Alert for WhatsApp users: వాట్సాప్ యూజర్లకు మరో ముప్పు.. వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి..

ప్రతీకాత్మక చిత్రం

వాట్సాప్ వినియోగదారులకు కొత్త రకం సైబర్ దాడి పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని నుంచి తప్పించుకోవడానికి ఈ సెట్టింగ్స్ మార్చాలని సూచిస్తున్నారు.

  • Share this:
    WhatsApp యొక్క మంచి సెక్యూరిటీ ఫీచర్స్(Security Features) కారణంగా ఈ యాప్ వినియోగదారులు హ్యాకింగ్(Hacking) కు చేసే ప్రమాదం చాలా తక్కువ. కానీ వ్యక్తిగత నిర్లక్ష్యం కారణంగా డేటా హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం మాత్రం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో WhatsApp వినియోగదారులు తమ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి కొన్ని సెట్టింగ్‌(Settings)లను మార్చుకోవడం అవసరం. వాట్సాప్ వినియోగదారులు సాధారణంగా టెక్స్ట్ మెసేజ్‌లు, వీడియోలు, ఫోటోలు, పిడిఎఫ్ ఫైల్‌లను పంపడం చేస్తుంటారు. ఒకవేళ వినియోగదారుడు అటో డౌన్ లోడ్ ఆప్షన్ ను ఎంచుకుంటే , ఆ ఫైల్ అనుమతి లేకుండా డౌన్‌లోడ్ చేయబడుతుంది. హ్యాకర్లు దీనిని క్యాచ్ చేసుకుని మొబైల్ మరియు యాప్ డేటాను ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, వినియోగదారులు WhatsApp లో డైరెక్ట్ డౌన్‌లోడ్‌ను ఆఫ్ చేయడం ద్వారా తమ డేటాను సేవ్ చేసుకోవచ్చు.

    ఖాతాల్లోకి ఎలా చొరబడతారంటే..
    డార్క్ నెట్‌లోని ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో హ్యాకర్లు మీ ఖాతాలోకి  చొరబడతారు. మొదటగా హ్యాకర్లు మీ మొబైల్ నంబర్‌కు PDF ఫైల్‌లను పంపుతారు. మీరు ఆటో డౌన్ లోడ్ ఆప్షన్ ఎంపిక చేసి ఉంటే ఆ పీడీఎఫ్ ఫైల్ మీకు తెలియకుండా డౌన్‌లోడ్ అవుతుంది. దీని తర్వాత ప్రత్యేక సాఫ్ట్‌వేర్ మీ డేటాను సర్వర్‌కు అందిస్తుంది. హ్యాకర్లు మీ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను బదిలీ చేస్తారు. దీని తర్వాత హ్యాకర్లు మీ వ్యక్తిగత డేటాను ఉపయోగించి మీతో ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఇది మాత్రమే కాదు, మీ వ్యక్తిగత డేటా వందలాది మందికి చేరుతుంది. తద్వారా మీ ప్రైవసీ దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఆటో డౌన్ లోడ్ ను అన్ సెలక్ట్ చేయండి. ఇందు కోసం ఈ స్టెప్స్ ఫాలో కండి.
    Whatsapp: వాట్సాప్ లో చిన్న పొరపాటు చేసిన మహిళ.. ఫలితంగా రూ. 3 లక్షలు లాస్.. అసలు ఏమైందంటే?

    -మొదటగా మీ మొబైల్ లోని వాట్సాప్ యాప్ ఓపెన్ చేయండి.
    -యాప్ లో కుడివైపున పై భాగంలో మూడు చుక్కలు కనిపిస్తాయి. ఆ చుక్కులపై క్లిక్ చేయండి.
    -అనంతరం మీకు Settings ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
    -Storage and data అనే మరో ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
    -When using mobile data, When Connected on Wi-Fi, When roaming అనే మూడు ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి.
    -ఈ మూడు ఆప్షన్స్ ను ఓపెన్ చేస్తే Photos, Audio, Videos, Documents అనే నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని అన్ సెలక్ట్ చేయాలి.
    -ఇలా చేయడం ద్వారా మీ డేటాకు సెక్యూరిటీ లభించడం తో పాటు అనవసరంగా మొబైల్ డేటా కూడా వృథా కాదు.
    Published by:Nikhil Kumar S
    First published: