హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా?

WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా?

WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Hijack: మీ వాట్సప్ అకౌంట్‌ని సింపుల్‌గా హైజాక్ చేసేస్తారు... ఎలాగో తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Hijack | వాట్సప్‌లో మరో కొత్త స్కామ్ బయటపడింది. యూజర్ల వాట్సప్ అకౌంట్‌ని (WhatsApp Account) హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కొత్త ట్రిక్ కనిపెట్టారు.

వాట్సప్‌కి సంబంధించి రోజుకో కొత్త స్కామ్ బయటపడుతూనే ఉంటుంది. దీంతో వాట్సప్ యూజర్లకు చిక్కులు తప్పట్లేదు. వాట్సప్ ప్రపంచంలోనే పాపులర్ మెసేజింగ్ యాప్ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచమంతా కలిపి 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు (WhatsApp Users) ఉంటారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. అంటే మొత్తం వాట్సప్ యూజర్లలో సుమారు 25 శాతం మంది భారతీయులే. కోట్లాది మంది యూజర్లు ఉన్న వాట్సప్‌ని హ్యాకర్లు (Hackers) నిత్యం టార్గెట్ చేస్తూనే ఉంటారు. వారి ఆటకట్టించేందుకు వాట్సప్ అనేక చర్యల్ని తీసుకుంటున్నా కొత్తకొత్త మోసాలు బయటకు వస్తున్నాయి.

కొత్తగా వాట్సప్ ఓటీపీ స్కామ్ బయటపడింది. యూజర్ల నెంబర్లకు ఓటీపీ పంపించటం ద్వారా స్కామర్లు వాట్సప్ అకౌంట్‌ని హ్యాక్ చేస్తున్నారు. దీంతో యూజర్ల వాట్సప్ అకౌంట్ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్తోంది. ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థకు చెందిన ఫౌండర్ రాహుల్ శశి యూజర్ల వాట్సప్ ఎలా హైజాక్ అవుతుందో లింక్డ్‌ఇన్‌లో వివరించారు.

WhatsApp: ఆ సమస్యకు పరిష్కారం కనిపెట్టిన వాట్సప్... యూజర్లకు గుడ్ న్యూస్

ముందుగా హ్యాకర్లు యూజర్లకు కాల్ చేస్తారు. ఆ తర్వాత **67*<10 digit mobile number> నెంబర్ లేదా *405*<10 digit mobile number> డయల్ చేయాలని కోరతారు. దీంతో జియో, ఎయిర్‌టెల్ యూజర్లకు కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత ఎటాకర్ వాట్సప్ అకౌంట్‌లో లాగిన్ అయి కాల్ ద్వారా ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ చెప్పారంటే అంతే సంగతులు. యూజర్ల వాట్సప్ అకౌంట్ హ్యాక్ అవుతుంది. యూజర్ల వాట్సప్ అకౌంట్ నుంచి హ్యాకర్లు లాగిన్ అవుతారు.

ఇలా రకరకాల ట్రిక్కులతో యూజర్ల వాట్సప్ అకౌంట్స్‌ని హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. గతేడాది కూడా ఇలాంటి ట్రిక్కులు ఉపయోగించారు. ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ పంపి యూజర్ల అకౌంట్స్‌ని హైజాక్ చేశారు. ఓటీపీ ఎంటర్ చేయకపోతే మీ వాట్సప్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుందని నమ్మించి మోసం చేశారు.

Smartphone Offer: ఈ మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,500 తగ్గింపు

భారతదేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో స్కామర్లు ఇలాంటి మోసాలకే పాల్పడుతున్నారు. పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే యూజర్లు తమ ఓటీపీని షేర్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. సాధారణంగా లాగిన్ సమయంలో ఆథెంటికేషన్ కోసం వాట్సప్ 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపిస్తుంది. ఎస్ఎంఎస్ ద్వారా లేదా కాల్ ద్వారా ఓటీపీ పొందొచ్చు. ఈ ఓటీపీ ఎట్టిపరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదు. ఒకవేళ మీకు పదేపదే ఇలాంటి ఓటీపీలు వస్తుంటే ఎవరికీ షేర్ చేయొద్దు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీ చెప్పాలని, ఓటీపీ చెప్పకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని, డీయాక్టివేట్ అవుతుందని బెదిరించినా పట్టించుకోవద్దు.

First published:

Tags: Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు