ALERT FOR WHATSAPP USERS IMMEDIATELY DELETE WHATSAPP DELTA AND GBWHATSAPP TO AVOID ACCOUNT BAN SS
WhatsApp: వాట్సప్ బదులు ఈ యాప్స్ వాడుతున్నారా? అయితే డేంజరే
WhatsApp: వాట్సప్ బదులు ఈ యాప్స్ వాడుతున్నారా? అయితే డేంజరే
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp | వాట్సప్ యూజర్లకు అలర్ట్. మీరు వాట్సప్ బదులు మాడిఫైడ్ యాప్స్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ (WhatsApp Account Blocked) కావొచ్చు. మరేం చేయాలో తెలుసుకోండి.
వాట్సప్ ఇండియాలోనే కాదు... ప్రపంచంలోనే పాపులర్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్. వాట్సప్‌కు (WhatsApp) టెలిగ్రామ్, సిగ్నల్, డిస్కార్డ్ లాంటి ఇతర యాప్స్ నుంచి పోటీ ఉంది. అయితే మెటా (Meta) యాజమాన్యంలో ఉన్న వాట్సప్‌కు యూజర్ బేస్ ఎక్కువ కావడంతో ప్రత్యర్థులు దగ్గర్లోకి కూడా రాలేకపోతున్నారు. అయితే ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఉపయోగకరమైన ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. దీంతో యూజర్లు థర్డ్ పార్టీ డెవలపర్స్ రూపొందించే మోడెడ్ వర్షన్స్ అంటే మాడిఫికేషన్ చేసిన వాట్సప్ యాప్స్ ఉపయోగిస్తున్నారు. వాట్సప్ డెల్టా, జీబీవాట్సప్ లాంటివి అలాంటి యాప్సే. ఇందులో వాట్సప్‌లో లేని ఫీచర్స్ ఉన్నందుకు వీటిని ఉపయోగించడానికి ఆసక్తి చూపిస్తున్నారు యూజర్లు.
వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ ప్రస్తుతం గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్స్టోర్స్లో లేవు. వీటిని ఈ ప్లాట్‌ఫామ్స్‌లో నిషేధించాయి ఆ యాప్ స్టోర్స్. అయితే థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ చాలా వెబ్‌సైట్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఫైల్స్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్న యూజర్లు లక్షల్లో ఉన్నారు.
వాట్సప్ అందించలేని ఫీచర్స్‌ని వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ వర్షన్స్ అందిస్తున్నాయని వీటిని డౌన్లోడ్ చేస్తే చిక్కుల్లో పడ్డట్టే. వాట్సప్ అధికారిక యాప్ తప్ప ఎట్టిపరిస్థితుల్లో ఇతర యాప్స్ ఉపయోగించకూడదని వాట్సప్ అనేక సార్లు హెచ్చరించింది. మీరు వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఉపయోగిస్తున్నట్టైతే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి అధికారిక వాట్సప్ ఉపయోగించండి.
వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ లాంటి మోడెడ్ యాప్స్ ఉపయోగిస్తే మీ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ FAQ పేజీలో వివరించింది. "మీరు అధికారిక యాప్‌కు మారకపోతే మీ అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తాం. ఆ తర్వాత వాట్సప్ ఉపయోగించకుండా శాశ్వతంగా నిషేధం విధించే అవకాశం ఉంది" అని వాట్సప్ తెలిపింది.
మాడిఫికేషన్ వర్షన్స్ అయిన వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఉపయోగిస్తున్నందుకు ప్రతీ నెలా లక్షలాది మందిని వాట్సప్ బ్లాక్ చేస్తోంది. సెప్టెంబర్‌లో 22 లక్షల అకౌంట్స్‌ని, ఆగస్టులో 20.7 లక్షల అకౌంట్లను, జూన్ 16 నుంచి జూలై 31 మధ్య 30 లక్షలకు పైగా అకౌంట్లను బ్లాక్ చేసింది. మాడిఫికేషన్ వర్షన్స్ ఉపయోగిస్తున్నారన్న కారణంతో పాటు వాట్సప్ పాలసీలు ఉల్లంఘించారని ఇలా ప్రతీ నెలా లక్షల అకౌంట్స్‌ని బ్లాక్ చేస్తోంది.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో వాట్సప్ లోగోతో కనిపించే యాప్స్ చాలా ఉంటాయి. వాటిని చూసి వాట్సప్ అనుకోవద్దు. WhatsApp LLC డెవలపర్ పేరుతో WhatsApp Messenger అని యాప్ ఉంటుంది. ఆ యాప్ మాత్రమే ఉపయోగించాలి. సో... వెంటనే మీ స్మార్ట్ఫోన్లోంచి వాట్సప్ డెల్టా, జీబీ వాట్సప్ ఇతర మాడిఫికేషన్ యాప్స్ డిలిట్ చేయండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.