartphone, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు